Jana Nayagan Release Date: బాక్సాఫీస్ ఊచకోతకు సిద్ధమైన సీఎం.. విజయ్ చివరి మూవీ జన నాయగన్ రిలీజ్ డేట్ ఇదే..

Jana Nayagan Release Date: తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్ ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాను జులై 24న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందింది.

Published on: Jul 9, 2026, 07:29:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jana Nayagan Release Date: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ అలియాస్ దళపతి విజయ్ బాక్సాఫీస్ ఊచకోతకు సిద్ధమవుతున్నాడు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నటించిన చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) థియేట్రికల్ రిలీజ్ డేట్ లాక్ అయింది. ఎన్నో వాయిదాలు, సస్పెన్స్ ల తర్వాత ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అయింది.

Jana Nayagan Release Date: కన్ఫమ్.. విజయ్ చివరి మూవీ జన నాయగన్ రిలీజ్ డేట్ ఇదే.. బాక్సాఫీస్ ఊచకోతకు సిద్ధమైన సీఎం
Jana Nayagan Release Date: కన్ఫమ్.. విజయ్ చివరి మూవీ జన నాయగన్ రిలీజ్ డేట్ ఇదే.. బాక్సాఫీస్ ఊచకోతకు సిద్ధమైన సీఎం

ఎన్నో అడ్డంకులు.. సీఎం విజయ్ లాస్ట్ రైడ్

దళపతి విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆయన సీఎం పీఠం అధిష్టించిన తర్వాత ఈ మూవీ గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. షూటింగ్ పరంగా, పోస్ట్ ప్రొడక్షన్ పరంగా ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎట్టకేలకు రిలీజ్ కు క్లియరెన్స్ తెచ్చుకుంది.

తాజా సమాచారం ప్రకారం జన నాయగన్ సినిమాను జులై 24, 2026న గ్లోబల్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ఈ డేట్ గురించి మేకర్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో మెగా రిలీజ్ కన్ఫమ్ అయిపోయింది. ఈ న్యూస్ వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల కొద్దీ విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు.

హెచ్ వినోద్ మార్క్ వయొలెన్స్.. అనిరుధ్ ఎలివేషన్స్

'తీరన్ అధిగారమ్ ఒండ్రు', 'వలిమై', 'తునివు' లాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలతో తన సత్తా చాటిన డైరెక్టర్ హెచ్. వినోద్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ రియల్ లైఫ్ రాజకీయ గుర్తింపుకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. దసరా, లియో సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తుండటంతో ఆడియన్స్ లో హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

ఈ సినిమాలో విజయ్ సరసన గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే 'యానిమల్' విలన్ బాబీ డియోల్ ఇందులో పవర్ ఫుల్ నెగెటివ్ రోల్ లో నటిస్తుండటం విశేషం. వీళ్లతో పాటు 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ లాంటి భారీ తారాగణం కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో, హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. విజయ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సినిమా నిజానికి సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాల్సి ఉన్నా సెన్సార్ చిక్కులతో సాధ్యం కాలేదు. మొత్తానికి ఆరు నెలల తర్వాత థియేటర్లలోకి రాబోతోంది. తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు ఇది రీమేక్ అన్న వార్తల నేపథ్యంలో మూవీకి తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More