Web Series OTT: ఈ వారం ఓటీటీలో చూడాల్సిన రెండు వెబ్ సిరీస్‌లు.. టైమ్ ట్రావెల్, రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్.. ఒకే ఓటీటీలో!
Web Series OTT: ఓటీటీ లవర్స్ వీకెండ్ ను మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చేందుకు పాపులర్ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ రెండు సిరీస్ లతో రాబోతుంది. ఇందులో ఒకటి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా.. ఇంకోటి క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ గా రూపొందింది. ఈ సిరీస్ లు ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
Web Series OTT: జియోహాట్‌స్టార్ (JioHotstar) రెండు అదిరిపోయే వెబ్ సిరీస్‌లతో ఈ వారం ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. సరికొత్త టైమ్-ట్రావెల్ కాన్సెప్ట్‌తో 'పుష్పక విమానం', క్రైమ్ అండ్ థ్రిల్లర్ అంశాలతో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' వెబ్ సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. ఈ వారం మీరు తప్పక చూడాల్సిన ఈ టాప్ 2 సిరీస్‌ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

పుష్పక విమానం ఓటీటీ
గతంలోకి వెళ్లి మన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వస్తున్న సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ 'పుష్పక విమానం' (Pushpaka Vimanam). హీరో సాయి రోనక్ 'పుష్పక్ రావు' అనే లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సిరీస్‌కు సతీష్ రెడ్డి మల్లిడి దర్శకత్వం వహించారు.
కథ ఏంటంటే
తన జీవితంలో జరిగిన రెండు పెద్ద తప్పులను తలుచుకుంటూ బాధపడే ఒక యువకుడు.. అనుకోకుండా పదేళ్లు వెనక్కి (టైమ్ ట్రావెల్) వెళ్తాడు. అక్కడ అతను చేసే కొన్ని మార్పుల వల్ల, మళ్లీ వర్తమానంలోకి వచ్చేసరికి అతని జీవితం ఎలాంటి ఊహించని మలుపులు తిరిగింది అనేది ఈ సిరీస్ ప్రధాన కథాంశం. నవంబర్ 12 నుంచి ఈ కామెడీ డ్రామా సిరీస్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
2021లో ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘పుష్పక విమానం’ సినిమాకి, ఈ ఓటీటీ సిరీస్ కు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఓ మంచి టైమ్ ట్రావెల్ సిరీస్ చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ : ఆఫ్టర్ డార్క్
బాలీవుడ్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' నుంచి వస్తున్న సరికొత్త స్పిన్-ఆఫ్ వెబ్ సిరీస్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' (Student Of The Year: After Dark). కరణ్ జోహార్ నిర్మాణంలో రీమా మాయ (రీమా సేన్‌గుప్తా) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో షనాయ కపూర్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. దివిక్ శర్మ, మాన్య గ్రోవర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
కథ ఏంటంటే
సెయింట్ థెరిస్సా కాలేజీలో అత్యంత పాపులర్ అయిన ఒక యువతి.. అకస్మాత్తుగా గడ్డకట్టిన సరస్సులో శవమై కనిపిస్తుంది. ఆ మరణం వెనుక ఉన్న మిస్టరీని, చీకటి కోణాలను ఛేదించేందుకు ఆమె కవల సోదరి చేసే పోరాటమే ఈ సిరీస్ కథ. సాధారణ యూత్ ఫుల్ డ్రామాగా కాకుండా, ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
నవంబర్ 13 నుంచి జియోహాట్‌స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


