...
...
Next Story

Suriya Jyothika: మాది పర్ఫెక్ట్ మ్యారేజ్ కాదు.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య, జ్యోతిక.. వీడియోలు వైరల్

Suriya Jyothika: సౌత్ ఇండియా మోస్ట్ పాపులర్ అండ్ అడోరబుల్ కపుల్ సూర్య, జ్యోతిక మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తమ 20 ఏళ్ల దాంపత్య జీవితాన్ని పురస్కరించుకుని మళ్లీ పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక చర్చిలో ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

Published on: Sep 16, 2026, 05:56:00 IST
Advertisement

Suriya Jyothika: తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ క్యూట్ అండ్ లవ్ జోడీగా సూర్య, జ్యోతికకు పేరు ఉంది. ఈ ఆదర్శవంతమైన జంట మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తమ 20 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య ప్రయాణాన్ని వేడుకగా జరుపుకుంటూ, కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రుల సమక్షంలో చర్చిలో మళ్లీ పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు.

జ్యోతిక, సూర్య పెళ్లి

మాది పర్ఫెక్ట్ మ్యారేజ్ కాదు.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య, జ్యోతిక.. వీడియోలు వైరల్
మాది పర్ఫెక్ట్ మ్యారేజ్ కాదు.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య, జ్యోతిక.. వీడియోలు వైరల్

ఈ స్పెషల్ ఈవెంట్ కోసం జ్యోతిక తెల్లటి బ్రైడల్ గౌనులో రెడీ అయింది. ఆమె చర్చిలోకి అడుగుపెడుతున్న సమయంలో సూర్య ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో సూర్యకు ఆయన సోదరుడు కార్తి పక్కనే ఉండి సహాయం చేసిన సరదా దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ దంపతులు ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని కొత్త ప్రమాణాలు చేసుకున్న అనంతరం సన్నిహితులు వారిపై పూలవర్షం కురిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

జ్యోతిక ఎమోషనల్ పోస్ట్!

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని జ్యోతిక సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది. తమది మాది పర్ఫెక్ట్ మ్యారేజ్ కాదని చెప్పుకొచ్చింది. లోటుపాట్లు, సర్దుబాట్లు, త్యాగాలు, ఒకరినొకరు నిస్వార్థంగా ప్రేమించుకోవడం వల్ల ఏర్పడిన అందమైన ప్రయాణమని జ్యోతిక పేర్కొంది.

తన భర్త సూర్య తనను తన కంటే ఎక్కువగా గౌరవిస్తారని, అందుకే ప్రతి రోజూ జీవితాన్ని వేడుకలా జరుపుకుంటానని జ్యోతిక చెప్పింది. తన పిల్లలు దియా, దేవ్‌లకు సరైన తల్లిగా ఉంటూ, సూర్యతో తనకున్న స్నేహాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని, రాబోయే మరో 20 ఏళ్ల ప్రయాణానికి సిద్ధంగా ఉన్నానని ఆనందం వ్యక్తం చేసింది.

జ్యోతిక, సూర్య మళ్లీ పెళ్లి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కపుల్ గోల్స్ అంటే ఇలా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సూర్య-జ్యోతిక దాంపత్య జీవితం కేవలం కోలీవుడ్ నటుల వ్యక్తిగత విషయంగా మాత్రమే కాకుండా, సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వివాహమైన రెండు దశాబ్దాల తర్వాత కూడా ఈ జంట పరస్పర గౌరవం, స్నేహ బంధాన్ని కొనసాగిస్తోంది. దానిని సోషల్ మీడియాలో పంచుకోవడం జెన్-జీ సహా ప్రతీ తరం ఆడియన్స్‌కు పాజిటివ్ వైబ్‌ను అందిస్తుంది. ఇద్దరూ వృత్తిపరమైన కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూనే, పిల్లల పెంపకం, సామాజిక విషయాలపై ఇచ్చే సందేశాలు వారి బ్రాండ్ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks