Peddi Song: పెద్ది స్పెషల్ సాంగ్‌పై స‌స్పెన్స్‌.. చ‌ర‌ణ్‌తో ఆడిపాడే ఆ బ్యూటీ ఎవ‌రు? అస‌లు ఆ పాట ఉందా?

Peddi Song: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ షూటింగ్ ఎండ్ కు చేరుకుంది. పెద్ది షూటింగ్ లో ఇంకా ఆరు రోజులే అని డైరెక్టర్ బుచ్చిబాబు ట్వీట్ కూడా చేశాడు. ఈ నేపథ్యంలో పెద్ది స్పెషల్ సాంగ్ పై సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. 

Published on: Apr 22, 2026, 11:59:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Peddi Song: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘పెద్ది’ ఒకటి. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే కంప్లీట్ కాబోతుంది. మరో 6 రోజులు మాత్రమే షూటింగ్ ఉందని పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సాన సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ నేపథ్యంలో పెద్ది స్పెషల్ సాంగ్ పై ఏ అప్డేట్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

పెద్ది సాంగ్ పై సస్పెన్స్ (instagram)
పెద్ది సాంగ్ పై సస్పెన్స్ (instagram)

పెద్ది పాట

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని ఎప్పటి నుంచో అంటున్నారు. మూవీ హైలైట్స్ లో ఇది ఒకటినే వార్తలు వస్తున్నాయి. కానీ ఆ పెద్ది స్పెషల్ పాటలో ఏ హీరోయిన్ డ్యాన్స్ చేస్తుందనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. మొన్నటి వరకేమో పెద్ది స్పెషల్ సాంగ్ ను మృణాల్ ఠాకూర్‌ చేస్తుందనే ప్రచారం జోరుగా సాగింది.

సంయుక్త మీనన్ పేరు

పెద్ది స్పెషల్ సాంగ్ ఒక్కటే మిగిలి ఉందని, మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ పెద్ది స్పెషల్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారని టాక్. అయితే దీనిపై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదీ లేదు. ఇక ఇప్పుడేమో ఈ పెద్ది ప్రత్యేక పాటలో సంయుక్త మీనన్ ఆడి పాడనుందని లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.

రామ్ చరణ్ తో కలిసి

రామ్ చరణ్ తో కలిసి పెద్ది స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసేది ఎవరనే ప్రశ్నకు ఇంకా ఆన్సర్ దొరకలేదు. దీనిపై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో అసలు నిజంగానే స్పెషల్ సాంగ్ ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ సాంగ్ ఉంటే అందులో రామ్ చరణ్ తో కలిసి ఏ బ్యూటీ ఆడి పాడుతుందోననేది మరో ప్రశ్న. దీనిపై పెద్ది మూవీ టీమ్ నుంచి అఫీషియల్ సమాచారం వస్తేనే ఓ క్లారిటీ అనేది దొరుకుతుంది.

పెద్ది రిలీజ్

పెద్ది రిలీజ్ పై ఫ్యాన్స్, సినీ లవర్స్ వెయిటింగ్ కొనసాగుతూనే ఉంది. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సింది. కానీ రీసెంట్ గానే ఈ విడుదలను జూన్ కు వాయిదా వేశారు. ఈ పెద్ది సినిమాలో రూరల్ స్పోర్ట్స్ పర్సన్ గా రామ్ చరణ్ నటిస్తున్నాడు. క్రికెట్ తో పాటు కుస్తీలోనూ తలపడనున్నాడు.

పెద్ది సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More