తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ గుర్తుందా? ఈ ఏడాది అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన మూవీ ఇది. సిమ్రన్ నటించిన ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అభిషన్ జీవింత్ ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం (అక్టోబర్ 31) అతని పెళ్లి జరిగింది.
అభిషన్ జీవింత్ పెళ్లి

టూరిస్ట్ ఫ్యామిలీతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అభిషన్ జీవింత్ తన గర్ల్‌ఫ్రెండ్ అఖిలను పెళ్లి చేసుకున్నాడు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. 25 ఏళ్ల వయసులోనే అతడు ఓ ఇంటివాడు కావడం విశేషం. చాలా రోజులుగా వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు.
అంతేకాదు ఈ మధ్యే అతనికి ఓ ఖరీదైన పెళ్లి గిఫ్ట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ నిర్మాతే ఈ గిఫ్ట్ ఇచ్చాడు. పెళ్లికి మూడు రోజుల ముందు ఓ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును అభిషన్ కు పెళ్లి గిఫ్ట్ గా ఇచ్చిన వార్త తెగ వైరల్ అయింది.
టూరిస్ట్ ఫ్యామిలీ గురించి..
ఈ ఏడాది తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజైన మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.90 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. తర్వాత ఓటీటీలోనూ రికార్డులు తిరగరాసింది. సిమ్రన్, శశికుమార్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ఇది. శ్రీలంక నుంచి అక్రమంగా ఇండియాలోకి అడుగుపెట్టి తమిళనాడులోని రామేశ్వరంలో సెటిలవ్వాలని చూసే ఓ కుటుంబం చుట్టూ తిరిగే కథ ఇది.
కామెడీతోపాటు మంచి ఎమోషనల్ టచ్ ఉన్న ఈ సినిమా తమిళ, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాజమౌళి, రజనీకాంత్ లాంటి వాళ్లు కూడా ఈ సినిమాను తెగ మెచ్చుకున్నారు. ఓ యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టి టూరిస్టు ఫ్యామిలీతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు అభిషన్ జీవింత్. ఈ మూవీ నిర్మాత మగేష్ రాజ్ ఈ మధ్యే అభిషన్ కు పెళ్లి గిఫ్ట్ గా ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఇచ్చాడు.
{{/usCountry}}కామెడీతోపాటు మంచి ఎమోషనల్ టచ్ ఉన్న ఈ సినిమా తమిళ, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాజమౌళి, రజనీకాంత్ లాంటి వాళ్లు కూడా ఈ సినిమాను తెగ మెచ్చుకున్నారు. ఓ యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టి టూరిస్టు ఫ్యామిలీతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు అభిషన్ జీవింత్. ఈ మూవీ నిర్మాత మగేష్ రాజ్ ఈ మధ్యే అభిషన్ కు పెళ్లి గిఫ్ట్ గా ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఇచ్చాడు.
{{/usCountry}}