...
...
Next Story

Surekha Vani: రెండో పెళ్లా? నా కూతురికే పెళ్లి వయసొచ్చింది.. నాకు నచ్చింది పోస్టు చేస్తా: సురేఖ వాణి

Surekha Vani: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లపై టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే తనకు నచ్చిన పోస్టు సోషల్ మీడియాలో పెడతానని తేల్చిచెప్పేసింది.

Published on: Aug 1, 2026, 15:56:07 IST
Advertisement

Surekha Vani: తెలుగు చిత్రసీమలో అక్క, వదిన, తల్లి పాత్రలతో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకాదరణ పొందుతున్న ప్రముఖ నటి సురేఖ వాణి (Surekhavani) సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా రెండో పెళ్లిపై వస్తున్న రూమర్లకు ఆమె చెక్ పెట్టింది.

సురేఖా వాణి రెండో పెళ్లి

రెండో పెళ్లా? నా కూతురికే పెళ్లి వయసొచ్చింది.. నాకు నచ్చింది పోస్టు చేస్తా: సురేఖ వాణి (x/surekha_vani)
రెండో పెళ్లా? నా కూతురికే పెళ్లి వయసొచ్చింది.. నాకు నచ్చింది పోస్టు చేస్తా: సురేఖ వాణి (x/surekha_vani)

కొన్ని సంవత్సరాల క్రితం భర్త మరణించిన తర్వాత సురేఖ వాణి తన కూతురు సుప్రీత (Supritha) బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు. తాజాగా తమిళ డబ్బింగ్ చిత్రం 'నిరమ్' (Niram) టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సురేఖ వాణి తన రెండో పెళ్లి గురించి మాట్లాడారు.

రెండో పెళ్లిపై వస్తున్న వార్తల గురించి విలేకరులు ప్రశ్నించగా, సురేఖ వాణి చిరునవ్వుతో తన శైలిలో సమాధానమిచ్చారు. "నాకు ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఎంతమాత్రం లేదు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన రాకపోవచ్చు. నా కూతురు సుప్రీతకే ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది. ఆమెకు పెళ్లి చేయాల్సిన సమయంలో నేను పెళ్లి చేసుకోవడం ఏంటి?" అని సురేఖ తెలిపారు.

ఎప్పుడో పెళ్లి

‘‘రెండో పెళ్లి చేసుకోవాలంటే ఎప్పుడో చేసుకునేదాన్ని. ఇన్ని రోజులు ఎందుకు ఆగేదాన్ని? నిజం చెప్పాలంటే.. నాకు మీడియా, సోషల్ మీడియా ఎప్పుడో రెండో పెళ్లి చేసేశాయి! నాపై ఇప్పటికే ఎన్నో కథనాలు రాసేశారు’’ అని సురేఖ చెప్పారు.

నాకు నచ్చినట్లు

టాలీవుడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం.. పర్సనల్ లైఫ్, సోషల్ మీడియా హడావుడిని దాటి సురేఖ వాణి ప్రస్తుతం ఒక కీలకమైన ఫేజ్‌లో ఉన్నారు. భర్తను కోల్పోయిన మహిళా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కాస్త సరదాగా లేదా గ్లామరస్‌గా కనిపిస్తే చాలు.. వారి లైఫ్‌స్టైల్‌ను టార్గెట్ చేస్తూ 'రెండో పెళ్లి' థంబ్‌నెయిల్స్ వేయడం యూట్యూబ్ అండ్ డిజిటల్ మీడియాలో ఒక కమర్షియల్ మోడల్‌గా మారిందనే విమర్శలు ఉన్నాయి.

ప్రస్తుతం సురేఖ వాణి కుమార్తె సుప్రీత టాలీవుడ్‌లో సోలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో తన కెరీర్, కూతురి భవిష్యత్తు మాత్రమే తన ప్రాధాన్యతలని సురేఖవాణి స్పష్టం చేయడం ద్వారా సోషల్ మీడియా క్లిక్‌బైట్ కల్చర్‌కు బలమైన కౌంటర్ ఇచ్చినట్లయింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe