King 100 Tabu: మహంతి ఝాన్సీ రాణి అనే నేను- కింగ్ 100 నుంచి టబు పవర్ ఫుల్ వీడియో- పొలిటీషియన్ గా-మర్చిపోలేని నాగార్జున!
King 100 Tabu Nagarjuna: కింగ్ నాగార్జున ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ‘కింగ్ 100’ మూవీ నుంచి సాలిడ్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న టబు గ్లింప్స్ వీడియోను ఇవాళ రిలీజ్ చేశారు. టబు బర్త్ డే సందర్భంగా వచ్చిన ఈ వీడియోతో మూవీపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.
Tabu Nagarjuna: కొన్ని రోజులుగా ఊరిస్తూ వచ్చిన కింగ్ 100 మూవీ మేకర్స్ ఎట్టకేలకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇవాళ (నవంబర్ 4) టబు బర్త్ డే సందర్భంగా మూవీలోని ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేశారు. ఈ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ గా మారింది.

మహంతి ఝాన్సీ రాణిగా టబు
నాగార్జు, టబు అంటే ఎవర్ గ్రీన్ క్లాసిక్ జోడీ. నిన్నే పెళ్లాడుతా సినిమాలో వీళ్ల పెయిర్, వీళ్ల మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ జై కొట్టారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు మరోసారి కలిసి నటించడంతో కింగ్ 100 మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో మహంతి ఝాన్సీ రాణిగా టబు నటిస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ సారి లవ్ కాదు
నాగార్జు, టబు జంటగా నటిస్తున్నారంటే వీళ్ల మధ్య లవ్ సీన్లు ఉంటాయనే అంచనాలుంటాయి. కానీ కింగ్ 100 మూవీలో మాత్రం లవ్ కాదు వార్ అని మేకర్స్ ముందుగానే ఈ గ్లింప్స్ వీడియోలో క్లారిటీ ఇచ్చేశారు. అంటే ఈ సారి నాగార్జునకు అపోజిట్ గా పవర్ ఫుల్ విలన్ గా టబు నటిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవర్ ఫుల్ పొలిటీషియన్ గా
కింగ్ 100 మూవీ నుంచి ఇవాళ రిలీజ్ చేసిన టబు గ్లింప్స్ వీడియోను బట్టి ఈ సినిమాలో ఆమె పవర్ ఫుల్ పొలిటీషియన్ గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘మనుషుల్లో రెండు రకాలు. హార్డ్ వర్క్ ను నమ్మేవాళ్లు, లక్ ను నమ్మేవాళ్లు. ఐ హేట్ లక్’’అని గ్లింప్స్ లో టబు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.
ఇక చివర్లో ‘మహంతి ఝాన్సీ రాణి అనే నేను’ అని టబు క్యారెక్టర్ చెప్పడంతో కింగ్ 100 మూవీలో ఆమె పొలిటీషియన్ గా నటిస్తుందని అర్థమైపోయింది. మరి ఆమె సీఎంగా కనిపిస్తుందా లేదా ఎమ్మెల్యే ఆర్ ఎంపీగా నటిస్తుందా? అన్నది వేచి చూడాలి.
నాగ్ పోస్ట్
కింగ్ 100 మూవీ నుంచి టబ్ గ్లింప్స్ ను నాగార్జున ఎక్స్ లో షేర్ చేశారు. ‘‘హ్యాపీ బర్త్ డే టు డియర్ టబ్యూటీఫుల్. నిన్నే పెళ్లాడుతా సినిమాలోని పండును ఈ ప్రపంచం మర్చిపోదు. అలాగే ఇప్పుడు ‘మహంతి ఝాన్సీ రాణి’ కూడా మా మెమోరీస్ లో ఎప్పటికీ ఉండిపోతుంది.
నువ్వు ఈ సినిమాను చాలా స్పెషల్ గా మార్చావు. సెలబ్రేషన్ కోసం గ్లింప్స్ షేర్ చేస్తున్నా. ఇది న్యూ ఫైర్. ఈ సారి లవ్ కాదు’’ అని నాగ్ పోస్టు చేశారు. కింగ్ 100 సినిమా డిసెంబర్ 24న రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


