తెలుగులో సింహరాశి, దేవిలాంటి సినిమాల్లో బాల నటుడిగా నటించిన గుర్తింపు పొందాడు మహేంద్రన్. అతడు లీడ్ రోల్లో నటించిన సినిమా నీలకంఠ. ఈ మూవీ ఈ నెల 2న థియేటర్లలో రిలీజ్ కాగా.. వచ్చే నెల మొదటి వారంలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
నీలకంఠ ఓటీటీ రిలీజ్ డేట్

తమిళ రూరల్ డ్రామా అయిన నీలకంఠ జనవరి 2న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఫిబ్రవరి 6 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ అందుబాటులోకి వస్తున్నట్లు ఆ ఓటీటీ శుక్రవారం (జనవరి 30) వెల్లడించింది.
“పవర్, కష్టాలు, విజయాలను నీలకంఠలో చూడండి. ఫిబ్రవరి 6 నుంచి కేవలం సన్ నెక్ట్స్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. వాళ్లు శిక్షించిన మనిషి.. వాళ్ల లీడర్ గా ఎదిగాడు అనే కామెంట్ ఉన్న పోస్టర్ ను ఈ సందర్భంగా షేర్ చేసింది.
నీలకంఠ మూవీ విశేషాలు
నీలకంఠ ఓ రూరల్ డ్రామా. ఓ సాధారణ టేలర్ గా ఉన్న యువకుడు గొప్ప చదువులు చదవాలని కలలు కంటాడు. కానీ చిన్నతనంలో చేసిన ఓ తప్పు వల్ల కొన్నేళ్లపాటు ఊరు విడిచి ఎక్కడికీ వెళ్లకుండా, పైచదువులు చదవకుండా శిక్ష ఎదుర్కొంటాడు. అతడు ప్రేమించిన అమ్మాయి పైచదువుల కోసం వెళ్లిపోతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో అతడు కబడ్డీ ఆడాలని నిర్ణయించుకుంటాడు. ఇది అతని జీవితాన్ని ఎలా మార్చింది? ఇంతకీ అతడు చేసిన తప్పేంటి? అన్నది ఈ నీలకంఠ సినిమాలో చూడొచ్చు.
ఈ సినిమాలో నీలకంఠ పాత్రలో మహేంద్రన్ నటించాడు. ఇక ఫిమేల్ లీడ్ గా యశ్న నటించగా.. నేహా పఠాన్, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్లు కీలకపాత్రలు పోషించారు. స్నేహా ఉల్లాల్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఈ సినిమాను రాకేష్ మాధవన్ డైరెక్ట్ చేశాడు. మార్క్ ప్రశాంత్ మ్యూజిక్ అందించాడు. ఈ నీలకంఠ సినిమాను తెలుగులోనూ ఫిబ్రవరి 6 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.
{{/usCountry}}ఈ సినిమాలో నీలకంఠ పాత్రలో మహేంద్రన్ నటించాడు. ఇక ఫిమేల్ లీడ్ గా యశ్న నటించగా.. నేహా పఠాన్, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్లు కీలకపాత్రలు పోషించారు. స్నేహా ఉల్లాల్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఈ సినిమాను రాకేష్ మాధవన్ డైరెక్ట్ చేశాడు. మార్క్ ప్రశాంత్ మ్యూజిక్ అందించాడు. ఈ నీలకంఠ సినిమాను తెలుగులోనూ ఫిబ్రవరి 6 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.
{{/usCountry}}