Star Maa Serials: స్టార్ మా టాప్ సీరియల్స్‌తో మెగా ప్రోమో.. ఏ సీరియల్ ఏ టైమ్‌కి రానుందో చూడండి..

Star Maa Serials: స్టార్ మా సీరియల్స్ సంబరాలతో సందడే సందడి అంటూ సరికొత్తగా ఓ కాంబో ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో ఆ ఛానెల్లోని టాప్ సీరియల్స్ టైమింగ్స్ తోపాటు ప్రస్తుతం వాటిలో నడుస్తున్న కథలోని ముఖ్యమైన పాయింట్లతో ఈ ప్రోమోను రూపొందించడం విశేషం.

Published on: Jul 21, 2026, 14:34:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Star Maa Serials: స్టార్ మా (Star Maa) తమ ప్రైమ్‌టైమ్ సీరియల్స్‌తో తెలుగు బుల్లితెరపై సరికొత్త రచ్చ మొదలుపెట్టింది. నిత్యం రేటింగ్స్ చార్ట్‌లలో నెంబర్ వన్ స్థానంలో నిలిచే ఈ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ తాజాగా ఒక గ్రాండ్ 'కాంబో ప్రొమో'ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. కుటుంబ బంధాలు, ఎమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ఎలివేట్ చేస్తూ వచ్చిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Star Maa Serials: స్టార్ మా టాప్ సీరియల్స్‌తో మెగా ప్రోమో.. ఏ సీరియల్ ఏ టైమ్‌కి రానుందో చూడండి..
Star Maa Serials: స్టార్ మా టాప్ సీరియల్స్‌తో మెగా ప్రోమో.. ఏ సీరియల్ ఏ టైమ్‌కి రానుందో చూడండి..

స్టార్ మా కాంబో ప్రోమో

స్టార్ మా రిలీజ్ చేసిన ఈ సరికొత్త ప్రోమోలో ప్రతి ఇంట ఆనందాలు నింపే డిఫరెంట్ కథాంశాలను పరిచయం చేశారు. "స్టార్ మా సీరియల్స్ సంబరాలతో సందడే సందడి.. హృదయాలను హత్తుకునే బంధాల కథలు" అనే పవర్ ఫుల్ కాన్సెప్ట్‌తో స్టార్ మా వీక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.

పండగల సమయంలోనే కాకుండా, రోజూ సాయంత్రం ప్రైమ్‌టైమ్‌లో ప్రతి కుటుంబంలో చోటుచేసుకునే సెంటిమెంట్స్, ఆప్యాయతలను ఈ సీరియల్స్ ద్వారా ఎంతో రియలిస్టిక్‌గా చూపిస్తున్నారు. ఆ సీరియల్స్ ను ఇలా కాంబో ప్రోమోతో ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఏ సీరియల్ ఏ టైమ్‌కి వస్తుందంటే?

ఈ కాంబో ప్రోమో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10.30 గంటల మధ్య ప్రసారమయ్యే సీరియల్స్ అన్నింటినీ పొందుపరిచారు. మొదటగా సాయంత్రం 6 గంటలకు.. ఇంటింటి రామాయణం సీరియల్ టెలికాస్ట్ కానుంది.

ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు గోదావరి, 7 గంటలకు నువ్వు లేక నేను లేను, 7.30 గంటలకు ఇల్లు ఇల్లాలు పిల్లలు, 8 గంటలకు కార్తీక దీపం 2, 8.30 గంటలకు ఏ దేవి వరమో నీవు, 9 గంటలకు గుండె నిండా గుడి గంటలు, 9.45 గంటలకు పొదరిల్లు సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నట్లు స్టార్ మా వెల్లడించింది.

టీఆర్పీ చార్ట్‌లలో అన్-స్టాపబుల్ జోరు

తెలుగు జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ (GEC) రేసులో స్టార్ మా ఎప్పటికప్పుడు సరికొత్త బెంచ్‌మార్క్స్ క్రియేట్ చేస్తూ వస్తోంది. కార్తీక దీపం 2, గుండె నిండా గుడి గంటలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంటింటి రామాయణం, పొదరిల్లులాంటి సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో దుమ్ము రేపుతున్నాయి.

కేవలం టెలివిజన్ స్క్రీన్‌పైనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో కూడా ఈ షోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుండటం ఈ ఛానెల్ క్రేజ్‌కు నిదర్శనం. ప్రైమ్‌టైమ్ స్లాట్స్‌లో వస్తున్న ప్రతి కథాంశం ఆడియన్స్ మనసులను కట్టిపడేసేలా ఉండటంతో నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

ఇతర ఛానెల్స్‌తో పోలిస్తే స్టార్ మా తమ సీరియల్స్ ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్‌ప్లే వేగంలో ఎంతో కేర్ తీసుకుంటుంది. ఒక సినిమా రేంజ్ లో గ్రాండ్ సెట్టింగ్స్, సినిమాటిక్ విజువల్స్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఉపయోగించడం వల్ల ఆడియన్స్ వీటిని బాగా ఆదరిస్తున్నారు.

ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ కాంబో ప్రోమో రాబోయే ఎపిసోడ్లలో మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉండబోతున్నాయని హింట్ ఇస్తోంది. త్వరలోనే రాబోతున్న పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ ప్రత్యేక ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను డిజైన్ చేశారు.

ఇంటిల్లిపాదీ కలసి కూర్చుని చూసే క్లీన్ ఫ్యామిలీ డ్రామాలను ఆడియన్స్ ముందుకు తేవడమే తమ ముఖ్యమైన లక్ష్యమని ఈ ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది. బుల్లితెర ప్రియులకు రోజువారీ వినోదాన్ని డబుల్ చేస్తూ స్టార్ మా అందిస్తున్న ఈ కొత్త కంటెంట్ రాబోయే రోజుల్లో టీఆర్పీ చార్ట్‌లను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More