DMK Congress Alliance : కాంగ్రెస్‌తో డీఎంకే తెగతెంపులు...! లోక్‌సభలో సీట్ల మార్పు కోరుతూ స్పీకర్‌కు లేఖ
DMK Congress Alliance End : తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో తమ పార్టీ సభ్యుల సీటింగ్ అమరికను మార్చాలని స్పీకర్ కు లేఖ రాసింది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసిన ఈ లేఖలో ప్రస్తావించింది.
DMK Congress Alliance End : జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడులో సుదీర్ఘ కాలం పాటు మిత్రపక్షాలుగా ఉన్న ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) , కాంగ్రెస్ మధ్య మైత్రి అధికారికంగా ముగిసింది. ఈ మార్పుల నేపథ్యంలో లోక్‌సభలో తమ పార్టీ ఎంపీల సీటింగ్ అమరికను మార్చాలని కోరుతూ డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు.

స్పీకర్ కు డీఎంకే లేఖ….
మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తన లేఖలో పేర్కొన్నారు. “లోక్‌సభలో డీఎంకేకు చెందిన ఎంపీల సీటింగ్ అమరికలో తగిన మార్పులు చేయాలని నేను గౌరవపూర్వకంగా కోరుతున్నాను. కాంగ్రెస్‌తో మా పొత్తు ముగిసినందున…. సభలో ఇప్పటికీ వారి పక్కనే మా సభ్యులు కూర్చోవడం ఇకపై సముచితం కాదు” అని కనిమొళి స్పీకర్‌కు వివరించారు.
పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం…. సాధారణంగా ఒకే కూటమి లేదా పొత్తులో ఉన్న పార్టీల సభ్యులకు సభలో పక్కపక్కనే సీట్లు కేటాయిస్తారు. ఇది సభలో వ్యూహరచనకు, సమన్వయానికి సులభంగా ఉంటుంది. అయితే… ఇప్పుడు కాంగ్రెస్‌తో బంధం తెగిపోవడంతో, విపక్ష పక్షాల మధ్య ఉండే ఆ సమన్వయం అవసరం లేదని డీఎంకే భావిస్తోంది.
ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా విపక్ష కూటమి(ఇండియా కూటమి) ఐక్యతపై పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. దశాబ్ద కాలంగా యూపీఏ (UPA), ఇటీవలి 'ఇండియా' (INDIA) కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే…. ఇప్పుడు కాంగ్రెస్ నుండి దూరం కావడం దక్షిణాది రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజధానిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.
సభలో సీటింగ్ మార్పు కోసం లేఖ అందిన వెంటనే స్పీకర్ కార్యాలయం దీనిపై స్పందించాల్సి ఉంటుంది. సాధారణంగా పార్టీల బలాబలాలు, రాజకీయ పొత్తుల ఆధారంగా సీట్ల కేటాయింపులో మార్పులు చేయడం సహజమే అయినప్పటికీ…. డీఎంకే వంటి ప్రధాన పార్టీ ఇలా బహిరంగంగా లేఖ రాయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో డీఎంకే ఎంపీలు ఏ వరుసలో, ఎవరి పక్కన కూర్చుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…!
దోస్తీ కట్ - కారణాలేంటి..?
మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - డీఎంకే కలిసే పోటీ చేశాయి. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని…. డీఎంకేతో పాటు అన్నాడీఎంకే కు గట్టి షాక్ ఇచ్చింది. టీవీకే 108 స్థానాలు గెలుచుకోగా… డీఎంకే 59 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక అన్నాడీఎంకే 47, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది.
ఏ పార్టీకి కూడా 118 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) రాకపోవటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది. టీవీకే పార్టీకి ఇతర పార్టీల మద్దతు ఉంటేనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో…. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్… టీవీకే వైపు మళ్లింది. కనీసం కాంగ్రెస్ పార్టీ తమతో సంప్రదింపులు చేయకుండా… విజయ్ కి మద్దతు ఇవ్వటాన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే…. ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిపోయింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

