...
...
Next Story

Sundeep Kishan: డైరెక్షన్ రాదని సెట్లో ఏడ్చేశాడు.. నేనే దర్శకత్వం చేయాల్సి వచ్చింది.. సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్లు

Sundeep Kishan: సిగ్మా మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సందీప్ కిషన్ రెడీ అయ్యాడు. ఈ మూవీ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్న సందీప్ కిషన్.. ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Published on: Sep 29, 2026, 09:20:58 IST
Advertisement

Sundeep Kishan: తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'సిగ్మా' (Sigma). ఈ మూవీ ఈ శుక్రవారం (అక్టోబర్ 2) థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న యంగ్ హీరో సందీప్ కిషన్ షూటింగ్ సెట్‌లో తనకు ఎదురైన ఒక షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టాడు.

సందీప్ కిషన్ కామెంట్లు

డైరెక్షన్ రాదని సెట్లో ఏడ్చేశాడు.. నేనే దర్శకత్వం చేయాల్సి వచ్చింది.. సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్లు
డైరెక్షన్ రాదని సెట్లో ఏడ్చేశాడు.. నేనే దర్శకత్వం చేయాల్సి వచ్చింది.. సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్లు

సిగ్మా సినిమా ప్రమోషన్లలో హీరో సందీప్ కిషన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సదరు దర్శకుడి పేరు చెప్పడానికి నిరాకరించిన సందీప్, గతంలో ఓ సినిమా సెట్స్‌లో జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు.

‘‘షూటింగ్ ప్రారంభమైన రెండో రోజే ఆ కొత్త దర్శకుడు అందరి ముందూ ఏడవడం మొదలెట్టాడు. తనకు అసలు డైరెక్షన్ ఎలా చేయాలో తెలియడం లేదని చెప్పాడు. అప్పుడు ఎలా రియాక్టవలో నాకు తెలీలేదు. అందరూ నా వైపే చూశారు. ఆ విషయం ప్రొడ్యూసర్‌కు తెలిస్తే సినిమా ఆగిపోయేది’’ అని సందీప్ కిషన్ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.

సొంతంగా డైరెక్షన్

‘‘నేనే ధైర్యం చేసి ఒక పరిష్కారం కనుక్కొన్నా. తర్వాత వారం రోజులు నేనే దర్శకత్వం చేశా. ఆ తర్వాత వేరొకరు ఆ బాధ్యత తీసుకున్నారు. క్లైమాక్స్ ఏమో వేరొకరు డైరెక్ట్ చేశారు. కానీ సర్ ప్రైజింగ్ గా ఆ మూవీ బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది’’ అని సందీప్ కిషన్ పేర్కొన్నాడు. ఈ మూవీ థియేటర్లో మంచిగా ఆడటమే కాకుండా, ఆడియన్స్ కు బాగా నచ్చిందని సందీప్ కిషన్ తెలిపాడు.

డెబ్యూ డైరెక్టర్ జాసన్ సంజయ్

తొలి సినిమాకే జాసన్ చూపించిన మేకింగ్ స్టైల్ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని, ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం తన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సందీప్ ధీమా వ్యక్తం చేశాడు. అక్టోబర్ 2న థియేటర్లకు రాబోతున్న సిగ్మా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks