సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వివాదాలతోనే సావాహం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గతంలో ఓ వేదికపై బ్రహ్మానందం గురించి అనకూడని మాట అన్నారు. ఆ తర్వాత ఓ పెళ్లి ఈవెంట్లో సెల్ఫీ అడిగిన ఓ బాలుడిని తోసేశారు. ఇప్పుడేమో తమిళ దిగ్గజ నటుడు, మాజీ సీఎం ఎంజీఆర్ పై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రాజేంద్ర ప్రసాద్ కామెంట్లు

రీసెంట్ గా హైదరాబాద్ లో ‘కళాప్రపుర్ణ కాంతారావు జాతీయ అవార్డు’ ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నోరు జారారు. ‘‘ఒకప్పుడు కాంతారావు జానపదా చిత్రాల కోసం జనాలు ఎగబడేవాళ్లు. కాంతారావును చూసి ఎంజీఆర్ కూడా భయపడేవాడు. కాంతారావును చూస్తే ఎంజీఆర్ కు ఉ**’’ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
విశాల్ పోస్టు
ఎంజీఆర్ ను రాజేంద్ర ప్రసాద్ నోటికొచ్చిన మాటలు అనడంపై తమిళనాడు ప్రజలు, కోలీవుడ్ సెలబ్రిటీలు ఫైర్ అవుతున్నారు. హీరోలు కూడా రియాక్టవుతున్నారు. తమిళ హీరో విశాల్ కూడా రాజేంద్ర ప్రసాద్ ను సారీ చెప్పాలని డిమాండ్ చేశాడు.
‘‘తెలుగు ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఈవెంట్లో చేసిన కామెంట్లు విని షాక్ కు గురయ్యా’’ అని తన పోస్టులో విశాల్ రాసుకొచ్చాడు.
స్పీచ్ ఖండిస్తూ
‘‘లెజండరీ యాక్టర్, వన్ అండ్ ఓన్లీ ఎంజీఆర్ గురించి మీ స్పీచ్ ను బరువైన హృదయంతో ఖండిస్తున్నా. దివంగత ఎంజీఆర్ కేవలం దిగ్గజ నటుడు మాత్రమే కాదు తమిళనాడులో గొప్ప లీడర్. మరో దిగ్గజ నటుడు కాంతారావును పొగుడుతూ మీరు మాట్లాడటం బాగుంది. కానీ కాంతారావు గురించి పొగుడుతూ ఎంజీఆర్ ను తక్కువ చేయడం సరికాదు’’ అని విశాల్ తన పోస్టులో పేర్కొన్నాడు.
సారీ చెప్పాలని
‘‘మా ప్రజలకు ఎప్పటికీ గుర్తుండే ఎంజీఆర్ ను అలా అనడం కరెక్ట్ కాదు. ఈ దశలో ఈ కాంట్రవర్సీకి ముగింపు పలకాలి. అది ఎలాగో మీకు బాగా తెలుసు. క్షమాపణ చెప్పి ఈ సమస్యకు ఎండ్ కార్డు వేయండి. మిమ్మల్ని ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి’’ అని విశాల్ తెలిపాడు.
{{/usCountry}}‘‘మా ప్రజలకు ఎప్పటికీ గుర్తుండే ఎంజీఆర్ ను అలా అనడం కరెక్ట్ కాదు. ఈ దశలో ఈ కాంట్రవర్సీకి ముగింపు పలకాలి. అది ఎలాగో మీకు బాగా తెలుసు. క్షమాపణ చెప్పి ఈ సమస్యకు ఎండ్ కార్డు వేయండి. మిమ్మల్ని ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి’’ అని విశాల్ తెలిపాడు.
{{/usCountry}}‘‘ఫ్యూచర్ లో ఇంకా ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఓ నటుడిగా నేను క్షమాపణలు డిమాండ్ చేస్తా’’ అని విశాల్ తన పోస్టును ముగించాడు.
సెలబ్రిటీలు కూడా
రాజేంద్ర ప్రసాద్ కామెంట్లపై ఇతర తమిళ సినీ సెలబ్రిటీలు కూడా ఫైర్ అవుతున్నారు. మరో సీనియర్ నటుడు నాజర్ కూడా రాజేంద్ర ప్రసాద్ ను సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.