...
...
Next Story

Suriya: వెంకీ అట్లూరితో బయోపిక్ చేయాల్సింది.. కానీ అందుకే ఆపేశాం.. సూర్య బిగ్ రివీల్.. ఆ పీరియాడిక్ కథ ఎవరిదంటే?

Suriya: తమిళ వర్సటైల్ స్టార్ సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య సంచలన విషయాన్ని వెల్లడించాడు. ఈ స్టార్ హీరో కామెంట్లు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి.

Published on: Aug 12, 2026, 10:28:20 IST
Advertisement

Suriya: కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సూర్య, వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons). 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సూర్య కామెంట్స్ వైరల్ గా మారాయి.

సూర్య కామెంట్స్

వెంకీ అట్లూరితో బయోపిక్ చేయాల్సింది.. కానీ అందుకే ఆపేశాం.. సూర్య బిగ్ రివీల్.. ఆ పీరియాడిక్ కథ ఎవరిదంటే?
వెంకీ అట్లూరితో బయోపిక్ చేయాల్సింది.. కానీ అందుకే ఆపేశాం.. సూర్య బిగ్ రివీల్.. ఆ పీరియాడిక్ కథ ఎవరిదంటే?

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ దర్శకుడు వెంకీ అట్లూరి మేకింగ్ విజన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

"దుల్కర్ సల్మాన్‌తో వెంకీ తీసిన 'లక్కీ భాస్కర్' సినిమా చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది. ఆ వెంటనే వెంకీ దర్శకత్వంలో ఎలాగైనా ఒక సినిమా చేయాలని మనసులో బలంగా అనుకున్నాను’’ అని సూర్య తెలిపారు.

నాగవంశీ ఫోన్ చేసి

‘‘నా కోరిక దేవుడు విన్నాడేమో.. వెంటనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ ఫోన్ చేసి 'వెంకీ అట్లూరి డేట్స్ ఖరారయ్యాయి, మీ కాంబోలో సినిమా సెట్ చేద్దాం' అని చెప్పారు. అలా ఈ కాంబినేషన్ సాధ్యమైంది" అని సూర్య వెల్లడించారు.

ఆ బయోపిక్

ఈ వేదికపై సూర్య ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని బయటపెట్టారు. వెంకీ అట్లూరి మొదట తన వద్దకు ఒక బయోపిక్ కథతో వచ్చారని తెలిపారు. "నాగవంశీ కాంబినేషన్ ఒకే చేశాక, వెంకీ నా దగ్గరకు ఒక పవర్ ఫుల్ బయోపిక్ స్క్రిప్ట్ తెచ్చారు. ఆ కథ వినగానే చాలా బాగా అనిపించింది. కానీ ఆ సినిమాను మేం చేయలేదు" అని సూర్య చెప్పారు.

అదే కారణం

సూర్య కూడా సుదీర్ఘ విరామం తర్వాత మనసుకు హాయినిచ్చే ఒక క్లీన్ ఫ్యామిలీ, ఎమోషనల్ అండ్ హ్యూమరస్ డ్రామా చేయాలని భావించడంతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' కథ పట్టాలెక్కింది.

ఎవరి కథ?

అయితే వెంకీ అట్లూరి, సూర్య కాంబోలో రావాల్సి ఉండి ఆగిపోయిన ఆ బయోపిక్ ఏ మహానాయకుడిది లేదా ఏ క్రీడాకారుడిది అనే దానిపై ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks