OTT Thriller: ఓటీటీలో కోర్ట్‌రూమ్, లీగల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సాధారణంగా వచ్చే దెయ్యాలు, సైకో కిల్లర్ కథల కంటే.. చట్టంలోని లొసుగులు, కోర్టు గదుల్లో సాగే వాడివేడి వాదనలు, వ్యవస్థలోని అవినీతిపై పోరాడే న్యాయవాదుల కథలను ఆడియెన్స్ ఎంతగానో ఆదరిస్తుంటారు. ఆ వరుసలోనే ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5)లో విడుదలై సంచలనం సృష్టిస్తున్న తమిళ ఒరిజినల్ సిరీస్ 'సట్టముమ్ నీదియుమ్' (Sattamum Needhiyum).
వెబ్ సిరీస్ స్టోరీ ఇలా..

సుందరమూర్తి అనే అప్పుల్లో కూరుకుపోయిన ఒక సాధారణ నోటరీ లాయర్, తన జూనియర్ అరుణతో కలిసి న్యాయం కోసం వ్యవస్థతో చేసిన పోరాటమే ఈ వెబ్ సిరీస్ కథాంశం. ఈ క్రమంలో ఆయన ఎలాంటి ఎదురుదెబ్బలు తిన్నాడు? ఎలాంటి ట్విస్టులతో కేసుకు ముగింపు పలికాడు? అనేది రెండు సీజన్ల పాటు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. కోర్ట్‌రూమ్ డ్రామాలు, లీగల్ థ్రిల్లర్ల జానర్‌ను ఇష్టపడే వాల్లు ఈ 2 సీజన్ల వెబ్ సిరీస్‌ను ఎందుకు తప్పకుండా చూడాలో విశ్లేషించే 3 ముఖ్యమైన కారణాలు మీకోసం.
1. అద్భుతమైన స్క్రీన్ ప్లే..
ఈ తమిళ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు ప్రధాన బలం దీని వేగవంతమైన స్క్రీన్‌ప్లే. కథ ప్రారంభమైన అతితక్కువ సమయంలోనే నేరం, దాని విచారణ, కోర్టు వాదనల్లోకి సిరీస్ ప్రవేశిస్తుంది. అనవసరమైన సాగదీతలు, మాస్ హంగామాలు లేకుండా కేవలం 20 నిమిషాల వ్యవధి కలిగిన 6 ఎపిసోడ్‌లతో ప్రతీ సీజన్‌ను ఎంతో క్రిస్ప్‌గా తీర్చిదిద్దారు. ఒక్క సిట్టింగ్‌లోనే బింజ్-వాచ్ చేసేలా దర్శకుడు కథనాన్ని రాసుకున్నారు.
సాధారణంగా సినిమాల్లో చూపించే అతిశయోక్తి డైలాగులు, ఓవర్ ద టాప్ డ్రామాకు భిన్నంగా రియలిస్టిక్ కోర్ట్‌రూమ్ వాతావరణాన్ని ఇందులో ఆవిష్కరించారు. చట్టంలోని వివిధ సెక్షన్లు, క్లాజులపై రైటర్లు పూర్తిస్థాయి పరిశోధన చేసి, ఆ న్యాయపరమైన భాషను సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా సులభంగా డైలాగుల్లోకి మార్చారు. ప్రతి సీజన్ చివర్లో వచ్చే ఊహించని మైండ్-బెండింగ్ ట్విస్ట్ కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది.
2. ముగ్గురు నటీనటుల పర్ఫార్మెన్స్
{{/usCountry}}సాధారణంగా సినిమాల్లో చూపించే అతిశయోక్తి డైలాగులు, ఓవర్ ద టాప్ డ్రామాకు భిన్నంగా రియలిస్టిక్ కోర్ట్‌రూమ్ వాతావరణాన్ని ఇందులో ఆవిష్కరించారు. చట్టంలోని వివిధ సెక్షన్లు, క్లాజులపై రైటర్లు పూర్తిస్థాయి పరిశోధన చేసి, ఆ న్యాయపరమైన భాషను సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా సులభంగా డైలాగుల్లోకి మార్చారు. ప్రతి సీజన్ చివర్లో వచ్చే ఊహించని మైండ్-బెండింగ్ ట్విస్ట్ కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది.
2. ముగ్గురు నటీనటుల పర్ఫార్మెన్స్
{{/usCountry}}ఈ వెబ్ సిరీస్‌కు 'ఆత్మ' లాంటి పాత్ర పోషించారు నటుడు శరవణన్ (Saravanan). ఆత్మవిశ్వాసం లేని ఒక సాధారణ నోటరీ స్థాయి నుంచి పవర్‌ఫుల్ న్యాయవాదిగా మారే సుందరమూర్తి పాత్రలో ఆయన జీవించారు. ముఖంపై కనిపించే అలసట, కళ్లలో కనిపించే ఆవేదన, కోర్టులో ఆయన వినిపించే నిశ్శబ్దమైన వాదనలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
ఆయనకు జోడీగా ధైర్యసాహసాలు కలిగిన జూనియర్ లాయర్ అరుణ పాత్రలో నమ్రిత (Namritha) అద్భుతమైన నటనను కనబరిచారు. స్వార్థంతో కూడిన సమాజంలో న్యాయం వైపే నిలబడే ఆమె పాత్ర శరవణన్ శాంతమైన స్వభావానికి పూర్తి భిన్నంగా ఉంటూ కథకు ఎనర్జీని ఇస్తుంది.
ఇక సీజన్ 2లో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్‌కుమార్ తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో దుమ్మురేపారు. హత్యకు గురైన పోలీస్ ఆఫీసర్ భార్యగా, కేస్‌ను శాసించే ప్రాసిక్యూటర్‌గా ఆమె నటన వేరే లెవెల్‌లో ఉంటుంది. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ తన నటనతో ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వీరితో పాటు ట్రాన్స్‌జెండర్ మోడల్ షివిన్ గణేషన్ ఎస్‌ఐటీ (SIT) చీఫ్‌గా కీలక పాత్రలో మెప్పించారు.
3. నేచురల్ మేకింగ్
ఈ వెబ్ సిరీస్‌ను కేవలం ఒక సెట్ వేసి తీయకుండా.. నిజమైన కోర్టు గదులు, పాతకాలపు పోలీస్ స్టేషన్లు, దుమ్ము పట్టిన ప్రభుత్వ కార్యాలయాల వాతావరణాన్ని ప్రతిబింబించేలా చాలా సహజమైన లుక్‌తో నిర్మించారు. పాత్రల దుస్తులు, వారు మాట్లాడే యాస అంతా కూడా కథ జరిగే పరిసరాలకు అనుగుణంగా ఎంతో సహజంగా ఉంటాయి.
ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైన్ వర్క్ సినిమాకు ఎంతో ప్రాణం పోశాయి. న్యాయవ్యవస్థలోని లోపాలను, సామాన్యుడి పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన 'సట్టముమ్ నీదియుమ్' జీ5 (ZEE5)లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే రెండు సీజన్లను ఒకేసారి తెలుగులోనూ చూసే వీలుంది.