...
...
Next Story

Jayam Ravi: స్టార్ హీరో ఇంట్లో చోరీ కేసు.. డ్రైవర్ అరెస్ట్.. రూ.2.5 లక్షలు రికవరీ.. ఇంకా జాడ తెలియని డైమండ్ నెక్లెస్

Jayam Ravi: తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో అతని డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గరి నుంచి రూ.2.5 లక్షలు రికవరీ చేయగా.. డైమండ్ నెక్లెస్ జాడ మాత్రం ఇంకా తెలియడం లేదు.

Published on: Jul 3, 2026, 15:02:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలోని ఆయన సొంత ఇంట్లో పనిచేస్తున్న కారు డ్రైవరే ఈ చోరీకి పాల్పడటం అందరినీ షాక్ కి గురిచేసింది. విశ్వసనీయంగా పనిచేయాల్సిన వ్యక్తే లాకర్ ఓపెన్ చేసి భారీగా క్యాష్, నగలు కొట్టేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Jayam Ravi: హీరో ఇంట్లో చోరీ కేసు.. డ్రైవర్ అరెస్ట్.. రూ.2.5 లక్షలు రికవరీ.. ఇంకా జాడ తెలియని డైమండ్ నెక్లెస్
Jayam Ravi: హీరో ఇంట్లో చోరీ కేసు.. డ్రైవర్ అరెస్ట్.. రూ.2.5 లక్షలు రికవరీ.. ఇంకా జాడ తెలియని డైమండ్ నెక్లెస్

ఈ చోరీ కేసులో డ్రైవర్ రాజేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని దగ్గర నుంచి సుమారు రూ.2.5 లక్షల క్యాష్ రికవరీ చేశారు. కానీ ఇంకా రూ.10 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరకకపోవడంతో దాని కోసం దానికోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు.

పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ అసలు నిజాలు

జూన్ 22న నీలాంగరై పోలీస్ స్టేషన్‌లో రవి మోహన్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దొంగతనం విషయం మొత్తం బయటకు వచ్చింది. చెన్నై ఈంజంబాక్కంలోని హీరో ఇంట్లో పనిచేస్తున్న కొందరు పనివాళ్లు తమ ఇళ్లకు తిరిగి రాలేదని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు.. ఇంట్లో ఇద్దరు మహిళా సహాయకులతో పాటు ఒక అబ్బాయి కనిపించారు.

చోరీ విషయమై వారిని హీరో స్టాఫ్ ప్రైవేట్‌గా విచారణ చేస్తున్నాని పోలీసులకు తెలిసింది. అయితే ఇలాంటి పనులు చట్టబద్ధంగా జరగాలని, ఎవరినీ చట్టవిరుద్ధంగా ఇంట్లో నిర్బంధించి విచారించకూడదని పోలీసులు హీరో స్టాఫ్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

ఆ తర్వాతే రవి మోహన్ మేనేజర్ అఫీషియల్‌గా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఇంట్లోని లాకర్ నుంచి పది లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ తో పాటు కొంత క్యాష్ మిస్ అయినట్లు ఆ రిపోర్ట్ లో వెల్లడించారు.

విచారణలో నిజం ఒప్పుకున్న డ్రైవర్

డ్రైవర్ నుంచి రికవరీ చేసిన డబ్బును పోలీసులు హీరోకి తిరిగి అప్పగించారు. కానీ ఆ డైమండ్ నెక్లెస్ మాత్రం ఇంకా దొరకలేదు. దాన్ని ఎవరికైనా అమ్మాడా లేక ఎక్కడైనా దాచాడా అనే యాంగిల్ లో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో రాజేష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

కరాటే బాబు అండ్ సెన్సేషనల్ ఎల్‌సీయూ ఎంట్రీ

ఒకపక్క ఈ దొంగతనం టెన్షన్ ఉన్నా.. రవి మోహన్ మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'కరాటే బాబు' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 28న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈమధ్య కాలంలో రవి మోహన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే కథలు ఎంచుకుంటుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నాజర్, విటీవీ గణేష్ లాంటి సీనియర్ స్టార్స్ తో పాటు భారీ తారాగణం నటిస్తోంది.

ఇదిలా ఉంటే 2026 మే నెలలో రవి మోహన్ తన పర్సనల్ లైఫ్ గురించి ఒక సంచలన ప్రకటన చేసి వార్తల్లో నిలిచాడు. తన భార్య ఆర్తి రవితో జరుగుతున్న విడాకుల ప్రక్రియ సెటిల్ అయ్యేంత వరకు తన సినిమాలేవీ థియేటర్లలో రిలీజ్ చేయనని తేల్చి చెప్పాడు.

ఆ కామెంట్స్ చేసి ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసిన కొద్ది రోజులకే కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. దళపతి విజయ్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ ఉన్న లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లోకి 'బెంజ్' మూవీతో రవి మోహన్ ఎంట్రీ ఇస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks