...
...
Next Story

Serial Timings: స్టార్ మా సీరియల్స్ వేళల్లో బిగ్ ఛేంజ్..ఇవాళ నుంచే కొత్త టైమింగ్స్..4 ప్రధాన సీరియల్స్ షెడ్యూల్ మార్పు!

Serial Timings: ​బుల్లితెర దిగ్గజం స్టార్ మా తమ ప్రధాన సీరియళ్ల ప్రసార వేళలను మళ్లీ మార్చింది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ కావడంతో 4 సీరియల్స్ టైమింగ్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ నుంచి గోదావరి, నువ్వు లేక నేను లేను, ఇల్లు ఇల్లాలు పిల్లలు, పొదరిల్లు టైమింగ్స్ ఏంటో చూసేయండి.

Published on: Sep 7, 2026, 05:45:22 IST
Advertisement

Serial Timings: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న స్టార్ మా ఛానెల్ తమ అర్లీ ప్రైమ్‌టైమ్ షెడ్యూల్‌ను పూర్తిగా మార్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 7) నుంచి కొత్త టైమింగ్స్ ప్రకారం ఈ రోజువారీ సీరియల్స్ సోమవారం నుంచి శనివారం వరకు వారంలో ఆరు రోజులు ప్రసారం కానున్నాయి.

స్టార్ మా సీరియల్స్

స్టార్ మా సీరియల్స్ వేళల్లో బిగ్ ఛేంజ్..ఇవాళ నుంచే కొత్త టైమింగ్స్..4 ప్రధాన సీరియల్స్ షెడ్యూల్ మార్పు!
స్టార్ మా సీరియల్స్ వేళల్లో బిగ్ ఛేంజ్..ఇవాళ నుంచే కొత్త టైమింగ్స్..4 ప్రధాన సీరియల్స్ షెడ్యూల్ మార్పు!

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ గ్రాండ్ గా లాంఛ్ అయింది. ఈ నేపథ్యంలో స్టార్ మా తన ప్రైమ్ టైమ్ సీరియల్స్ టైమింగ్ ను మళ్లీ మార్చింది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:00 గంటలకు ‘గోదావరి’ సీరియల్ ప్రసారం కానుంది. ఆ వెంటనే సాయంత్రం 6:30 గంటలకు ‘నువ్వు లేక నేను లేను’ సిరీయల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

​రాత్రి 7:00 గంటల ముఖ్యమైన ప్రైమ్‌టైమ్ స్లాట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ప్రసారం కానుండగా, ఆ తర్వాతి స్లాట్ అయిన రాత్రి 7:30 గంటలకు ‘పొదరిల్లు’ సీరియల్ ప్రసారమవుతుంది.

స్టార్ మా మాస్టర్ ప్లాన్

​స్టార్ మా ఈ నాలుగు కీలక సీరియళ్ల టైమింగ్స్‌ను ఒకేసారి మార్చడం వెనుక బలమైన నెట్‌వర్క్ వ్యూహం దాగి ఉంది. ‘బిగ్ బాస్ తెలుగు 10’ రియాలిటీ షో రాత్రి 9:30 గంటల స్లాట్‌లో ప్రసారం అవుతుంది. దానికి ముందుగానే సాయంత్రం 6:00 గంటల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ను టీవీ స్క్రీన్లకు కట్టిపడేయడం ద్వారా రాత్రి ప్రైమ్‌టైమ్‌కు బలమైన వ్యూయర్‌షిప్ బేస్‌ను ఛానెల్ సిద్ధం చేస్తోంది.

ఆ సీరియల్ తో

​ఇంతకుముందులా కాకుండా సోమవారం నుండి శనివారం వరకు ఆరు రోజుల పాటు నాన్-స్టాప్‌గా డ్రామా ఎపిసోడ్లను అందించడం వల్ల వీక్షకులు డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లకుండా టీవీలకే పరిమితమవుతారు. శనివారం రోజు కూడా సీరియళ్లలో ఉత్కంఠభరితమైన ట్విస్ట్‌లు రానుండటం ప్రేక్షకులకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

సండే కూడా

స్టార్ మా ఇటీవల ఆదివారం కూడా సీరియల్స్ ప్రసారమవుతాయని ప్రకటించి సంచలనం క్రియేట్ చేసింది. టీవీ ఆడియన్స్ ను పూర్తిగా తన వైపు తిప్పుకొనే ప్లాన్ వేసింది. కానీ ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ కావడంతో సీరియల్స్ టైమింగ్ లో మార్పులు చేయక తప్పలేదు. ఈ కొత్త టైమింగ్స్ సోమవారం నుంచి శనివారం వరకు అని స్టార్ మా ప్రకటించింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks