ఓటీటీలోకి తమిళ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్.. ఇది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా
ఓటీటీలోకి ఓ లేటెస్ట్ తమిళ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ కు వస్తోంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీతో వచ్చిన ఈ మూవీకి ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్ ఉండటం విశేషం. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసుకోండి.
తమిళంలో విమర్శకుల ప్రశంసలు పొందిన 'మిడిల్ క్లాస్' (Middle Class) సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. మునిష్‌కాంత్, విజయలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా డిసెంబర్ 24న జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతి జీవుల కష్టాలు, ఈఎంఐల గోల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

మిడిల్ క్లాస్ ఓటీటీ స్ట్రీమింగ్
నవంబర్ 21న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన తమిళ కామెడీ డ్రామా 'మిడిల్ క్లాస్'. నెల రోజుల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 24 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
మన ఇంట్లో జరిగే కథే
కిషోర్ ఎం రామలింగం దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి దగ్గరగా ఉంటుంది. నిత్యం ఆర్థిక ఇబ్బందులు, నెల తిరిగే సరికి కట్టాల్సిన ఈఎంఐలు, బడ్జెట్ లెక్కలు.. ఇలా సగటు మధ్యతరగతి జీవితాన్ని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ఇలాంటి కష్టాల్లో ఉన్న ఒక కుటుంబానికి.. తమ సమస్యలన్నీ ఒక్కసారే తీర్చుకునే అరుదైన అవకాశం వస్తే వాళ్లు ఏం చేశారు? ఆ తర్వాత ఎదురైన పరిణామాలు ఏంటి? అనేది ఆసక్తికరంగా, ఎమోషనల్ గా, కామెడీగా మలిచారు.
మిడిల్ క్లాస్ మూవీ గురించి..
కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే మునిష్‌కాంత్, విజయలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించగా.. కాళీ వెంకట్, రాధా రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకులకు నచ్చడంతో ఐఎండీబీలో 9.2 రేటింగ్ సాధించింది.
"ఇది మన చుట్టూ రోజూ చూసే మనుషుల కథ. ఇందులో ఉండే హాస్యం మన నిజ జీవిత పరిస్థితుల నుంచే పుడుతుంది. అందుకే ఇది ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతుంది" అని మునిష్‌కాంత్ పేర్కొన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 24 నుంచి జీ5 ఓటీటీలో తమిళ ఆడియోతో అందుబాటులోకి రానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


