...
...
Next Story

తమన్నా ఐటెమ్ సాంగ్‌కు 100 కోట్ల వ్యూస్.. థ్యాంక్స్ చెప్పిన మిల్కీ బ్యూటీ.. ఈ పాట చూశారా?

తమన్నా భాటియా ఐటెమ్ సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. హారర్ కామెడీ మూవీ స్త్రీ2లో వచ్చిన ఆజ్ కీ రాత్ పాటకు 100 కోట్ల వ్యూస్ రావడం విశేషం. మరి ఆ పాట గురించి మీకు తెలుసా?

Published on: Jan 16, 2026, 17:05:42 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గ్లామర్, డ్యాన్స్ స్టెప్పులతో ఉర్రూతలూగించిన పాట ‘ఆజ్ కీ రాత్’ (Aaj Ki Raat). 2024లో వచ్చిన బ్లాక్ బస్టర్ హారర్-కామెడీ మూవీ ‘స్త్రీ 2’ (Stree 2) విజయానికి ఈ పాట కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో మోత మోగించిన ఈ పాట.. ఇప్పుడు యూట్యూబ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఈ వీడియో సాంగ్ బిలియన్ (100 కోట్లు) వ్యూస్ మార్కును క్రాస్ చేసింది.

మొదటి వ్యూ నుంచి బిలియన్ దాకా..

తమన్నా ఐటెమ్ సాంగ్‌కు 100 కోట్ల వ్యూస్.. థ్యాంక్స్ చెప్పిన మిల్కీ బ్యూటీ.. ఈ పాట చూశారా?
తమన్నా ఐటెమ్ సాంగ్‌కు 100 కోట్ల వ్యూస్.. థ్యాంక్స్ చెప్పిన మిల్కీ బ్యూటీ.. ఈ పాట చూశారా?

ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడంపై తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. శుక్రవారం (జనవరి 16) నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో పాట షూటింగ్ సమయానికి సంబంధించిన బిహైండ్ ది సీన్స్ క్లిప్స్‌ను షేర్ చేసింది. "మొదటి వ్యూ నుంచి 1 బిలియన్ వ్యూస్ వరకు.. ఇంత ప్రేమను కురిపించినందుకు అందరికీ ధన్యవాదాలు" అని క్యాప్షన్ ఇచ్చింది.

ఆ వీడియోలో.. షాట్ పూర్తయ్యాక కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ "చాలా బాగా వచ్చింది, కానీ ఇంకో టేక్ చేద్దామా?" అని అడగ్గా.. తమన్నా సరదాగా "నో" అని అరిచిన క్లిప్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

900 కోట్ల వసూళ్లు

రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో వచ్చిన ‘స్త్రీ 2’ బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లు వసూలు చేసి 2024లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. సచిన్-జిగర్ సంగీతం అందించిన ‘ఆజ్ కీ రాత్’ పాటను మధుబంతి బాగ్చి, దివ్య కుమార్ పాడారు. అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు.

సిద్ధార్థ్ మల్హోత్రాతో నెక్స్ట్ మూవీ

తమన్నా ప్రస్తుతం ‘వీవీఏఎన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే సినిమా కోసం సిద్ధమవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా, దీపక్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 15న విడుదల కానుంది. మధ్య భారతదేశంలోని అటవీ ప్రాంతం, జానపద కథల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఓవైపు హీరోయిన్ గా బిజీగా ఉంటూనే మరోవైపు వరుస ఐటెమ్ సాంగ్స్ తో తమన్నా అలరిస్తోంది. అయితే ఈ ఆజ్ కీ రాత్ సాంగ్ మాత్రం ఆమె కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks