Suriya Jyotika: చెన్నైలో రాజ భవనం వదిలేసి చిన్న ఫ్లాట్‌లోకి.. జ్యోతిక కోసం సూర్య తీసుకున్న నిర్ణయం వెనుక సీక్రెట్ ఇదే

Suriya Jyotika: విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సూర్య తాజా ఇంటర్వ్యూలో తన ముంబై లైఫ్ స్టైల్ గురించి వెల్లడించారు. అక్కడ తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలిపారు.

Published on: Aug 11, 2026, 15:21:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Suriya Jyotika: తమిళ స్టార్ హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక చెన్నైలోని తమ విలాసవంతమైన బంగ్లాను వదిలేసి ముంబైలోని ఓ చిన్న ఫ్లాట్‌కి ఎందుకు మారారో రివీల్ చేశారు. త్వరలోనే 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్య.. ప్రమోషన్ల క్రమంలో స్టార్ యాంకర్ సుమ ఇంటర్వ్యూలో తమ ముంబై లైఫ్‌స్టైల్ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Suriya Jyotika: చెన్నైలో రాజ భవనం వదిలేసి చిన్న ఫ్లాట్‌లోకి.. రెండడుగులు వేస్తే బెడ్‌రూమ్.. ముంబై లైఫ్‌స్టైల్‌పై సూర్య
Suriya Jyotika: చెన్నైలో రాజ భవనం వదిలేసి చిన్న ఫ్లాట్‌లోకి.. రెండడుగులు వేస్తే బెడ్‌రూమ్.. ముంబై లైఫ్‌స్టైల్‌పై సూర్య

కరోనా మహమ్మారి తర్వాత పిల్లలు దివ్య, దేవ్‌లతో కలిసి ఈ జంట ముంబైకి షిఫ్ట్ అయింది. అక్కడ చాలా సాధారణమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు సూర్య స్పష్టం చేశారు.

1700 చదరపు అడుగుల ఇల్లు.. రెండు అడుగులేస్తే అంతా అక్కడే

చెన్నైలో పెద్ద రాజభవనం లాంటి ఇంట్లో ఉన్న సూర్య-జ్యోతిక దంపతులు.. ముంబైలో కేవలం 1700 చదరపు అడుగుల చిన్న ఫ్లాట్‌లో ఉంటున్నట్లు చెప్పారు. "ముంబై నాకొక వెకేషన్ లాంటిది. అక్కడ మేం ఉండేది చాలా చిన్న ఇల్లు. రెండు అడుగులు వేస్తే బెడ్‌రూమ్, ఇంకో రెండు అడుగులు వేస్తే లివింగ్ రూమ్, డైనింగ్ ఏరియా వచ్చేస్తాయి" అని సూర్య నవ్వుతూ చెప్పుకొచ్చారు.

పిల్లలు దివ్య, దేవ్‌లను ఒక్క అడుగు దూరంలోనే పలకరించవచ్చని, ఆ ఇంట్లో ఎంతో ప్రేమ, మంచి అనుభవాలతో కూడిన జ్ఞాపకాలు ఉన్నాయని సూర్య పేర్కొన్నారు. చెన్నైలో బయటకొస్తే ఫ్యాన్స్ చుట్టుముడతారని, కానీ ముంబైలో సాధారణ వ్యక్తిలా స్వేచ్ఛగా తిరగడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.

సొంతంగా కాఫీ, బట్టలు ఐరన్..

ఈ ఇంటర్వ్యూలో సూర్య కో-స్టార్, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కూడా పాల్గొన్నారు. ముంబైలో సూర్య లైఫ్‌స్టైల్ గురించి రాధిక మాట్లాడుతూ.. "సూర్య ముంబై వెళ్లగానే మొదట చేసే పని తన ఐరన్ బట్టలు ఎక్కడున్నాయి, షూస్ ఎక్కడున్నాయి అని చూసుకోవడమే. తన కాఫీ తనే చేసుకుంటాడు" అని సీక్రెట్స్ రివీల్ చేశారు.

జ్యోతిక తన తల్లిదండ్రుల దగ్గర ఉండటం వల్ల ఎంత హ్యాపీగా ఉందో.. ఆ సంతోషం కుటుంబం మొత్తంలో కనిపిస్తోందని రాధిక అన్నారు. జ్యోతిక సంతోషంగా ఉంటే సూర్య కూడా అంతే ఆనందంగా ఉంటారని, ఆ పాజిటివ్ వైబ్ సూర్య ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని ఆమె చెప్పారు.

జ్యోతిక బాలీవుడ్ కంబ్యాక్.. పిల్లల భవిష్యత్తు కోసమే ఆ నిర్ణయం

కరోనా పాండమిక్ తర్వాత సూర్య-జ్యోతిక దంపతులు ముంబైకి మారడానికి ప్రధాన కారణం జ్యోతిక తల్లిదండ్రులు అక్కడ ఉండటమే. దాంతో పాటు జ్యోతిక బాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి, పిల్లలు సాధారణ వాతావరణంలో పెరగడానికి ఈ షిఫ్టింగ్ ఎంతగానో ఉపయోగపడింది.

ఇటీవలే జ్యోతిక బాలీవుడ్‌లో 'సైతాన్', 'శ్రీకాంత్' లాంటి సినిమాలతో రీఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్స్ కొట్టారు. గతంలో ముంబైలో సూర్య రూ. 70 కోట్ల విలువైన 9000 చదరపు అడుగుల బంగ్లా కొన్నారని వార్తలు వచ్చినప్పటికీ, తాజా ఇంటర్వ్యూలో తను 1700 చదరపు అడుగుల చిన్న ఇంట్లోనే ఉంటున్నట్లు స్పష్టం చేశారు.

'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ఆగస్టు 14న బాక్సాఫీస్ వార్

ఇక సినిమాల విషయానికి వస్తే సూర్య నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. 'సార్', 'లక్కీ భాస్కర్' లాంటి క్లాసిక్ హిట్స్ అందించిన వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

'ప్రేమలు' ఫేమ్ మమితా బైజూ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. 'కంగువ', కరుప్పు తర్వాత సూర్య నుంచి వస్తున్న ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More