తెలుగు, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి తాప్సీ పన్ను. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ బ్యూటీ బిజీ అయిపోయింది. తాజాగా ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన అస్సీ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సౌత్ డైరెక్టర్లపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
తాప్సీ ప్యాడెడ్ బ్రా

ఫిబ్రవరి 20న తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించిన హిందీ మూవీ అస్సీ రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా సౌత్ సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు హీరోయిన్లు ఎదుర్కొనే ఇబ్బందికరమైన నిజాల గురించి తాప్సీ హాట్ కామెంట్లు చేసింది. తమిళ, తెలుగు సినిమాల్లో దర్శకులు హీరోయిన్ల సైజులు పెంచడం కోసం ప్యాడెడ్ బ్రాలు వేసుకోమని ఫోర్స్ చేస్తారని తాప్సీ బాంబ్ పేల్చింది.
బొడ్డుపై ఫోకస్
యూట్యూబ్‌లో శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో తాప్సీ మాట్లాడుతూ ఈ సంచలన కామెంట్లు చేసింది. భోజ్‌పురి, సౌత్ ఇండియన్ సినిమాల్లో పాటల సన్నివేశాల్లో బొడ్డుపై ఎందుకు ఫోకస్ చేస్తారని తాప్సీని హోస్ట్ అడిగాడు. ఈ ట్రెండ్‌ను అర్థం చేసుకోవడానికి తాను కూడా ప్రయత్నించానని తాప్సీ పేర్కొంది. చాలా సౌత్ సినిమాలు తమ విజువల్ ఫ్రేమింగ్‌లో బొడ్డును ఫోకస్ చేయడానికి మొగ్గు చూపుతాయని, హిందీలోనేమో క్లీవేజ్ పై దృష్టి పెడతారని తాప్సీ చెప్పింది.
సౌత్ లో ఇలా
"సౌత్‌లో కూడా ప్యాడెడ్ బ్రాలు ధరించమని చెబుతారు. సెట్‌లో డైరెక్టర్ ఎవరికి ఈ విషయం చెప్పాలి? అన్నదే ఇక్కడ ముఖ్యమైన సమస్య. ఎందుకంటే సెట్‌లో ఒకరు లేదా ఇద్దరు ఫీమేల్ యాక్టర్స్ మాత్రమే ఉంటారు. కాబట్టి డైరెక్టర్ ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్‌కు చెబుతారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో స్టైలింగ్ టీమ్‌కు లేదా హెయిర్ టీమ్‌లోని అక్కకు చెబుతారు. చివరకు ఆ మెసేజ్ హీరోయిన్ కు చేరుతుంది’’ అని తాప్సీ వెల్లడించింది.
తేడా వచ్చిందా?
"సెట్‌లో ఒక పాట షూటింగ్ సమయంలో ప్యాడెడ్ బ్రా ధరించమని చెప్పినప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఊహించుకోండి. అప్పుడు మధ్యలో ఎవరో ఒకరు లేచి హీరోయిన్ దగ్గరకు వెళ్తారు. సైజ్ లో తేడా వచ్చిందో లేదో అని చూస్తారు. తేడా తెలియడం లేదని ఎవరైనా చెప్తే మళ్లీ మార్చుకుని రమ్మంటారు’’ అని తాప్సీ తెలిపింది.
హైలైట్ చేయడానికి
{{/usCountry}}"సెట్‌లో ఒక పాట షూటింగ్ సమయంలో ప్యాడెడ్ బ్రా ధరించమని చెప్పినప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఊహించుకోండి. అప్పుడు మధ్యలో ఎవరో ఒకరు లేచి హీరోయిన్ దగ్గరకు వెళ్తారు. సైజ్ లో తేడా వచ్చిందో లేదో అని చూస్తారు. తేడా తెలియడం లేదని ఎవరైనా చెప్తే మళ్లీ మార్చుకుని రమ్మంటారు’’ అని తాప్సీ తెలిపింది.
హైలైట్ చేయడానికి
{{/usCountry}}సౌత్ దర్శకులు తరచుగా స్క్రీన్‌పై నిర్దిష్ట శరీర భాగాలను హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తారని, ఇది ప్రేక్షకుల ఫాంటసీలు, విజువల్ అప్పీల్‌ను తీరుస్తుందని తాప్సీ అభిప్రాయపడింది.