నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూస్ సంపాదించిన ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ఏదో తెలుసా? ప్రస్తుతం ఈ సిరీస్ చివరి సీజన్ రెండో వాల్యూమ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు 9 ఏళ్లలో ఏకంగా 120 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఈ సిరీస్ పేరు స్ట్రేంజర్ థింగ్స్.
స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ రికార్డు

నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హారర్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సిరీస్ మొత్తం కలిపి 1.2 బిలియన్ల (120 కోట్ల) వ్యూస్ మార్కును దాటి నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా చూసిన ఇంగ్లిష్ సిరీస్‌గా చరిత్ర సృష్టించింది.
ఈ వెబ్ సిరీస్‌ను 'డఫర్ బ్రదర్స్' సృష్టించారు. 1980వ దశకంలో సాగే ఈ కథ ప్రేక్షకులను అద్భుతమైన నోస్టాల్జియాను అందిస్తుంది. 2016, జులై 15న తొలి సీజన్ స్ట్రీమింగ్ మొదలైంది. మొత్తం 5 సీజన్లు, 42 ఎపిసోడ్ల పాటు సాగింది.
స్ట్రేంజర్ థింగ్స్ అసలు కథేంటంటే?
కథ అంతా అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో గల 'హాకిన్స్' అనే కల్పిత పట్టణంలో జరుగుతుంది. మొదటి సీజన్ ఒక చిన్న బాలుడు (విల్) వింతగా అదృశ్యం కావడంతో మొదలవుతుంది. అతన్ని వెతికే క్రమంలో స్నేహితులకు 'ఎలెవన్' (Eleven) అనే వింత శక్తులు గల అమ్మాయి పరిచయమవుతుంది.
మన ప్రపంచానికి సమాంతరంగా ఉండే ఒక చీకటి ప్రపంచమే 'అప్ సైడ్ డౌన్'. అందులో ఉండే డెమోగార్గాన్ వంటి భయంకరమైన రాక్షసులతో ఈ పిల్లల బృందం చేసే పోరాటమే ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశం. ఎలెవన్ (మిల్లీ బాబీ బ్రౌన్), మైక్, డస్టిన్, లూకాస్, విల్ అనే పిల్లలతో పాటు పోలీస్ చీఫ్ హాపర్, జాయిస్ బైర్స్ (విల్ తల్లి) ఈ మిస్టరీని ఛేదిస్తుంటారు.
చివరి సీజన్ (సీజన్ 5) ఎలా ఉందంటే?
'స్ట్రేంజర్ థింగ్స్' చివరి సీజన్ (సీజన్ 5) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సీజన్‌ను మూడు భాగాలుగా విడుదల చేస్తోంది. దీనిని మునుపటి సీజన్ల కంటే భారీ బడ్జెట్‌తో, సినిమా స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో తీర్చిదిద్దారు.
{{/usCountry}}'స్ట్రేంజర్ థింగ్స్' చివరి సీజన్ (సీజన్ 5) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సీజన్‌ను మూడు భాగాలుగా విడుదల చేస్తోంది. దీనిని మునుపటి సీజన్ల కంటే భారీ బడ్జెట్‌తో, సినిమా స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో తీర్చిదిద్దారు.
{{/usCountry}}సీజన్ 5 కథ 1987వ సంవత్సరంలో జరుగుతుంది. అప్ సైడ్ డౌన్ నుండి వచ్చిన ప్రధాన విలన్ 'వెక్నా' (Vecna) పట్టణాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుండగా, హాకిన్స్ టీమ్ అతనిపై చేసే అంతిమ యుద్ధం చుట్టూ కథ తిరుగుతుంది.
ఈ చివరి సీజన్ తొలి వాల్యూమ్ నవంబర్ 26న, రెండో వాల్యూమ్ డిసెంబర్ 26న రాగా.. చివరిదైన మూడో వాల్యూమ్ డిసెంబర్ 31న రాబోతోంది. సీజన్ 5లో ఎపిసోడ్ల నిడివి చాలా ఎక్కువగా ఉంది. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 1 నుండి 2 గంటల వరకు ఉండటం విశేషం. ముఖ్యంగా చివరి ఎపిసోడ్ ఒక పూర్తి స్థాయి సినిమా లాగా ఉండబోతోంది. ఇది కూడా ఈ సిరీస్ కు 120 కోట్ల వ్యూస్ రావడానికి ఓ కారణంగా చెప్పొచ్చు.