Karuppu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, స్టార్ బ్యూటీ త్రిష జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేట కొనసాగిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది.
తమిళనాడులో సరికొత్త రికార్డు

గత తొమ్మిది నెలలుగా తమిళ చిత్రసీమలో ఏ సినిమాకూ సాధ్యం కాని అరుదైన రికార్డును 'కరుప్పు' సొంతం చేసుకుంది. కేవలం తమిళనాడులోనే ఈ సినిమా రూ. 100 కోట్ల వసూళ్ల మార్కును దాటేసింది. ఈ చిత్రాన్ని తమిళనాడులో పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శక్తివేలన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
"నా డిస్ట్రిబ్యూషన్ ప్రయాణంలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద కరుప్పు రూ. 100 కోట్ల మార్కును దాటడం నాకెంతో గర్వంగా, భావోద్వేగంగా ఉంది. ఈ విజయాన్ని మాటల్లో వర్ణించలేను" అని ఆయన ఎక్స్ లో రాసుకొచ్చారు.
గత ఏడాది ఆగస్టులో విడుదలైన రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ ల భారీ చిత్రం 'కూలీ' (తమిళనాడులో రూ. 144 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 518 కోట్లు) తర్వాత అక్కడ రూ. 100 కోట్లు సాధించిన ఏకైక తమిళ చిత్రంగా 'కరుప్పు' నిలిచింది.
'కరుప్పు' బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు
ఈ కరుప్పు మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూళ్ల వివరాలు చూస్తే.. ఇండియాలో తొలి వారం నెట్ వసూళ్లు రూ.113.85 కోట్లుగా ఉన్నాయి. ఇక 8 రోజులకు రూ.121.65 కోట్లకు చేరాయి. ఓవర్సీస్ వసూళ్లు చూస్తే గ్రాస్ రూ.60 కోట్లుగా ఉంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.200.86 కోట్లు వసూలు చేసింది.
ఈ కలెక్షన్లలో అత్యధిక భాగం తమిళ వెర్షన్ నుంచే వచ్చినప్పటికీ, తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో విడుదలైన వెర్షన్ కూడా రెండు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ విజయంతో 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా, అలాగే సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'కరుప్పు' సరికొత్త రికార్డు సృష్టించింది.
దైవిక కథతో మెప్పించిన ఆర్జే బాలాజీ
{{/usCountry}}ఈ కలెక్షన్లలో అత్యధిక భాగం తమిళ వెర్షన్ నుంచే వచ్చినప్పటికీ, తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో విడుదలైన వెర్షన్ కూడా రెండు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ విజయంతో 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా, అలాగే సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'కరుప్పు' సరికొత్త రికార్డు సృష్టించింది.
దైవిక కథతో మెప్పించిన ఆర్జే బాలాజీ
{{/usCountry}}ఫిల్మ్‌మేకర్ కమ్ యాక్టర్ ఆర్జే బాలాజీ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రత్నకుమార్, అశ్విన్ రవిచంద్రన్‌లతో కూడిన బృందం స్క్రీన్‌ప్లే అందించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో సూర్య, త్రిష, ఆర్జే బాలాజీలతో పాటు ఇంద్రన్స్, అనఘా మాయా రవి, నట్టి సుబ్రమణ్యం, శ్వాసిక కీలక పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
గ్రామ దేవత అయిన 'వెట్టై కరుప్పు' (వేట కరుప్పు).. కష్టాల్లో ఉన్న ఒక తండ్రి, కూతురికి న్యాయం చేయడం కోసం 'శరవణన్' అనే లాయర్ రూపంలో భూమిపైకి రావడం ఈ సినిమా ముఖ్య కథాంశం. ఆర్థిక ఇబ్బందుల వల్ల మే 15న ఒకరోజు ఆలస్యంగా విడుదలైనప్పటికీ, పవర్‌ఫుల్ ఫస్టాఫ్, నటీనటుల అద్భుతమైన నటనతో ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'కరుప్పు' సినిమా తెలుగు టైటిల్ ఏమిటి?
సూర్య నటించిన తమిళ చిత్రం 'కరుప్పు' తెలుగులో 'వీరభద్రుడు' అనే పేరుతో విడుదలైంది.
2. ఈ కరుప్పు మూవీ వారం రోజుల్లో ఎంత వసూలు చేసింది?
ఈ చిత్రం విడుదలైన 8 రోజుల్లో భారతదేశంలో రూ. 121.65 కోట్ల నెట్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 200.86 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
3. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన రికార్డు ఏమిటి?
గత 9 నెలల్లో తమిళనాడులో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి తమిళ చిత్రంగా 'కరుప్పు' నిలిచింది. అంతకుముందు 2025 ఆగస్టులో వచ్చిన రజనీకాంత్ 'కూలీ' ఈ ఘనత సాధించింది.