Suhas Mandadi: వెరైటీ కాన్సెప్ట్ సినిమాలు, నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘మండాడి’ నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ డ్రామాలో సుహాస్ మునుపెన్నడూ చూడని ఇంటెన్స్, మాస్ అవతార్‌లో కనిపిస్తుండగా, సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్‌ను కూడా ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

RS ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, కల్ట్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ ప్రాజెక్ట్‌కి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండడం విశేషం.
బర్త్‌డే పోస్టర్‌లో సుహాస్ రఫ్ అండ్ రా లుక్
సుహాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్‌లో సుహాస్ ఒత్తయిన గడ్డం, చేతికి పెద్ద ఉంగరం, క్లాసిక్ వాచ్ ధరించి డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించారు.
సుహాస్ ఈ ఇంటెన్స్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. సుహాస్ మేకోవర్, చేతికి ఉన్న ఉంగరం, గడియారం ఇవన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ఈ పోస్టర్‌లో కనిపించే సామాన్లు, సుహాస్ లుక్ చూస్తుంటే ఏదో యాక్షన్ సీక్వెన్స్‌కి రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.
సెప్టెంబర్ 10న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్
‘మండాడి’ మూవీని సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా సందడి చేయనుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP’ అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తోంది. నటుడు సూరి, సుహాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సముద్రంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP’ అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తోంది. నటుడు సూరి, సుహాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సముద్రంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు
{{/usCountry}}ఈ మండాడి సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచేవి యాక్షన్ సీక్వెన్సెస్ అని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా బోట్లలో సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చెబుతున్నారు.
పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్, మహేష్ మాథ్యూ లాంటి ముగ్గురు పవర్‌ఫుల్ ఫైట్ మాస్టర్లు ఈ సినిమా యాక్షన్ బ్లాక్స్‌ను కొరియోగ్రాఫ్ చేశారు. యాక్షన్ విజువల్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయని నిర్మాతలు తెలిపారు.
టాప్ టెక్నికల్ టీమ్.. బిగ్ స్టార్ క్యాస్టింగ్
ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాలా శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తుండగా, ఎస్.ఆర్. కతిర్ సినిమాటోగ్రఫీ పర్యవేక్షిస్తున్నారు. ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా, డి.ఆర్.కె. కిరణ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. కంటెంట్, టెక్నికల్ వేల్యూస్ పరంగా ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.