...
...
Next Story

Sudigali Sudheer: రష్మీతో లవ్ ట్రాక్.. కానీ సుడిగాలి సుధీర్‌కు ఆల్రెడీ పెళ్లయిపోయిందా? వైరల్ ఫొటోల వెనుక అసలు నిజం ఇదే!

Sudigali Sudheer: కమెడియన్ గా, యాంకర్ గా, హీరోగా సాగిపోతున్నాడు సుడిగాలి సుధీర్. ఈ మల్టీ టాలెంటెడ్ హీరోకు ఎంతో క్రేజ్ ఉంది. అయితే సుడిగాలి సుధీర్ కు పెళ్లి అయిపోయిందంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ ఫొటోల వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Oct 18, 2026, 06:20:12 IST
Advertisement

Sudigali Sudheer: బుల్లితెర స్టార్, టాలీవుడ్ హీరో సుడిగాలి సుధీర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంతో ట్రెండింగ్‌లో ఉండే సుధీర్.. ఈసారి ఏకంగా తన పెళ్లి ఫొటోలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాడు. సాంప్రదాయ దుస్తుల్లో, మెడలో పూలదండలతో, పక్కన అమ్మాయితో ఉన్న సుధీర్ ఫొటోలు సడన్‌గా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

వైరల్ ఫొటోల వెనుక సంచలన నిజం

రష్మితో లవ్ ట్రాక్.. కానీ సుడిగాలి సుధీర్‌కు ఆల్రెడీ పెళ్లయిపోయిందా? వైరల్ ఫొటోల వెనుక అసలు నిజం ఇదే!
రష్మితో లవ్ ట్రాక్.. కానీ సుడిగాలి సుధీర్‌కు ఆల్రెడీ పెళ్లయిపోయిందా? వైరల్ ఫొటోల వెనుక అసలు నిజం ఇదే!

సుడిగాలి సుధీర్ పక్కన ఒక అమ్మాయి వధువు దుస్తుల్లో ఉండటం, ఆ వేడుకలో జబర్దస్త్ కమెడియన్లు చలాకీ చంటి, ధనరాజ్, రాకింగ్ రాకేష్ వంటి వారు కనిపించడంతో.. సుధీర్‌కు ఇప్పటికే రహస్యంగా పెళ్లయిపోయిందా? అనే చర్చ జోరందుకుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ వైరల్ అవుతున్న ఫొటోలు పెళ్లివి కావు. అవి 2014 లో జరిగిన సుధీర్ నిశ్చితార్థం (Engagement) ఫొటోలు.

సుధీర్ ఎంగేజ్మెంట్

అప్పట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో సుధీర్‌కు ఒక అమ్మాయితో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కానీ, కొన్ని అనుకోని వ్యక్తిగత కారణాల వల్ల ఆ సంబంధం పెళ్లి పీటల వరకు వెళ్లకుండానే మధ్యలోనే రద్దయింది. పదేళ్ల క్రితం నాటి ఆ పాత ఫొటోలను ప్రస్తుతం ఎవరో లైక్స్, వ్యూస్ కోసం మళ్లీ వైరల్ చేయడంతో ఈ గందరగోళం మొదలైంది. ప్రస్తుతం సుధీర్ పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారనేది అసలు నిజం.

మెజీషియన్ టు టాలీవుడ్ హీరో

విజయవాడకు చెందిన సుధీర్ ఆనంద్ బయానా.. రూపాయి లేకుండా కెరీర్ ప్రారంభించి ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది. 2006 లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సాధారణ మెజీషియన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన "జబర్దస్త్" కామెడీ షో సుధీర్ జాతకాన్నే మార్చేసింది. తనదైన కామెడీ టైమింగ్, డ్యాన్స్, మ్యాజిక్ స్కిల్స్‌తో "సుడిగాలి సుధీర్" టీమ్‌ లీడర్‌గా ఎదిగి తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు.

రష్మీతో లవ్ ట్రాక్

బుల్లితెరపై సత్తా చాటిన సుధీర్.. ఆ క్రేజ్‌తో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2019 లో వచ్చిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాతో హీరోగా మారిన సుధీర్, ఆ తర్వాత 3 మంకీస్ చిత్రంలో నటించాడు. ఇక 2022 లో విడుదలైన గాలోడు (Galodu) చిత్రం మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్‌ సాధించింది.

ప్రస్తుతం సుధీర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతను నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం గోట్ (G.O.A.T - Greatest Of All Time) విడుదలకు సిద్ధంగా ఉండగా, 'హైలెస్సో' వంటి క్రేజీ ప్రాజెక్టులు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks