...
...
Next Story

Vijay Sethupathi: విజయ్ సేతుపతి అరుదైన ఘనత.. ఏ ఇండియన్ యాక్టర్‌కూ దక్కని గౌరవం.. ఆ అవార్డుల వేడుకలో..

Vijay Sethupathi: తమిళ వర్సటైల్ యాక్టర్, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రపంచ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. 2026 నవంబర్ 23న న్యూయార్క్‌లో జరగనున్న 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పురస్కారాన్ని అందజేసే (Presenter) ప్రజెంటర్‌గా ఎంపికయ్యారు.

Published on: Nov 6, 2026, 15:19:24 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Vijay Sethupathi: ఇండియన్ సినీ ఇండస్ట్రీకి గర్వకారణంగా వర్సటైల్ యాక్టర్, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రపంచ స్థాయిలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా 2026 నవంబర్ 23న జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల (54th International Emmy Awards) ప్రదానోత్సవంలో ఆయన పురస్కారాన్ని అందజేసే ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు.

Vijay Sethupathi: విజయ్ సేతుపతి అరుదైన ఘనత.. ఏ ఇండియన్ యాక్టర్‌కూ దక్కని గౌరవం.. ఆ అవార్డుల వేడుకలో.. (X)
Vijay Sethupathi: విజయ్ సేతుపతి అరుదైన ఘనత.. ఏ ఇండియన్ యాక్టర్‌కూ దక్కని గౌరవం.. ఆ అవార్డుల వేడుకలో.. (X)

ఈ వేదికపై అవార్డు ప్రెజెంట్ చేయనున్న తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి చరిత్ర పుటలకెక్కనున్నారు. మరోవైపు ఆయన నటించిన సినిమా 'మహారాజా' హాలీవుడ్ రీమేక్‌కు హక్కులు అమ్ముడుపోవడం విశేషం.

కోలీవుడ్ టు న్యూయార్క్: దర్శకుడు సీను రామసామి అభినందనలు

ఈ వార్తను ప్రముఖ తమిళ దర్శకుడు, రచయిత సీను రామసామి సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా ధృవీకరిస్తూ విజయ్ సేతుపతికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

"54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై పురస్కారాన్ని అందజేస్తున్న తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి నా అభినందనలు. తమిళ సినిమాకే కాకుండా మొత్తం భారతీయ వినోద రంగానికి ఇది ఎంతో గర్వకారణమైన క్షణం. గ్లోబల్ స్టేజ్‌పై ఆయన నిలవడం ఎంతో స్ఫూర్తిదాయకం" అని సీను రామసామి ట్వీట్ చేశారు.

అంతర్జాతీయ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ & సైన్సెస్ బోర్డు సభ్యురాలు, ప్రొడ్యూసర్ కవితా గుప్తా కృషితో భారతీయ ప్రతిభను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకురావడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 2024లో స్టాండప్ కమెడియన్ వీర్ దాస్‌ను హోస్ట్‌గా తీసుకురావడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ఇక 2016లో 68వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీస్ వేదికపై ప్రియాంక చోప్రా అవార్డును అందజేసిన విషయం తెలిసిందే.

హాలీవుడ్‌కి చేరిన 'మహారాజా'.. మాథ్యూ మెక్కానగీ నటించే అవకాశం?

సినిమా నిర్మాత సుధన్ సుందరమ్ తెలిపిన వివరాల ప్రకారం.. చైనాలో సినిమా థియేట్రికల్, ఓటీటీ గ్రాండ్ సక్సెస్ చూసిన తర్వాత హాలీవుడ్ నిర్మాణ సంస్థలు రీమేక్ హక్కుల కోసం సంప్రదించాయి. ఈ రీమేక్‌లో హాలీవుడ్ ప్రముఖ ఏ-లిస్ట్ నటుడిని ప్రధాన పాత్రలో నటింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆస్కార్ విజేత నటుడు మాథ్యూ మెక్కానగీ (Matthew McConaughey) ఈ రీమేక్‌లో విజయ్ సేతుపతి పాత్రను పోషిస్తారనే వార్తలపై స్పందిస్తూ,.."మాథ్యూ పేరు కూడా పరిశీలనలో ఉండి ఉండవచ్చు, అయితే కాస్టింగ్, స్టూడియో వివరాలను అధికారికంగా వారే ప్రకటిస్తారు" అని సుధన్ సుందరమ్ స్పష్టం చేశారు.

విజయ్ సేతుపతి రాబోయే ప్రాజెక్ట్‌లు

ప్రస్తుతం విజయ్ సేతుపతి వరుస వైవిధ్యమైన చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిజీగా ఉన్నారు. ఈ మధ్యే అతడు నటించిన బత్తా మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయం తర్వాత ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లోనూ రికార్డులు కొల్లగొడుతోంది. ఇందులో ఓ రౌడీ పాత్రలో విజయ్ నటించాడు.

ఇక దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న రొమాంటిక్ డ్రామా ఇంచి వెల్లంలోనూ నటిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.

గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి సాధిస్తున్న ఈ విజయాలు భారతీయ చలనచిత్ర రంగానికి సరికొత్త గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks