ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2.. సినిమా నుంచి తప్పుకున్న ఆ నటుడు.. క్యారెక్టర్ అలాగే ఉంటుందన్న డైరెక్టర్

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ లవర్స్ కు ఓ షాక్. ఈ నగరానికి ఏమైంది సినిమాలో కీలకమైన కార్తీక్ క్యారెక్టర్ ప్లే చేసిన సుశాంత్ రెడ్డి పార్ట్ 2కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. 

Published on: Jan 22, 2026, 09:29:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2018లో థియేటర్లలో రిలీజైన ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ ఎంతటి హిట్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమా యూత్ కు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నలుగురు ఫ్రెండ్స్ గోవా ట్రిప్ కామెడీతో పాటు డీప్ మెసేజ్ ను కూడా అందిస్తుంది. ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్. అయితే పార్ట్ 2 నుంచి ఓ కీలక నటుడు తప్పుకొన్నాడు.

sai sushanth reddy (instagram-Sai Sushanth Reddy)
sai sushanth reddy (instagram-Sai Sushanth Reddy)

ఈ నగరానికి ఏమైంది రిపీట్

ఈ నగరానికి ఏమైంది రిపీట్ అనే టైటిల్ తో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తెరకెక్కించనున్నాడు తరుణ్ భాస్కర్. ఇప్పటికే పార్ట్ 2 అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ నగరానికి ఏమైంది మూవీ పార్ట్ 1లో కీలక పాత్ర పోషించిన సాయి సుశాంత్ రెడ్డి ఈ సీక్వెల్ కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అధికారికంగా వెల్లడించాడు.

తరుణ్ భాస్కర్ ఏమన్నాడంటే?

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కు సుశాంత్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడని తరుణ్ భాస్కర్ వెల్లడించాడు. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో భారీ పోస్ట్ పంచుకున్నాడు ఈ డైరెక్టర్.

‘‘పర్సనల్ రీజన్స్ తో సుశాంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం లేదని తెలిసి మనసు ముక్కలైంది. అందుకే టైమ్ తీసుకుని మళ్లీ అదే ఫీల్ వస్తుందా? లేదా? అని స్క్రిప్ట్ చెక్ చేసుకున్నా. అప్పుడే ఈ క్యారెక్టర్స్ నా చుట్టూ ఉన్నాయనిపించింది. నా సొంత ఫ్రెండ్ షిప్ తోనే ఈఎన్ఈ (ఈ నగరానికి ఏమైంది) ప్రపంచం ఏర్పడింది. అదే పునాది’’ అని తరుణ్ భాస్కర్ తన స్టోరీలో రాసుకొచ్చాడు.

ఎప్పుడో వచ్చేది

‘‘ఈఎన్ఈ 2 అనేది కేవలం డబ్బు కోసమే కాదు. అలా అయితే ఈ మూవీ ఎప్పుడో వచ్చేది. సరైన టైమ్ లో ఆర్గానికల్ గా స్టోరీ వచ్చింది కాబట్టే మూవీ తీశాం. ఈ క్యారెక్టర్స్ అంటే నాకెంతో ఇష్టం. నన్నెంతో ఇన్ స్పైర్ చేశాయి. సుశాంత్ ఈ జర్నీలో భాగం కాకపోవచ్చు కానీ కార్తీక్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అవే క్యారెక్టర్లతో అదే ప్రపంచం మీ ముందుకు వస్తుంది. ఓ ఫ్రెండ్ నుంచి మీకు కావాల్సిన హగ్ ను ఈఎన్ఈ 2 ఇస్తుంది’’ అని తరుణ్ పేర్కొన్నాడు.

కార్తీక్ క్యారెక్టర్

ఈ నగరానికి ఏమైంది సినిమాలో విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రలు పోషించారు. ఇందులో కార్తీక్ అనే క్యారెక్టర్ చేశాడు సుశాంత్. అతను ఓ నైట్ క్లబ్ మేనేజర్. తన బాస్ కూతుర్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లాలనుకుంటాడు. ఈ నలుగురు ఒక నైట్ పార్టీ చేసుకుని మత్తులో గోవా వెళ్తారు.

అప్పుడే బాస్ కార్తీక్ కు ఇచ్చిన రింగ్ మిస్ అవుతుంది. అది లేకపోతే ఎంగేజ్మెంట్ జరగదని కార్తీక్ భయపడతాడు. గోవాలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి, గెలిచిన డబ్బుతో రింగ్ కొద్దామని అనుకుంటారు. మరి తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ నగరానికి ఏమైంది స్టోరీ.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More