సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే ఏదైనా చేయడానికి రెడీ అని అంటుంటారు హీరోయిన్లు. తాజాగా తమిళ నటి ఆండ్రియా జెరేమియా కూడా అలాంటి కామెంట్సే చేసింది. తన నెక్ట్స్ హారర్ మూవీ పిశాచి 2 సినిమాలో న్యూడ్ సీన్లు ఉన్నాయా అన్నప్పుడు.. అవి లేకపోయినా ఎరోటిక్ సీన్లు మాత్రం చాలానే ఉన్నాయని చెప్పింది.
డైరెక్టర్‌ను నమ్మాల్సిందే

తమిళంతోపాటు తెలుగులోనూ వచ్చిన ఆకట్టుకున్న హారర్ థ్రిల్లర్ మూవీ పిశాచి. ఇప్పుడీ సినిమాకు పిశాచి 2 రూపంలో సీక్వెల్ వస్తోంది. మిస్కిన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై ఆండ్రియా స్పందించింది. ఈ సినిమాలో న్యూడ్, బోల్డ్ సీన్ల గురించి మాట్లాడింది. మిస్కిన్ లాంటి సీనియర్ డైరెక్టర్ ఓ పాత్ర కోసం ఏదైనా అడిగినప్పుడు అతన్ని నమ్మాల్సిందే అని ఆమె అనడం విశేషం.
“నిజానికి స్క్రిప్ట్ దశలో న్యూడ్ సీన్లు ఉన్నాయి. కానీ షూటింగ్ సమయంలో మిస్కిన్ సర్ వాటిని తీసేశాడు. దానికి కారణమేంటో నాకు తెలియదు. పిశాచి 2లో న్యూడిటీ లేదు. కానీ చాలా ఎరోటిక్ సీన్లు ఉన్నాయి. మిస్కిన్ సర్ ఈ సినిమాను ఏదో ఇండస్ట్రీలో మనుగడ సాగించడం కోసం తీయడం లేదు. గతంలో అతడు ఎంతో మంది పెద్ద హీరోలతో తీశాడు. అలాంటి డైరెక్టర్ ఓ పాత్ర కోసం ఏదైనా చేయాలని అడిగితే అతన్ని విజన్‌ను నేను నమ్ముతాను. అతని ఉద్దేశం వేరే. గతంలో కొందరైతే నా స్కర్ట్ కిందికి లాగమని కూడా అన్నారు. వాళ్ల ఉద్దేశం వేరు” అని ఆండ్రియా చెప్పింది.
పిశాచి 2 మూవీ గురించి..
2014లో వచ్చిన పిశాచి సినిమాకు సీక్వెల్ గా ఈ పిశాచి 2 వస్తోంది. నిజానికి ఈ నెల మొదట్లోనే రిలీజ్ కావాల్సి ఉన్నా.. కోర్టు కేసు కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను మిస్కిన్ డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ సేతుపతి, ఆండ్రియా లీడ్ రోల్లో నటించారు. పిశాచి మూవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆండ్రియా ఇంటర్వ్యూతో ఈ సినిమా కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
{{/usCountry}}2014లో వచ్చిన పిశాచి సినిమాకు సీక్వెల్ గా ఈ పిశాచి 2 వస్తోంది. నిజానికి ఈ నెల మొదట్లోనే రిలీజ్ కావాల్సి ఉన్నా.. కోర్టు కేసు కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను మిస్కిన్ డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ సేతుపతి, ఆండ్రియా లీడ్ రోల్లో నటించారు. పిశాచి మూవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆండ్రియా ఇంటర్వ్యూతో ఈ సినిమా కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
{{/usCountry}}