వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ లేటెస్ట్ బాలీవుడ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా అక్టోబర్ 2, 2025న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టనుంది.
సన్నీ సంస్కారి కి తులసి కుమారి ఓటీటీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఆమె నటించిన రీసెంట్ మూవీ ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’. ఇందులో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సాన్యా మల్హోత్రా, రోహిత్ సరఫ్ తదితరులు నటించారు. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
థియేటర్ రెస్పాన్స్
ధర్మా ప్రొడక్షన్స్ నిర్మించి, శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన సన్నీ సంస్కారి కి తులసి కుమారి మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. బలమైన తారాగణం, మంచి ఓపెనింగ్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ప్రభావాన్ని చూపడంలో విఫలమైంది. అక్టోబర్ 2, 2025న ఈ మూవీ రిలీజైంది. ముఖ్యంగా కాంతార చాప్టర్ 1తో పోటీ జాన్వీ సినిమాను దెబ్బకొట్టింది.
బాక్సాఫీస్ కలెక్షన్లు
రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కిన సన్నీ సంస్కారి కి తులసి కుమారి సినిమా వాణిజ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంది. అనేక పరిశ్రమ నివేదికల ప్రకారం దాని ప్రారంభ రోజున సుమారు రూ.9 కోట్లు వసూలు చేసింది. మొదటి వారం చివరి నాటికి బాక్సాఫీస్ వసూళ్లు సుమారు రూ.41.1 కోట్లుగా ఉన్నాయి. చివరకు ఈ మూవీ ఇండియాలో రూ.70 కోట్ల వరకు మాత్రమే ఖాతాలో వేసుకోగలిగింది.
సన్నీ సంస్కారి కి తులసి కుమారి కథ
సన్నీ సంస్కారి (వరుణ్ ధావన్),అనన్య (సాన్యా మల్హోత్రా) లవర్స్. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ తన పేరేంట్స్ ఒత్తిడి కారణంగా అనన్య.. విక్రమ్ (రోహిత్ సరఫ్)తో పెళ్లికి రెడీ అవుతుంది. మరోవైపు తాను ప్రేమించిన తులసి కుమారి (జాన్వీ కపూర్)ను విక్రమ్ వదులుకోవాల్సి వస్తుంది. తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం సన్నీ, తులసి కలిసి విక్రమ్, అనన్య పెళ్లి చెడగొట్టాలనుకుంటారు. కానీ ఈ క్రమంలో సన్నీ, తులసి మధ్య ప్రేమ మొదలవుతుంది.
{{/usCountry}}సన్నీ సంస్కారి (వరుణ్ ధావన్),అనన్య (సాన్యా మల్హోత్రా) లవర్స్. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ తన పేరేంట్స్ ఒత్తిడి కారణంగా అనన్య.. విక్రమ్ (రోహిత్ సరఫ్)తో పెళ్లికి రెడీ అవుతుంది. మరోవైపు తాను ప్రేమించిన తులసి కుమారి (జాన్వీ కపూర్)ను విక్రమ్ వదులుకోవాల్సి వస్తుంది. తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం సన్నీ, తులసి కలిసి విక్రమ్, అనన్య పెళ్లి చెడగొట్టాలనుకుంటారు. కానీ ఈ క్రమంలో సన్నీ, తులసి మధ్య ప్రేమ మొదలవుతుంది.
{{/usCountry}}సన్నీ, తులసి మధ్య కెమిస్ట్రీ కుదురుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? తమ మాజీ లవర్స్ ను వీళ్లు సొంతం చేసుకున్నారా? లేదా సన్నీ, తులసి ఒకటైపోయారా? అన్నది సినిమాలో చూడాల్సిందే.