Web Series OTT: 8 భాషల్లో ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్- ట్విన్ సిస్టర్ హత్యకు రివేంజ్- ఈ వెబ్ సిరీస్ చూసేందుకు 5 కారణాలు!

Student Of The Year After Dark Web Series OTT: ఓటీటీలోకి ఇవాళ ఓ అదిరిపోయే వెబ్ సిరీస్ వచ్చేసింది. రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ సిరీస్ పేరు.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’. ఏకంగా 8 భాషల్లో ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టిన ఈ సిరీస్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 

Published on: Nov 13, 2026, 13:48:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Student Of The Year After Dark Web Series OTT: బాలీవుడ్ కల్ట్ క్యాంపస్ ఫ్రాంచైజీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఇప్పుడు సరికొత్త అవతారమెత్తింది. లవ్, రొమాన్స్ పక్కనపెట్టి ఫుల్ డార్క్ క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్‌గా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' (Student Of The Year: After Dark) పేరుతో వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జియోహాట్‌స్టార్ (JioHotstar)లో తెలుగుతో సహా ఏకంగా 8 భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఇంటెన్స్ సిరీస్‌ను ఎందుకు మిస్ కాకూడదో తెలిపే 5 కారణాలు ఇక్కడ చూద్దాం.

8 భాషల్లో ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్- ట్విన్ సిస్టర్ హత్యకు రివేంజ్- ఈ వెబ్ సిరీస్ చూసేందుకు 5 కారణాలు!
8 భాషల్లో ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్- ట్విన్ సిస్టర్ హత్యకు రివేంజ్- ఈ వెబ్ సిరీస్ చూసేందుకు 5 కారణాలు!

రొమాన్స్ టు రివెంజ్

ఇప్పటివరకు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఫ్రాంచైజీ అనగానే కలర్ ఫుల్ కాలేజ్ క్యాంపస్, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, గ్రాండ్ డ్యాన్సులు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఈ వెబ్ సిరీస్ దానికి పూర్తి భిన్నం. స్టూడెంట్ లైఫ్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఒక డార్క్ క్రైమ్, రివెంజ్ డ్రామాను హై ఓల్టేజ్ సస్పెన్స్‌తో చూపించారు.

ఒక ఫ్రెష్ అండ్ గ్రిట్టీ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ కోసం, అలాగే స్టూడెంట్ పాలిటిక్స్ వెనుక ఉన్న చీకటి కోణాలను తెలుసుకోవడం కోసం దీన్ని కచ్చితంగా చూడాలి.

షనయా కపూర్ ద్విపాత్రాభినయం

ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ షనయా కపూర్ డ్యూయల్ రోల్‌లో అదరగొట్టింది. ట్విన్ సిస్టర్స్ గా రెండు విభిన్నమైన, సంక్లిష్టమైన పాత్రల్లో ఆమె నటన ఈ సిరీస్‌కే ప్రధాన హైలైట్‌గా నిలిచింది. నెగెటివ్ షేడ్స్, డీప్ ఎమోషనల్ వేరియేషన్స్ ఉన్న రెండు క్యారెక్టర్లలో ఆమె పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది.

8 భాషల్లో పాన్ ఇండియా అప్పీల్

సాధారణంగా ఇలాంటి బాలీవుడ్ క్రైమ్ సిరీస్‌లు ఓటీటీలో కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషలకే పరిమితం అవుతుంటాయి. కానీ పాన్ ఇండియా ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని జియోహాట్‌స్టార్ దీనిని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, భోజ్‌పురి.. ఇలా ఏకంగా 8 భాషల్లో అందుబాటులోకి తెచ్చింది.

సీట్ ఎడ్జ్ సస్పెన్స్

క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్ అనగానే ప్రేక్షకులు కోరుకునేది ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే, ఊహించని మలుపులు. ఈ సిరీస్ ఆ విషయంలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్.. తర్వాత ఏం జరగబోతోందనే క్యూరియాసిటీని పెంచుతుంది. అసలు హంతకుడు ఎవరనే మిస్టరీ రివీల్ అయ్యే వరకు ఆడియన్స్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోవడం గ్యారెంటీ.

ప్రొడక్షన్ వాల్యూస్

కరణ్ జోహార్ ప్రొడక్షన్ అనగానే విజువల్స్ ఎంత రిచ్‌గా ఉంటాయో తెలిసిందే. ఈ సిరీస్ డార్క్ థీమ్ అయినప్పటికీ మేకింగ్ క్వాలిటీ, డార్క్ అకాడెమియా విజువల్స్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఒక వెబ్ సిరీస్ చూస్తున్నట్లు కాకుండా, ఒక హై-బడ్జెట్ థ్రిల్లర్ సినిమాను చూస్తున్న ఫీల్ ఇస్తాయి.

బింజ్ వాచ్

ఈ వీకెండ్‌లో రొటీన్ ఫ్యామిలీ డ్రామాలకు భిన్నంగా ఎదైనా కొత్తగా, ఇంటెన్స్‌గా ఉండే క్రైమ్ కంటెంట్ చూడాలనుకుంటే.. జియోహాట్‌స్టార్‌లో ఉన్న 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' మీకు బెస్ట్ ఆప్షన్. ఒక్క ఎపిసోడ్ చూశారంటే మొత్తం సిరీస్ కంప్లీట్ చేసేవరకు వదలరు. మీ ఇష్టమైన స్నాక్స్ రెడీ చేసుకుని వెంటనే బింజ్ వాచ్ చేసేయండి!

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More