Super Subbu OTT: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూట్ మార్చింది. తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేసిన ఈ ఓటీటీ ఓ కామెడీ వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మొదటి ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ఇవాళ ఈ సిరీస్ స్ట్రీమిండ్ డేట్ ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
సూపర్ సుబ్బు ఓటీటీ రిలీజ్

గ్లోబల్ ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మొట్టమొదటి పూర్తి స్థాయి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' జులై 2 నుంచి డిజిటల్ స్క్రీన్స్‌పైకి రాబోతోంది. సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (జూన్ 15) ప్రకటించారు.
టాలీవుడ్ మార్కెట్
సాధారణంగా నెట్‌ఫ్లిక్స్ అంటే 'రానా నాయుడు' లేదా 'సేక్రెడ్ గేమ్స్' లాంటి డార్క్, గ్రిట్టీ క్రైమ్ థ్రిల్లర్స్‌కు కేరాఫ్ అడ్రస్ అనే ముద్ర ఉంది. కానీ, టాలీవుడ్ లోకల్ మార్కెట్‌ను పూర్తిగా క్యాప్చర్ చేయాలంటే పక్కా రీజనల్ కామెడీయే ఏకైక మార్గమని ఈ గ్లోబల్ ప్లాట్‌ఫామ్ గ్రహించినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ సంస్థ నేరుగా నిర్మించిన ఫస్ట్ అఫీషియల్ తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు'ను వదులుతోంది.
ఐదు భాషల వ్యూహం
టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే సూపర్ సుబ్బు ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను కేవలం తెలుగు ఆడియన్స్ కోసమే కాకుండా.. ఒకేసారి హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్-ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తోంది. 'కమింగ్ సూన్' సెక్షన్‌లో హల్చల్ చేసిన ఈ సిరీస్ అఫీషియల్ డేట్ లాక్ అవ్వడంతో సందీప్ కిషన్ కెరీర్ లోనే ఇది అత్యంత కీలకమైన డిజిటల్ ప్రాజెక్ట్ గా మారబోతోంది.
ఇంట్రెస్టింగ్
'ఛోటా భీమ్' ఫేమ్ రాజీవ్ చిలకా, భరత్ లక్ష్మీపతులు తమ చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సిరీస్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. యానిమేషన్, కిడ్స్ కంటెంట్ లో టాప్ లో ఉన్న ఈ ప్రొడక్షన్ హౌస్.. ఒక మెయిన్ స్ట్రీమ్ లైవ్-యాక్షన్ వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టడం టాలీవుడ్ బిజినెస్ సర్కిల్స్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
{{/usCountry}}'ఛోటా భీమ్' ఫేమ్ రాజీవ్ చిలకా, భరత్ లక్ష్మీపతులు తమ చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సిరీస్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. యానిమేషన్, కిడ్స్ కంటెంట్ లో టాప్ లో ఉన్న ఈ ప్రొడక్షన్ హౌస్.. ఒక మెయిన్ స్ట్రీమ్ లైవ్-యాక్షన్ వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టడం టాలీవుడ్ బిజినెస్ సర్కిల్స్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
{{/usCountry}}బుల్లితెరపై నవ్వుల విందు
ఈ సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ లో కేవలం లీడ్ పెయిర్ సందీప్ కిషన్ - మిథిలా పాల్కర్ మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించగల ఒక భారీ కమెడియన్ల దండును రంగంలోకి దించారు. టాలీవుడ్ నవ్వుల రేడు బ్రహ్మానందం, సీనియర్ నటుడు మురళీ శర్మ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది, గెటప్ శ్రీను, మానస చౌదరి వంటి పాపులర్ నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇంతమంది స్టార్ కమెడియన్లు ఉన్నారంటే బుల్లితెరపై నవ్వుల విందు ఖాయమని స్పష్టమవుతోంది.
People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదలవుతుంది?
జవాబు: ఈ సిరీస్ జులై 2, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రశ్న: ఈ సిరీస్ ఏయే భాషల్లో అందుబాటులో ఉంటుంది?
జవాబు: నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తోంది.
ప్రశ్న: 'సూపర్ సుబ్బు' సిరీస్‌లో ముఖ్య నటీనటులు ఎవరు?
జవాబు: ఇందులో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రలు పోషించగా.. బ్రహ్మానందం, మురళీ శర్మ, సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.