Jayam Ravi: చేతబడి చేశారు, రక్తం కక్కుకున్నా: హీరో జయం రవి కన్నీళ్లు- హీరోయిన్లు మీరా చోప్రా, అంబిక మద్దతు- ఏమైందంటే?

Meera Chopra Ambika On Jayam Ravi Comments: భార్య ఆర్తి రవితో విడాకుల వివాదంపై స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి) చేసిన సంచలన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ఈ కష్టకాలంలో జయం రవికి మద్దతుగా హీరోయిన్స్ మీరా చోప్రా, అంబిక అండగా నిలిచారు. తనపై చేతబడి చేశారని, రక్తం కక్కుకున్నానని రవి చెప్పారు.

Published on: May 17, 2026, 15:05:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Meera Chopra Ambika Supports To Jayam Ravi: 'జెయం', 'పొన్నియిన్ సెల్వన్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి వ్యక్తిగత జీవితం తీవ్ర సంక్షోభంలో పడింది. ఒకవైపు ఆయన స్నేహితురాలు, సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ చెప్పడం, మరోవైపు భార్యతో కోర్టు గొడవలు ఆయనను మానసికంగా కుంగదీశాయి.

చేతబడి చేశారు, రక్తం కక్కుకున్నా: హీరో జయం రవి కన్నీళ్లు- హీరోయిన్లు మీరా చోప్రా, అంబిక మద్దతు- ఏమైందంటే?
చేతబడి చేశారు, రక్తం కక్కుకున్నా: హీరో జయం రవి కన్నీళ్లు- హీరోయిన్లు మీరా చోప్రా, అంబిక మద్దతు- ఏమైందంటే?

పిల్లలను కూడా కలవనివ్వడం లేదని

చెన్నైలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో జయం రవి కన్నీటి పర్యంతమయ్యారు. విడాకులు ఖరారయ్యే వరకు తాను ఎలాంటి సినిమాల్లో నటించనని, ఏ కొత్త చిత్రాలూ విడుదల కావని స్పష్టం చేశారు. భార్య ఆర్తి రవి తన సొంత పిల్లలను కూడా కలవనివ్వడం లేదని రవి మోహన్ ఆరోపించారు.

చేతబడి ఆరోపణలు.. రక్తం కక్కానంటూ ఆవేదన

తన ప్రెస్ మీట్‌లో రవి మోహన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పెళ్లయిన మొదటి రోజు నుంచే తనకు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయని జయం రవి వాపోయారు.

"నా విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు నా సినిమాలు ఏవీ విడుదల కావు. ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉండి చాలా నష్టపోయాను. నాపై జరిగిన చేతబడి (బ్లాక్ మ్యాజిక్) కారణంగా నేను రక్తం కక్కుకున్నాను. మానసిక క్షోభ భరించలేక నాకు నేను హాని చేసుకోవడానికి కూడా ప్రయత్నించాను" అని జయం రవి ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

పురుషులూ బాధితులే.. మీరా చోప్రా బాసట

రవి మోహన్ పరిస్థితిని చూసి టాలీవుడ్, కోలీవుడ్ నటీమణులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. పవన్ కల్యాణ్ 'బంగారం' చిత్రంలో నటించిన హీరోయిన్, ప్రియాంక చోప్రా కజిన్ చెల్లెలు మీరా చోప్రా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జయం రవి వ్యాఖ్యలపై స్పందించి మద్దతుగా నిలిచారు.

"ప్రతిసారీ పురుషుడే తప్పు చేయాలని లేదు. తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను కొంతమంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు. నాకు రవి మోహన్ తెలుసు. ఆయనతో నేను కొన్ని సౌత్ సినిమాల్లో నటించాను. ఆ అనుభవంతో చెబుతున్నాను రవి మోహన్ చాలా మంచివాడు, అమాయకుడు. ఆయనకు కచ్చితంగా న్యాయం జరగాలి" అని మీరా చోప్రా పేర్కొన్నారు.

బాధకు లింగభేదం లేదు.. సీనియర్ హీరోయిన్ అంబిక వ్యాఖ్యలు

80వ దశకంలో చిరంజీవి, రజనీకాంత్ వంటి అగ్ర హీరోలతో నటించిన సీనియర్ హీరోయిన్ అంబిక కూడా రవి మోహన్ పడుతున్న బాధను చూసి చలించిపోయారు. మానసిక ఒత్తిడి కారణంగా రవి ముఖంలో కళ తప్పిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

"బాధకు ఆడ, మగ అనే తేడా ఉండదు. అది ఎవరికైనా ఒకేలా తగులుతుంది. రవి జీవితంలో ఈ నరకం త్వరలోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నాను. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు, దయచేసి అందరూ అతనిని ఒంటరిగా వదిలేయండి" అని అంబిక కోరారు.

బయటి వారి జోక్యం వద్దు

ఆర్థికపరమైన వేధింపుల గురించి కొందరు నెటిజన్లు ప్రశ్నించగా, ఈ విషయంలో బయటి వ్యక్తుల జోక్యం వద్దని, దేవుడే ఇరువరికీ మంచి చేయాలని నటి అంబిక అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, మరోవైపు జయం రవి చేసిన ఆరోపణలను ఆర్తి రవి తల్లి, ప్రముఖ నిర్మాత సుజాత విజయ్‌కుమార్ ఖండించారు.

తన కూతురు నిర్దోషి అని, ఈ గొడవల వల్ల తన మనవడు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని సుజాత స్పష్టం చేశారు. ఏదేమైనా, ఒక స్టార్ హీరో ఇలా కోర్టు మెట్లు ఎక్కడం, కెరీర్‌ను సైతం పణంగా పెట్టడం సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. నటుడు రవి మోహన్ (జయం రవి) సినిమాలకు ఎందుకు విరామం ప్రకటించారు?

తన భార్య ఆర్తి రవితో విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు తాను ఎలాంటి సినిమాల్లో నటించనని, కొత్త చిత్రాలను విడుదల చేయనని రవి మోహన్ ప్రకటించారు.

2. రవి మోహన్‌కు మద్దతుగా నిలిచిన నటీమణులు ఎవరు?

నటి మీరా చోప్రా, సీనియర్ నటి అంబిక రవి మోహన్‌కు మద్దతుగా నిలిచారు. పురుషులూ బాధితులు కావచ్చని, చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు.

3. రవి మోహన్ తన భార్యపై ఎలాంటి ఆరోపణలు చేశారు?

తనపై చేతబడి చేయించారని, పెళ్లయిన మొదటి రోజు నుంచ అవమానించారని, చివరికి తన సొంత పిల్లలను కూడా కలవనివ్వడం లేదని రవి మోహన్ ఆరోపించారు.

4. రవి మోహన్ ఆరోపణలపై ఆర్తి రవి కుటుంబం ఎలా స్పందించింది?

ఆర్తి రవి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ వివాదాల వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More