...
...
Next Story

Surekha Vani: మీరే డిలీట్ చేస్తే మంచిది..నా అనుమతి లేకుండా షేర్ చేస్తే క్రిమినల్ యాక్షన్: వీడియో రిలీజ్ చేసిన సురేఖ వాణి

Surekha Vani Video: సీనియర్ టీవీ నటి సురేఖ వాణి పేరు మరోసారి సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఆమె పర్సనల్ వీడియో లీక్ అయింది అంటూ నెట్టింట చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఈ వీడియోను తన అనుమతి లేకుండా షేర్ చేస్తే క్రిమినల్ యాక్షన్ తీసుకుంటానని సురేఖ వాణి తాజాగా వీడియో ద్వారా వార్నింగ్ ఇచ్చారు.

Published on: Nov 7, 2026, 16:26:45 IST
Advertisement

Surekha Vani Video: తెలుగు సినీ అభిమానులకు సురేఖ వాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ సీనియర్ నటి అందరికీ పరిచయమే. ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించేశారు సురేఖ. కానీ తన కూతురు సుప్రీతతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ వైరల్ అవుతూనే ఉంటారు.

సురేఖ వాణి వీడియో వైరల్

మీరే డిలీట్ చేస్తే మంచిది..నా అనుమతి లేకుండా షేర్ చేస్తే క్రిమినల్ యాక్షన్: వీడియో రిలీజ్ చేసిన సురేఖ వాణి (instagram-Surekhavani)
మీరే డిలీట్ చేస్తే మంచిది..నా అనుమతి లేకుండా షేర్ చేస్తే క్రిమినల్ యాక్షన్: వీడియో రిలీజ్ చేసిన సురేఖ వాణి (instagram-Surekhavani)

తాజాగా సురేఖ వాణి పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆమె పర్సనల్ వీడియో ఒకటి లీక్ కావడమే ఇందుకు కారణం. ఆ వీడియోలో తనకంటే వయసులో చాలా చిన్నవాడైన ఓ యువకుడితో సురేఖ వాణి చాలా క్లోజ్ గా కనిపించారు. దీంతో ఈ వీడియో నెట్టింట మంట పెట్టింది. ఇంటర్నెట్ ను షేక్ చేస్తూనే ఉంది.

వార్నింగ్ ఇస్తూ

ఈ వీడియో తెగ వైరల్ కావడంతో సురేఖ వాణి అప్రమత్తమయ్యారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఈ పర్సనల్ వీడియోను షేర్ చేయొద్దని ఆమె ఇప్పటికే ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోతో వార్నింగ్ కూడా ఇచ్చారు.

కంప్లైంట్ ఇచ్చా

‘‘నిన్న నైట్ నుంచి నాపై ఏయే వీడియోలు వస్తున్నాయో.. ఎవరైతే ఏయో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మీద వాళ్లకు ఇష్టమొచ్చినట్లు రాసుకుంటున్నారో.. ఇలాంటి వాటివల్ల నేను తీవ్రంగా బాధపడుతున్నా. వాటిని డిలీట్ చేయమని ఆల్రెడీ సైబర్ కంప్లైంట్ ఇచ్చా. మీకుగా మీరే డిలీట్ చేస్తే మంచింది. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.

ఇప్పటికే సురేఖ వాణి పర్సనల్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కూతురు సుప్రీతకు పెళ్లి చేయాల్సిన వయసులో సురేఖాకు ఇలాంటివి అవసరమా? అని కొందరు విమర్శిస్తున్నారు. కొందరు మాత్రం సురేఖాకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఎవరి జీవితం వాళ్లదేనని కామెంట్లు చేస్తున్నారు.

సుప్రీత ప్రస్తుతం ఇండస్ట్రీలో కుదురుకునే ప్రయత్నాలు చేస్తోంది. అమరావతికి ఆహ్వానం సినిమాతో ఆమె బిగ్ స్క్రీన్ పై మెరిసింది. ఇప్పుడు బుల్లితెర, ఓటీటీల్లో డిఫరెంట్ షోలు చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks