...
...
Next Story

OTT: ప్రైమ్ వీడియోలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ డ్రామా ‘బ్రేక్‌ఫాస్ట్’.. షాకింగ్ క్లైమాక్స్ ట్విస్ట్.. తెలుగులోనూ..

OTT: థియేటర్లలో ఆకట్టుకున్న తమిళ చిత్రం ‘బ్రేక్‌ఫాస్ట్’ (Breakfast) డిజిటల్ ఎంట్రీకి డేట్ ఫిక్స్ చేసుకుంది. జూన్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కన్నడ వెర్షన్‌తో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఒకేసారి డిజిటల్ ప్రీమియర్ కానుంది.

Published on: Jun 22, 2026, 22:13:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT: భార్యాభర్తల మధ్య వచ్చే ఈగోలు, మనస్పర్థలు జీవితాలను ఎలా నాశనం చేస్తాయనే పాయింట్‌తో, ఊహించని ఎమోషనల్ క్లైమాక్స్ ట్విస్టులతో వచ్చిన సినిమా బ్రేక్‌ఫాస్ట్ (Breakfast). సమకాలీన సమాజంలో మారుతున్న వైవాహిక బంధాలు, భార్యాభర్తల మధ్య వచ్చే అహాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నాయనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

OTT: ప్రైమ్ వీడియోలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ డ్రామా ‘బ్రేక్‌ఫాస్ట్’.. షాకింగ్ క్లైమాక్స్ ట్విస్ట్.. తెలుగులోనూ..
OTT: ప్రైమ్ వీడియోలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ డ్రామా ‘బ్రేక్‌ఫాస్ట్’.. షాకింగ్ క్లైమాక్స్ ట్విస్ట్.. తెలుగులోనూ..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా జూన్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కన్నడ వెర్షన్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఒకేసారి అందుబాటులోకి రానుంది. ఈ హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ గాంధీ కృష్ణ దర్శకత్వం వహించారు.

భార్యాభర్తల ఈగోల కథ.. ‘బ్రేక్‌ఫాస్ట్’ అసలు కథేంటి?

ఈ సినిమా కథ మొత్తం రెండు వేర్వేరు కాలాల్లో జరిగే భార్యాభర్తల బంధాల చుట్టూ తిరుగుతుంది. లక్ష్మి, ఆమె భర్త (క్రితిక్ మోహన్) పెళ్లయిన కొన్ని నెలలకే తీవ్రమైన మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. కోర్టు ఆదేశాల ప్రకారం వారు కౌన్సిలర్ (కస్తూరి) వద్దకు వెళ్తారు. అక్కడ కూడా వీరిద్దరూ విపరీతంగా గొడవ పడటం చూసిన కౌన్సిలర్, వారి కళ్ళు తెరిపించడం కోసం గతంలో లవ్ మ్యారేజ్ చేసుకున్న మరో జంట కథను వారికి వివరిస్తుంది.

ఆ రెండో కథలో.. శంతను (రానవ్) అనే సాధారణ యువకుడిని జానవి (రోస్మిన్) తన తండ్రి (సంపత్ రాజ్) బిజినెస్‌లో పని చేయడానికి నియమిస్తుంది. ఈ క్రమంలోనే వారిద్దరూ గాఢమైన ప్రేమలో పడతారు. అయితే జానవి తండ్రికి ఈ ప్రేమ ఇష్టం ఉండదు. చివరికి తండ్రిని ఎదిరించి, జైలుకు పంపి మరీ శంతనును పెళ్లి చేసుకుంటుంది జానవి. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య, కొద్దిరోజులకే రోజువారీ గొడవలు, శారీరక హింస మొదలవుతాయి. వారికి ఒక బాబు పుట్టినప్పటికీ వారి మధ్య బంధం కలవదు సరి కదా.. మరింత దారుణంగా తయారవుతుంది.

ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి? లక్ష్మి ఎవరు?

దర్శకుడు ఏఆర్ గాంధీ కృష్ణ ఒక వైవాహిక బంధంలోని రెండో వైపును, సమాజంలోని చేదు నిజాలను చాలా ప్రాక్టికల్‌గా చూపించారు. పెళ్లి అనే బంధంలో ఈగోలు చేరితే జీవితాలు ఎలా విచ్ఛిన్నమవుతాయో, టైటిల్ జస్టిఫికేషన్ (Break - Fast) ద్వారా అద్భుతంగా వివరించారు.

బ్రేక్‌ఫాస్ట్ సినిమా హైలైట్స్

రెండు ప్రేమకథలను దర్శకుడు చాలా ఆసక్తికరంగా నడిపించారు. మొదటి కథలోని సస్పెన్స్ రెండో కథకు పర్ఫెక్ట్ లీడ్ ఇస్తుంది. నటీనటుల విషయానికి వస్తే మాలీవుడ్ నుంచి తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన రోస్మిన్ తన నటనతో మెప్పించింది. డెబ్యూ హీరో రానవ్ కూడా అద్భుతంగా నటించాడు. సీనియర్ నటి కస్తూరి, సంపత్ రాజ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం.

అయితే సినిమాలో మెలోడ్రామా కాస్త ఎక్కువైంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే కొట్టుకునే సీన్లు, చెంపదెబ్బల సీన్లు మోతాదుకు మించి ఉన్నాయి. కొన్ని సీన్లను సాగదీసినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ, ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాను చూడాలనుకునే వారికి ‘బ్రేక్‌ఫాస్ట్’ ఓటీటీలో ఒక బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks