...
...
Next Story

Tamanna Sadhguru: అసలు అందం అంటే ఏంటీ- సద్గురును ప్రశ్నించిన తమన్నా- గడ్డం పోలికతో నవ్వించిన సమాధానం!

Tamannaah Asks Sadhguru About Beauty: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన రూపం గురించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆధ్యాత్మిక గురువు సద్గురుతో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో అసలైన అందానికి నిర్వచనం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా సద్గురు ఇచ్చిన ఆసక్తికర సమాధానం అందరిని నవ్వించింది.

Published on: Nov 23, 2026, 22:01:06 IST
Advertisement

Tamannaah Asks Sadhguru About Beauty: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు 'మిల్కీ బ్యూటీ'గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా భాటియా. కెరీర్ ఆరంభం నుంచి ఆమె అందంపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అయితే, ఆ అందమే కొన్నిసార్లు విమర్శలకు, అసభ్యకర వ్యాఖ్యలకు కూడా దారితీసింది.

అసలు అందం అంటే ఏంటీ- సద్గురును ప్రశ్నించిన తమన్నా- గడ్డం పోలికతో నవ్వించిన సమాధానం!
అసలు అందం అంటే ఏంటీ- సద్గురును ప్రశ్నించిన తమన్నా- గడ్డం పోలికతో నవ్వించిన సమాధానం!

తాజాగా ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ (సద్గురు)తో జరిగిన ప్రత్యేక సంభాషణలో తమన్నా తన మనసులోని సందేహాన్ని బయటపెట్టారు. అసలు అందం అంటే ఏమిటి, అది పుట్టుకతో వస్తుందా లేక మనం సృష్టించుకునేదా అని సద్గురును తమన్నా అడిగారు.

సద్గురుకు తమన్నా ప్రశ్న.. నవ్వులు పూయించిన సమాధానం

"నేను బయటకు వెళ్లినప్పుడు చాలామంది నన్ను చూసి అందంగా ఉన్నావని అంటుంటారు. జీవిత చరమాంకంలో మనం ఎలా కనిపిస్తామన్నది మనకు పుట్టుకతో లభించిన వరమా, లేక మనమే తయారు చేసుకునేదా?" అని తమన్నా సద్గురును ప్రశ్నించారు. దీనిపై సద్గురు ఎంతో లోతైన, ఆసక్తికరమైన విశ్లేషణ ఇచ్చారు.

జెనిటిక్స్ కొంతవరకే పనిచేస్తుంది

"ఎవరికైనా ముక్కు, గడ్డం వంటి శరీర ఆకృతులు జన్యుపరంగా రావచ్చు. కానీ, అవే పూర్తిగా అందాన్ని నిర్ణయించవు. జెనిటిక్స్ కొంతవరకే పనిచేస్తుంది. మిగిలినదంతా ఒక వ్యక్తి తనను తాను ఎలా మలుచుకుంటారన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది" అని సద్గురు చెప్పారు.

"ముక్కు, మొహం ఎలా ఉన్నా.. సంతోషంతో వెలిగిపోయే ముఖం ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మనందరం సొంతం చేసుకోవచ్చు. కావాలంటే నన్నే చూడండి.. ఇంత పొడవాటి గడ్డంతో కూడా నేను అందంగా మ్యానేజ్ చేస్తున్నాను కదా" అని సద్గురు తన గడ్డాన్ని చూపిస్తూ చమత్కరించారు. సద్గురు నిజంగానే ఎంతో అందంగా ఉన్నారని తమన్నా బదులివ్వడంతో అక్కడ నవ్వులు విరిశాయి.

'మిల్కీ బ్యూటీ' ట్యాగ్‌పై తమన్నా ఘాటు స్పందన

"మీరు నన్ను మిల్కీ బ్యూటీ అంటున్నారు. అలాంటి రూపం ఉన్న అమ్మాయి శివశక్తి పాత్ర చేయలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. దర్శకుడు అశోక్ తేజ మిల్కీ బ్యూటీ అనే పదాన్ని సిగ్గుపడాల్సిన విషయంగా చూడలేదు" అని తమన్నా స్పష్టం చేశారు.

మనల్ని మనం తక్కువ చేసి చూసుకుంటే

మహిళల్లో ఉండే గ్లామర్‌ను ఎప్పుడూ వేడుకలా జరుపుకోవాలని, మనల్ని మనం తక్కువ చేసి చూసుకుంటే బయటివారు కూడా గౌరవించరని ఆమె హితవు పలికారు. అలాగే గతేడాది ఏప్రిల్‌లోనూ అందం వల్ల నటిగా అవకాశాలు తగ్గుతున్నాయా అన్న ప్రశ్నకు ఆమె భిన్నంగా స్పందించారు.

"నేను చాలా అందంగా ఉన్నాను కాబట్టే నాకు మంచి పాత్రలు రావడం లేదని బాధితురాలిలా చెప్పుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అలా ఆలోచించడమే నాకు వింతగా అనిపిస్తుంది" అని తమన్నా కుండబద్దలు కొట్టారు.

అన్నూ కపూర్ వ్యాఖ్యలు.. తమన్నా హుందాతనం

బాలీవుడ్‌లో 'ఆజ్ కీ రాత్' పాటతో తమన్నా సెన్సేషన్ సృష్టించిన సమయంలో సీనియర్ నటుడు అన్నూ కపూర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ తమన్నా శరీర రంగును ఉద్దేశించి 'దూధియా బదన్' (పాల లాంటి శరీరం) అంటూ ఆయన అసభ్యకర రీతిలో వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు, సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఆ ఘటన జరిగిన కొద్దిరోజులకే 'ఎన్డీటీవీ ప్రాఫిట్ ఇగ్నైట్' వేదికపై తమన్నా పరోక్షంగా స్పందించారు. "కళాకారులుగా అందరి మాటలు వినడం మన బాధ్యత. అయితే విన్న వాటిలో ఏది మనసులోకి తీసుకోవాలి, దేనిని వదిలేయాలి అన్నది తెలుసుకోవడం చాలా అవసరం. ఒక మహిళగా ఇలాంటి చెత్త వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇస్తూ కూర్చుంటే జీవితంలో అడుగు ముందుకు వేయలేము" అని తమన్నా హుందాగా బదులిచ్చారు.

చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ

వివాదాలను పక్కనపెట్టి తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. చివరిగా 'ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' చిత్రంలో మెరిసిన ఆమె చేతిలో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న 'రాగిణి 3', 'రేంజర్స్', 'పురుషన్', 'ఐపీఎస్ మారియా' చిత్రాలతో పాటు దిగ్గజ దర్శకుడు వి. శాంతారామ్ బయోపిక్‌లోనూ తమన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన నటనా ప్రతిభను నిరూపించుకుంటున్నారు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks