RJ Balaji: సినిమా చూసి.. గట్టి గట్టిగా అరిచి.. త్రిషను హగ్ చేసుకొని.. థియేటర్లో కరప్పు డైరెక్టర్ హంగామా.. వీడియో వైరల్
RJ Balaji: తాను డైరెక్ట్ చేసిన కరప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమా చూసి థియేటర్లోనే డైరెక్టర్ ఆర్జే బాలాజీ గట్టిగట్టిగా అరుస్తూ, సెలబ్రేట్ చేసుకోవడం, పక్కనే ఉన్న త్రిషను హగ్ చేసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
RJ Balaji: ఎన్నో అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, ఆఖరి నిమిషంలో విడుదల వాయిదా.. వీటన్నింటినీ తట్టుకుని సూర్య నటించిన 'కరుప్పు' (Karuppu) శుక్రవారం (మే 15) థియేటర్లలోకి వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్లో ఎమోషనల్ అయ్యారు. ఆయన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'జెర్సీ' సీన్‌ను గుర్తు చేసిన బాలాజీ
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమాలో నాని తన విజయాన్ని రైల్వే స్టేషన్లో అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. సరిగ్గా అదే తరహాలో 'కరుప్పు' సినిమాకు థియేటర్లో వస్తున్న స్పందన చూసి బాలాజీ ఆనందంతో అరిచారు. గాల్లోకి పిడికిలి బిగించి, భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న హీరోయిన్ త్రిష, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్, సూర్య తమ్ముడు కార్తీ.. బాలాజీని చూసి ముసిముసి నవ్వులు చిందించారు. సినిమా ముగిశాక ఫ్యాన్స్ అందరూ బాలాజీ పేరును గట్టిగా పలకడంతో ఆయన వెక్కివెక్కి ఏడ్చేశారు. వెంటనే త్రిష ఆయనను హగ్ చేసుకుని ఓదార్చారు. "ఇది కదా అసలైన విజయం అంటే" అంటూ అభిమానులు ఈ వీడియోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.
వివాదాల మధ్య విడుదల
నిజానికి ఈ సినిమా గురువారమే (మే 14) విడుదల కావాల్సి ఉంది. కానీ నిర్మాత ఎస్ఆర్ ప్రభుకు ఎదురైన ఆర్థిక సమస్యల వల్ల థియేటర్లకు వెళ్లాల్సిన కేడీఎం (KDM) ఫైల్స్ ఆగిపోయాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ సినిమా కోసం ఉదయం 9 గంటల షోలకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ, మొదటి రోజు ప్రదర్శనలు రద్దయ్యాయి. ఒకవైపు సౌత్ ఇండియాలో షోలు క్యాన్సిల్ అయితే, మరోవైపు 'క్యూబ్' సంస్థ పొరపాటున ముంబై, పూణే ప్రాంతాల్లో సినిమాను ప్లే చేసింది. దీనివల్ల పైరసీ భయం పట్టుకుంది.
రూ.140 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా మొదటి రోజే రూ.25 కోట్ల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఒక రోజు ఆలస్యమైనా, టాక్ పాజిటివ్‌గా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద 'కరుప్పు' గర్జన గట్టిగానే వినిపిస్తోంది.
కరుప్పు మూవీ విశేషాలు
ఆర్జే బాాలాజీ డైరెక్ట్ చేసిన కరుప్పు మూవీలో సూర్య, త్రిష కృష్ణన్, కార్తీ (అతిథి పాత్ర)లాంటి వాళ్లు నటించారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించాడు. యోగి బాబు, ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అభిమానులు సోషల్ మీడియాలో చాలా వరకు పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'కరుప్పు' సినిమా ఒక రోజు ఆలస్యంగా ఎందుకు విడుదలైంది?
నిర్మాణ సంస్థ 'డ్రీమ్ వారియర్ పిక్చర్స్' ఎదుర్కొన్న ఆర్థిక లావాదేవీల చిక్కుల వల్ల మే 14న విడుదల కావాల్సిన సినిమా మే 15కి వాయిదా పడింది.
2. కరుప్పు సినిమాలో సూర్య నటనకు ఎలాంటి స్పందన వస్తోంది?
సూర్య ఈ సినిమాలో లాయర్‌గా, మాస్ యాక్షన్ రోల్‌లో అదరగొట్టారని, ఆయన కెరీర్‌లో ఇది పక్కా కమర్షియల్ హిట్ అని రివ్యూలు వస్తున్నాయి.
3. ఆర్జే బాలాజీ ఎందుకు ఏడ్చారు?
సినిమా విడుదల కోసం గత కొన్ని రోజులుగా ఆయన పడ్డ కష్టం, టెన్షన్.. చివరకు సినిమా హిట్ అని తెలియగానే ఆనందభాష్పాలుగా మారాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


