ఓటీటీలోకి ఈ వారం చాలా మంచి కంటెంటే వచ్చింది. తెలుగుతోపాటు వివిధ భాషల మూవీస్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ వీటిలో ఉన్నాయి. ఇక ఆదిత్య మాధవన్, గౌరీ కిషన్, అంజు కురియన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మెడికల్ థ్రిల్లర్ 'అదర్స్' (Others) కూడా ఇందులో ఒకటి. శుక్రవారమే (డిసెంబర్ 19) ఓటీటీలో విడుదలైంది. ఐవీఎఫ్ (IVF) మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.
అదర్స్ ఓటీటీ స్ట్రీమింగ్

థియేటర్లలో నవంబర్ 7న విడుదలైన తమిళ థ్రిల్లర్ మూవీ 'అదర్స్'. ఆదిత్య మాధవన్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమాలో '96', 'బేబీ' ఫేమ్ గౌరీ కిషన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ఈ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది కేవలం తమిళ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనే స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదొక మెడికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఐవీఎఫ్ పద్ధతిలో పుట్టిన పిల్లల వెనుక ఉన్న ఒక భారీ కుట్రను ఛేదించే పోలీస్ ఆఫీసర్ కథ ఇది. ఆసుపత్రుల్లో అండాల చోరీ, నిషేధిత రసాయనాల వాడకం వంటి చీకటి కోణాలను ఈ సినిమాలో చూపించారు. అంజు కురియన్, మునిష్‌కాంత్, హరీష్ పేరడి ఇతర కీలక పాత్రల్లో నటించారు. జిబ్రాన్ వైబోధ సంగీతం అందించాడు. సస్పెన్స్ తోపాటు అతని మ్యూజిక్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి.
వివాదంతో వైరల్..
సినిమా రివ్యూలు ఎలా ఉన్నా.. ప్రమోషన్ల సమయంలో జరిగిన ఒక సంఘటన వల్ల ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్ గౌరీ కిషన్ బరువు గురించి మాట్లాడుతూ బాడీ షేమింగ్ చేయగా, ఆమె అతనికి ఘాటుగా సమాధానం ఇచ్చి క్లాస్ పీకింది. ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఈ అదర్స్ సినిమాకు కూడా మంచి పబ్లిసిటీ లభించింది. ఈ మూవీకి థియేటర్లలోనూ ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో 8.3 రేటింగ్ నమోదైంది.
ఇక ఈ అదర్స్ మూవీ ఒక్కటే కాకుండా.. ఈ వీకెండ్ ఓటీటీలో చూడటానికి మరికొన్ని మూవీస్, వెబ్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. జియోహాట్స్టార్ లో ఫార్మా అనే మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, మిసెస్ దేశ్పాండే అనే మరో సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్, సంతాన ప్రాప్తిరస్తు అనే తెలుగు కామెడీ డ్రామా.. నెట్ఫ్లిక్స్ లో ప్రేమంటే అనే తెలుగు మూవీ, జీ5 ఓటీటీలో డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ అనే మలయాళం థ్రిల్లర్ సినిమాలు చూడొచ్చు.
{{/usCountry}}ఇక ఈ అదర్స్ మూవీ ఒక్కటే కాకుండా.. ఈ వీకెండ్ ఓటీటీలో చూడటానికి మరికొన్ని మూవీస్, వెబ్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. జియోహాట్స్టార్ లో ఫార్మా అనే మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, మిసెస్ దేశ్పాండే అనే మరో సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్, సంతాన ప్రాప్తిరస్తు అనే తెలుగు కామెడీ డ్రామా.. నెట్ఫ్లిక్స్ లో ప్రేమంటే అనే తెలుగు మూవీ, జీ5 ఓటీటీలో డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ అనే మలయాళం థ్రిల్లర్ సినిమాలు చూడొచ్చు.
{{/usCountry}}