...
...
Next Story

Sigma Trailer: తమిళనాడు సీఎం కొడుకే డైరెక్టర్.. సందీప్ కిషన్ హీరో.. సిగ్మా ట్రైలర్ రిలీజ్.. ఫుల్ యాక్షన్

Sigma Trailer: సందీప్ కిషన్ సిగ్మా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో సందీప్ కిషన్ సరసన్ ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్లో నటిస్తోంది.

Published on: Sep 18, 2026, 22:21:30 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Sigma Trailer: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్‌లో నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సిగ్మా' (Sigma) థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తమిళనాడు సీఎం దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ విజువల్స్, ఇంటెన్స్ ఫైట్ సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. డ్రగ్ మాఫియా కింగ్‌పిన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ట్రెజర్ హంట్, హైస్ట్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తున్నాయి.

దళపతి విజయ్ తనయుడి బిగ్ డెబ్యూ

Sigma Trailer: తమిళనాడు సీఎం కొడుకే డైరెక్టర్.. సందీప్ కిషన్ హీరో.. సిగ్మా ట్రైలర్ రిలీజ్.. ఫుల్ యాక్షన్
Sigma Trailer: తమిళనాడు సీఎం కొడుకే డైరెక్టర్.. సందీప్ కిషన్ హీరో.. సిగ్మా ట్రైలర్ రిలీజ్.. ఫుల్ యాక్షన్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ఈ సినిమాతో మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ సినిమాతోనే లండన్ ఫిల్మ్ అకాడమీలో నేర్చుకున్న మేకింగ్ స్కిల్స్ చూపిస్తూ హై-వోల్టేజ్ యాక్షన్ కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

డ్రగ్ మాఫియా, హైస్ట్ ఆధారంగా సాగే కథ

తాజాగా విడుదలైన ట్రైలర్ పరిశీలిస్తే సినిమా కథ మొత్తం ఒక పెద్ద డ్రగ్స్ నెట్‌వర్క్, దాని వెనుక ఉన్న మాఫియా కింగ్‌పిన్ చుట్టూ తిరుగుతుందని స్పష్టమవుతోంది. వేల కోట్ల రూపాయల నిధిని వెతికే క్రమంలో హీరో ఎలాంటి ప్లాన్స్ వేశాడు, శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మెయిన్ పాయింట్.

మైండ్ గేమ్స్, ఛేజింగ్ సీన్స్, ఊహించని ట్విస్టులు ట్రైలర్ వ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమె క్యారెక్టర్ కూడా యాక్షన్ మోడ్‌లో ఉండటం విశేషం. రాజు సుందరం, సంపత్ రాజ్, అన్బు దాసన్, యోగ్ జేపీ, కిరణ్ కొండ, మహాలక్ష్మి సుదర్శనన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

స్పెషల్ సాంగ్‌లో క్యాథరిన్ థ్రెసా హాట్ అప్పీల్

ఇప్పటికే ఈ పాట రికార్డింగ్, పిక్చరైజేషన్ విజువల్స్ పరంగా చాలా గ్రాండ్‌గా వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మాస్ ఆడియన్స్ కి ఈ సాంగ్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

సందీప్ కిషన్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్

వరసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్న సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన', 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్' చిత్రాలతో నటుడిగా తన మార్క్ చూపించారు. ఈ మధ్యే సూపర్ సుబ్బు పేరుతో నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన బోల్డ్ వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఇప్పుడు 'సిగ్మా' సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్‌లో మరో బిగ్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్, NVR సినిమా దక్కించుకున్నాయి. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ మల్టీలింగ్వల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. దసరా హాలిడే సీజన్ లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks