...
...
Next Story

స్టార్ మాలో దుమ్ము రేపిన కొత్త సీరియల్.. తొలి వారమే రికార్డు బ్రేకింగ్ టీఆర్పీ.. నేరుగా ఆరో స్థానానికి.. మీరు చూశారా?

స్టార్ మాలో కొత్తగా అడుగుపెట్టిన పొదరిల్లు సీరియల్ దుమ్ము రేపింది. తొలి వారమే రికార్డు బ్రేకింగ్ టీఆర్పీ సాధించింది. నేరుగా ఆరో స్థానానికి దూసుకురావడం విశేషం. తెలుగు టీవీ సీరియల్స్ 49వ వారానికి సంబంధించిన రేటింగ్స్ వచ్చేశాయి.

Published on: Dec 18, 2025, 13:45:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

స్టార్ మా ఛానెల్లో ఈ నెల మొదట్లో అంటే డిసెంబర్ 8న టెలికాస్ట్ అయిన సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ కోసం ఆ ఛానెల్ చేసిన వెరైటీ ప్రమోషన్లు సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. తొలి వారమే టీఆర్పీ రేటింగ్స్ లో ఈ సీరియల్ రికార్డు రేటింగ్ రావడం విశేషం. మరి తాజాగా 49వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో ఏ సీరియల్ ఏ స్థానంలో ఉందో చూడండి.

పొదరిల్లు సీరియల్ రికార్డు

స్టార్ మాలో దుమ్ము రేపిన కొత్త సీరియల్.. తొలి వారమే రికార్డు బ్రేకింగ్ టీఆర్పీ.. నేరుగా ఆరో స్థానానికి.. మీరు చూశారా?
స్టార్ మాలో దుమ్ము రేపిన కొత్త సీరియల్.. తొలి వారమే రికార్డు బ్రేకింగ్ టీఆర్పీ.. నేరుగా ఆరో స్థానానికి.. మీరు చూశారా?

స్టార్ మా ఛానెల్లో పొదరిల్లు అనే సీరియల్ డిసెంబర్ 8న అడుగుపెట్టింది. దీనికి తొలి వారమే ఏకంగా 8.78 రేటింగ్ నమోదైంది. కేవలం అర్బన్ మార్కెట్ చూస్తే.. ఇది 9.21గా ఉండటం విశేషం. వచ్చీ రావడంతోనే టాప్ 10 సీరియల్స్ లో ఆరో స్థానంలో నిలిచింది. స్టార్ మాలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది.

ఎలాగైనా తనతోపాటు తన అన్న, తమ్ముళ్లకు పెళ్లిళ్లు చేయాలని కలలు కనే ఓ యువకుడు.. పెళ్లిపై ఎన్నో ఆశలతో ఉన్న ఓ అమ్మాయి అసలు ఆడదిక్కే లేని ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటుందన్నదే ఈ సీరియల్ కథ.

“తను ఊహించుకున్న జీవితం ఒకటి.. కానీ పరిస్థితులు ఆమెను తీసుకెళ్లిన దారి మరోటి. ఇలాంటి పరిస్థితుల్లో మహాలక్ష్మి ఎలా ముందుకు వెళ్తుంది? తెలుసుకోవాలంటే తప్పక చూడండి” అనే క్యాప్షన్ తో స్టార్ మా ఈ సీరియల్ ప్రమోషన్లను చేసింది. అంతేకాదు తన ఛానెల్లో వచ్చే వివిధ సీరియల్స్ నటీనటులతోనూ ప్రమోషన్లు చేయించడం పొదరిల్లుకు బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది.

టాప్ 10 సీరియల్స్ ఇవే

ఇక ఇంటింటి రామాయణం సీరియల్ 12.03 రేటింగ్ తో నాలుగో స్థానంలో, చిన్ని సీరియల్ 10.39తో ఐదో స్థానంలో ఉన్నాయి. పొదరిల్లు ఆరో స్థానంలో ఉండగా.. నిండు మనసులు 8.61తో ఏడో స్థానానికి పడిపోయింది.

ఇక జీ తెలుగు నుంచి ఈసారి మూడు సీరియల్సే టాప్ 10లో ఉన్నాయి. మేఘ సందేశం 8.13 రేటింగ్ తో ఎనిమిదో స్థానంలో ఉండగా.. చామంతి (7.98), జగద్ధాత్రి (7.56) తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి. జయం (7.54), లక్ష్మీ నివాసం (7.52) సీరియల్స్ టాప్ 10లో చోటు కోల్పోయాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe