...
...
Next Story

T20 World Cup 2026: నేటి నుంచే టీ20 వరల్డ్ కప్ సమరం-షెడ్యూల్, గ్రూప్స్, వేదికలు, తేదీలు, లైవ్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు!

T20 World Cup 2026: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 10వ ఎడిషన్ నేడు (ఫిబ్రవరి 7) గ్రాండ్‌గా ప్రారంభమవుతోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో 20 జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ బరిలోకి దిగనుంది.

Published on: Feb 7, 2026, 08:02:43 IST
Advertisement

క్రికెట్ ప్రపంచంలో అసలైన మజా షురూ కాబోతోంది. పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేత ఎవరో తేల్చే టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి నేడు (ఫిబ్రవరి 7) తెరలేవనుంది. భారత్, శ్రీలంక దేశాల్లోని ప్రతిష్టాత్మక స్టేడియాల్లో ఈ నెల రోజుల పాటు బౌండరీల వర్షం కురవనుంది. 2024లో అద్భుత విజయం సాధించిన భారత్ ఈసారి సొంత గడ్డపై ఆ ఆధిపత్యాన్ని కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

ఎక్కడెక్కడ మ్యాచులు?

నేటి నుంచే టీ20 వరల్డ్ కప్ సమరం-షెడ్యూల్, గ్రూప్స్, వేదికలు, తేదీలు, లైవ్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు! (ICC)
నేటి నుంచే టీ20 వరల్డ్ కప్ సమరం-షెడ్యూల్, గ్రూప్స్, వేదికలు, తేదీలు, లైవ్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు! (ICC)

ఈ మెగా ఈవెంట్ కోసం మొత్తం ఎనిమిది స్టేడియాలను సిద్ధం చేశారు.

భారత్‌లో: అహ్మదాబాద్ (నరేంద్ర మోదీ స్టేడియం), కోల్‌కతా (ఈడెన్ గార్డెన్స్), ఢిల్లీ (అరుణ్ జైట్లీ స్టేడియం), ముంబై (వాంఖెడే స్టేడియం), చెన్నై (చిదంబరం స్టేడియం).

శ్రీలంకలో: కొలంబోలోని ఆర్. ప్రేమదాస మరియు ఎస్.ఎస్.సి (SSC) స్టేడియాలు, కాండీలోని పల్లెకెలె స్టేడియం.

ముఖ్యంగా, మార్చి 8న జరిగే ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్‌కు చేరితే, భద్రతా కారణాల దృష్ట్యా ఆ మ్యాచ్ కొలంబోకు మారే అవకాశం ఉంది.

కీలక తేదీలు ఇవే..

ఫిబ్రవరి 7: టోర్నీ ప్రారంభం (ఓపెనింగ్ మ్యాచులు)

ఫిబ్రవరి 22: సూపర్ 8 దశ షురూ

మార్చి 4 & 5: సెమీ ఫైనల్స్

మార్చి 8: గ్రాండ్ ఫైనల్

టోర్నీ ఫార్మాట్ ఎలా ఉంటుంది?

గత ఎడిషన్ తరహాలోనే ఈసారి కూడా 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా (ఒక్కో గ్రూపులో 5 జట్లు) విభజించారు. గ్రూప్ స్టేజ్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. అక్కడ మళ్లీ రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి.

Group AIndiaPakistanNamibiaUnited StatesNetherlands
Group BAustraliaSri LankaIrelandZimbabweOman
Group CEnglandWest IndiesScotlandNepalItaly
Group DNew ZealandSouth AfricaAfghanistanCanadaUnited Arab Emirates

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?

భారతదేశంలో ఈ మ్యాచులన్నింటినీ స్టార్ స్పోర్ట్స్ (Star Sports) నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఓటీటీ ప్రేక్షకులకు జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ కామెంటరీ అందుబాటులో ఉండటం గురించి తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe