...
...
Next Story

స్టార్ హీరోకు షాకింగ్ అనుభవం.. షేక్ హ్యాండ్ ఇస్తుంటే బ్లేడ్‌తో కోసేసిన అభిమాని! అసలేం జరిగిందంటే?

తమిళ స్టార్ హీరో సంచలన విషయాన్ని బయటపెట్టాడు. షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఓ అభిమాని తన చేతిని బ్లేడ్ తో కోసిన విషయాన్ని వెల్లడించాడు.

Published on: Nov 1, 2025, 17:11:17 IST
Advertisement

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తాజాగా బయటపెట్టిన ఓ సంఘటన సంచలనంగా మారింది. ఓ ఫ్యాన్ షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో బ్లేడ్ తో తన అరచేతిని కోశాడని అజిత్ వెల్లడించాడు. తమ అభిమాన సెలబ్రిటీలను కలిసినప్పుడు ఫ్యాన్స్ ఎలా ప్రవర్తించాలని ఆశిస్తారనే దానిపై అజిత్ సుదీర్ఘంగా మాట్లాడారు. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.

అరచేయి కోశాడు

అజిత్ కుమార్
అజిత్ కుమార్

అభిమానులు తన కారు ముందు వారి వాహనాలను ఆపి, సెల్ఫీల కోసం కారు కిటికీ అద్దాలు దించమని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయని అజిత్ చెప్పాడు. వచ్చిన వ్యక్తి నిజంగా అభిమానా లేక హాని తలపెట్టే వ్యక్తా అని ఒక సెలబ్రిటీకి ఎలా తెలుస్తుందని కూడా అజిత్ ప్రశ్నించాడు. ఈ సందర్భంలోనే ఒకసారి ఒక వ్యక్తి తనను పలకరిస్తూ తన అరచేతిని కోసిన విషయాన్ని అజిత్ వెల్లడించాడు. అభిమానుల వల్ల తాను చాలాసార్లు శారీరకంగా గాయపడ్డానని చెప్పాడు

బ్లేడ్ తో కోయడంతో

బ్లేడ్‌తో కోయడం వల్ల తన చేతులపై మచ్చలు ఉన్నాయని అజిత్ తెలిపాడు. ‘‘చాలా మంది అభిమానులు మిమ్మల్ని తాకాలని కోరుకుంటారు. ఇది 2005లో జరిగింది. చాలా మంది తమ చేతులను ముందుకు చాచారు. నేను వారితో షేక్ హ్యాండ్ ఇచ్చి కారులోకి ఎక్కా. అప్పుడు నాకు రక్తం కారుతుంది. అది ఒక అవుట్‌డోర్ షూటింగ్ సమయంలో జరిగింది’’ అని అజిత్ తెలిపాడు.

టీనేజర్

‘‘అప్పుడు మేం ఒక హోటల్ లో ఉన్నాం. అక్కడ ప్రతిరోజూ జనం గుమిగూడేవారు. ఆ హోటల్ యజమాని.. 'అజిత్, మీరు షాట్‌కు వెళ్లేటప్పుడు లేదా తిరిగి వచ్చేటప్పుడు దయచేసి కొంత సమయం కేటాయించగలరా? జనాన్ని అదుపు చేయడం మాకు కష్టంగా ఉంది. మీరు వారికి చేయి ఊపి, కొన్ని ఫోటోలు దిగగలరా?' అని అడిగాడు. ఒక రోజు చాలా మంది నాతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, నన్ను తాకడానికి తమ చేతులను ముందుకు చాచారు’’ అని అజిత్ చెప్పుకొచ్చాడు.

అజిత్ చివరగా 'విడాముయర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాల్లో నటించాడు. తన రాబోయే చిత్రాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks