Sydney Sweeney: అమెరికన్ నటి, రెండుసార్లు ఎమ్మీ నామినేషన్ దక్కించుకున్న సిడ్నీ స్వీనీ తీరు కలకలం రేపుతోంది. స్పోర్ట్స్ ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్ 'నోవిగ్' కోసం చేసిన ఆమె చేసిన ఓ న్యూడ్ యాడ్ నెట్టింట సంచలనంగా మారింది. అందులో ఆమె క్రీడా పరికరాలతో మాత్రమే తన శరీరాన్ని కవర్ చేసుకోవడం తీవ్రమైన విమర్శలకు దారితీసింది.
వ్యాపార వస్తువుగా

సిడ్నీ స్వీనీ నగ్న యాడ్ పై 4 సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ స్విమ్మర్ టిట్మస్ ఫైర్ అయింది. "ఇది చూసినప్పుడు నాకెంత కోపం కలిగిందో మాటల్లో చెప్పలేను. మహిళల శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చడం, మహిళా క్రీడలను సెక్సువలైజ్ చేయడం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది?" అని ఇన్‌స్టాగ్రామ్‌లో టిట్మస్ ప్రశ్నించారు.
అథ్లెట్లు ఇలా ఉంటారు
బుడాపెస్ట్‌లో జరిగిన అల్టిమేట్ ఛాంపియన్‌షిప్ పోటీల అనంతరం బీబీసీ ఇంటర్వ్యూలో బ్రిటీష్ స్ప్రింటర్ అమీ హంట్ మాట్లాడుతూ.. "సిడ్నీ స్వీనీ.. క్రీడల్లో మహిళలు అంటే ఇలా ఉంటారు. కండరాలు, కష్టపడే తత్వం, చెమట, రక్తం, కన్నీళ్లు!" అంటూ నేరుగా కెమెరా వైపు చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చింది.
మాజీ యూఎస్ జిమ్నాస్ట్ గ్రేసీ క్రేమర్, రగ్బీ క్రీడాకారిణి సోఫీ ఫెల్లా కూడా ఈ యాడ్‌ను తీవ్రంగా ఖండిస్తూ, క్రీడాకారిణులు తమ గుర్తింపు కోసం పడే శ్రమను తక్కువ చేసి చూపడమేనని మండిపడ్డారు.
స్వీనీ రియాక్షన్
ఈ వివాదంపై నోవిగ్ సంస్థ లేదా స్వీనీ అధికారికంగా స్పందించనప్పటికీ, స్వీనీ ఇఎస్‌పిఎన్ (ESPN) ప్రసిద్ధ 'బాడీ ఇష్యూ' (Body Issue) కవర్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా పరోక్షంగా సమాధానమిచ్చింది.
కాగా, గతంలో మహిళా బాక్సర్ క్రిస్టీ మార్టిన్ బయోపిక్ 'క్రిస్టీ' (Christy) లో స్వీనీ నటించడంతో పాటు, ఆమె చేసిన ‘అమెరికన్ ఈగిల్’ (American Eagle) ప్రచార చిత్రం కూడా ఇంటర్నెట్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
అథ్లెట్ల పోరాటం
{{/usCountry}}కాగా, గతంలో మహిళా బాక్సర్ క్రిస్టీ మార్టిన్ బయోపిక్ 'క్రిస్టీ' (Christy) లో స్వీనీ నటించడంతో పాటు, ఆమె చేసిన ‘అమెరికన్ ఈగిల్’ (American Eagle) ప్రచార చిత్రం కూడా ఇంటర్నెట్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
అథ్లెట్ల పోరాటం
{{/usCountry}}మహిళా అథ్లెట్లు కేవలం తమ గ్లామర్ లేదా శరీర సౌందర్యం ఆధారంగా కాక, తమ కష్టం, నైపుణ్యం, అథ్లెటిసిజమ్ ఆధారంగా గుర్తింపు పొందాలని పోరాడుతున్నారు. స్పోర్ట్స్ గేమింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు క్రీడా ప్రతిభతో సంబంధం లేని హాలీవుడ్ నటుల బోల్డ్ ఇమేజ్‌ను ఉపయోగించడం వల్ల క్రీడాకారుల శ్రమ పక్కదారి పడుతుందనే భావన వ్యక్తమవుతోంది.
అమీ హంట్, గ్రేసీ క్రేమర్ వంటి అథ్లెట్లు "నిజమైన మహిళా అథ్లెట్ ఎలా ఉంటారు?" అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఫిట్‌నెస్, మస్క్యులారిటీ, చెమట, నిరంతర శ్రమతో కూడిన రూపాన్ని సమాజంలో ఆమోదయోగ్యమైన రూపంగా చూపడమే కాకుండా, మార్కెటింగ్ ఏజెన్సీల సాంప్రదాయ గ్లామర్ ప్రమాణాలను వారు నేరుగా సవాలు చేస్తున్నారు.