Veerabhadrudu Tv Premier: తమిళ స్టార్ సూర్య ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే అంతకంటే ముందు ‘కరుప్పు’ మూవీతో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు సూర్య. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ కరుప్పు మూవీ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో రిలీజైంది.
టీవీలోకి వీరభద్రుడు

కోలీవుడ్ స్టార్ సూర్య, త్రిష కృష్ణన్ జంటగా నటించిన‘వీరభద్రుడు’ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ ఆదివారం,సెప్టెంబర్ 27న సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ జీ తెలుగులో ప్రసారం కానుంది. తమిళంలో ‘కరుప్పు’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ వేదికగా తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది.
వీరభద్రుడు కలెక్షన్లు
తమిళంలో కరుప్పుగా రిలీజైన సూర్య సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగులో వీరభద్రుడిగా వచ్చి సత్తాచాటింది. మే 15, 2026న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.350 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.
ఓటీటీలోనూ అదుర్స్
థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలోనూ వీరభద్రుడు మూవీ అదరగొట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొన్ని వారాల పాటు వీరభద్రుడు మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగింది.
స్టోరీ ఏంటంటే?
ఆర్.జే. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన వీరభద్రుడు సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో యాక్షన్, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలను కలిపి చూపించారు.
బీను అనే అమ్మాయికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ కోసం బీనును తీసుకొని ఆమె తండ్రి కేరళ నుండి చెన్నైకి వస్తారు. అయితే, ఆపరేషన్ ఖర్చుల కోసం వాళ్లు తెచ్చుకున్న బంగారం దొంగతనానికి గురవుతుంది. సహాయం కోసం పోలీసులను, న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తారు. అయినా అవినీతి, కాలయాపన కారణంగా సమయానికి వైద్యం అందక బీను ప్రాణాలు కోల్పోతుంది.
దేవుడే దిగివస్తే
{{/usCountry}}బీను అనే అమ్మాయికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ కోసం బీనును తీసుకొని ఆమె తండ్రి కేరళ నుండి చెన్నైకి వస్తారు. అయితే, ఆపరేషన్ ఖర్చుల కోసం వాళ్లు తెచ్చుకున్న బంగారం దొంగతనానికి గురవుతుంది. సహాయం కోసం పోలీసులను, న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తారు. అయినా అవినీతి, కాలయాపన కారణంగా సమయానికి వైద్యం అందక బీను ప్రాణాలు కోల్పోతుంది.
దేవుడే దిగివస్తే
{{/usCountry}}కూతురిని కోల్పోయిన బాధలో ఉన్న ఆ తండ్రి.. తమకు అన్యాయం చేసిన వ్యవస్థపై ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతుంటాడు. న్యాయం కోసం తమ కులదైవమైన ‘వెట్టై కరుప్పు స్వామి’ని వేడుకుంటూ ఒక ప్రత్యేక పూజ నిర్వహిస్తాడు. అప్పుడా వీరభద్రుడు లాయర్ శరవణన్ (సూర్య) రూపంలో భూమిపైకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది వీరభద్రుడు సినిమాలో చూడాల్సిందే.