...
...
Next Story

Sanam Shetty: నీట్ నిరసనలో నటి సనమ్ శెట్టికి షాక్- దళపతి విజయ్ పేరు ప్రస్తావించగానే మైక్ లాక్కున్న విద్యార్థులు- ఎందుకు?

Sanam Shetty Mic Snatched At Neet Protest: నీట్ పరీక్షల అక్రమాలపై జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనలో నటి సనమ్ శెట్టికి తీవ్ర పరాభవం ఎదురైంది. దళపతి విజయ్ సినిమా ప్రస్తావన తెస్తూ రాజకీయ నాయకులపై వ్యాఖ్యలు చేసిన ఆమె చేతిలోని మైక్ లాక్కుని వేదికపై నుంచి పంపించేశారు. దీంతో ఈ సంఘటన వైరల్‌గా మారింది.

Published on: Jul 25, 2026, 17:20:28 IST
Advertisement

Sanam Shetty Mic Snatched At Neet Protest: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ (NEET) పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా చెన్నైలో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బిగ్ బాస్ తమిళ ఫేమ్, సినీ నటి సనమ్ శెట్టికి అక్కడ తీవ్ర నిరసన ఎదురైంది. విద్యార్థుల ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆమెను, మైక్ లాక్కొని వేదికపై నుంచి పంపించివేశారు.

విజయ్ సినిమా ప్రస్తావన.. అసలు ఏం జరిగింది?

నీట్ నిరసనలో నటి సనమ్ శెట్టికి షాక్- దళపతి విజయ్ పేరు ప్రస్తావించగానే మైక్ లాక్కున్న విద్యార్థులు- ఎందుకు?
నీట్ నిరసనలో నటి సనమ్ శెట్టికి షాక్- దళపతి విజయ్ పేరు ప్రస్తావించగానే మైక్ లాక్కున్న విద్యార్థులు- ఎందుకు?

వేదికపైకి వచ్చిన సనమ్ శెట్టి మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ నూతన చిత్రం 'జన నాయగన్' ప్రస్తావన తీసుకువచ్చారు. తాను దళపతి విజయ్ వీరాభిమానిని అని, ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) సినిమా చూసిన వెంటనే విద్యార్థుల పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు.

అసలైన జోకర్లు వారు

అదే సమయంలో విద్యార్థుల వేదికను తమ రాజకీయ స్వార్థం కోసం వాడుకునే వారిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. "ఈ నిరసన కేవలం విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతోంది. వారికి మద్దతు ఇవ్వడం పౌరురాలిగా నా బాధ్యత. విద్యార్థుల వేదికను తమ రాజకీయ అజెండాల కోసం వాడుకునే నాయకులే అసలైన జోకర్లు" అని సనమ్ శెట్టి వ్యాఖ్యానించారు.

ఆమె ఈ మాటలు అనగానే నిరసన ప్రదర్శనలో ఉన్న కొందరు విద్యార్థులు, డీఎంకే (DMK) విద్యార్థి విభాగం టీ-షర్టులు ధరించిన ఆందోళనకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెకు వ్యతిరేకంగా హూటింగ్ చేస్తూ వేదికపైకి దూసుకొచ్చారు. సనమ్ మాట్లాడుతుండగానే నిర్వాహకులు జోక్యం చేసుకుని ఆమె చేతిలోని మైక్ లాక్కున్నారు.

'ఇది ప్రజాస్వామ్యం కాదు'.. సనమ్ శెట్టి ఆగ్రహం

"ప్రజాస్వామ్యంలో సాధారణ పౌరులకు భావప్రకటన స్వేచ్ఛ లేదా? విద్యార్థుల తరఫున మాట్లాడటానికి వస్తే నా మైక్ లాక్కుంటారా? అభిమానించే నటుడి సినిమా చూసినంత మాత్రాన నేను జోకర్‌ని అయిపోతానా? మరి రోజుకో సినిమా తీసే ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ కూడా విద్యార్థులకు మద్దతు ఇస్తున్నారుగా, ఆయన కూడా జోకరేనా?" అని సనమ్ ఘాటుగా ప్రశ్నించారు.

కొందరు ఈ నిరసనను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ఇది నిజమైన విద్యార్థుల పోరాటం కాదని ఆరోపించారు. లడఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని చెబుతూనే, విద్యార్థుల పేరుతో జరుగుతున్న రాజకీయ నాటకాలను ఖండించారు.

దేశవ్యాప్తంగా ఎగిసిపడుతున్న నీట్ సెగ

నీట్ పరీక్షల్లో చోటుచేసుకున్న భారీ అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన విద్యార్థుల పోరాటం క్రమంగా దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ పాకింది. చెన్నై సెక్రటేరియట్ ముందు నిరసన తెలిపిన ప్రముఖ తమిళ ర్యాపర్ అరివును ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

మరోవైపు విద్యార్థులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వ్యక్తమవడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 25న తన పదవికి రాజీనామా చేశారు.

కేంద్రంలో పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో, చెన్నైలో సనమ్ శెట్టికి ఎదురైన ఈ పరాభవం తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe