Tammareddy Bharadwaja: తెలుగు చిత్రసీమలో ఏ విషయమైనా ముక్కుసూటిగా, నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తులలో సీనియర్ విశ్లేషకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఒకరు. ఇండస్ట్రీలో ఎంతటి పెద్ద స్టార్ లేదా డైరెక్టర్ అయినా సరే.. తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం ఆయన శైలి. తాజాగా ‘వదల’ చిత్ర ప్రమోషన్ల వేదికగా తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.
తమ్మారెడ్డి కామెంట్లు

టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ క్రేజీ దర్శకుడితో వర్క్ చేయడానికి బడా హీరోలు సైతం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో జగపతిబాబు, లయ నటిస్తున్న ‘వదల’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయిన అనిల్ రావిపూడిని ఉద్దేశించి తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
అనిల్ రావిపూడి పెద్ద డైరెక్టర్
"అనిల్ రావిపూడి ఇప్పుడు చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఒక ఈవెంట్ కోసం పిలిస్తే వస్తాడో లేదో అనుకున్నా. ‘అదేం లేదు గురువు గారు ఫోన్ చేయండి’ అని అన్నాడు. కానీ నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇదేంటి ఇలా చేశాడని అనుకున్నా. కానీ సాయంత్రం మళ్లీ కాల్ బ్యాక్ చేశాడు. వదలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలంటే వస్తానన్నాడు. మాట మీద నిలబడ్డాడు" అని తమ్మారెడ్డి తెలిపారు.
అలాగే ఏడిపించేవాళ్లం
"మేము కూడా ఒకప్పుడు డైరెక్టర్ గా పెద్ద పొజిషన్‌లో ఉన్నప్పుడు అందరినీ అలాగే ఏడిపించేవాళ్ళం. ఫోన్లు ఎత్తేవాళ్లం కాదు. కాబట్టి అనిల్ అలా చేయడంలో వింతేమీ లేదు" అంటూ స్పోర్టివ్‌గా సమాధానమిచ్చి అందరినీ నవ్వించారు తమ్మారెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
జగపతి బాబు, లయ రీ ఎంట్రీ
ఒకప్పుడు టాలీవుడ్‌లో హోమ్లీ హీరోయిన్గా ‘స్వయంవరం’, ‘ప్రేమించు’ వంటి చిత్రాలతో అలరించిన లయ.. పెళ్లి తర్వాత సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ‘వదల’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. జగపతి బాబు కూడా చాలా గ్యాప్ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
{{/usCountry}}ఒకప్పుడు టాలీవుడ్‌లో హోమ్లీ హీరోయిన్గా ‘స్వయంవరం’, ‘ప్రేమించు’ వంటి చిత్రాలతో అలరించిన లయ.. పెళ్లి తర్వాత సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ‘వదల’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. జగపతి బాబు కూడా చాలా గ్యాప్ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
{{/usCountry}}జగపతి బాబు, లయ కాంబినేషన్ అనగానే ప్రేక్షకులలో ఒక రకమైన క్లాసిక్ ఫీల్ కలుగుతుంది. ఇప్పుడీ కాంబోలో వస్తున్న ‘వదలా’ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ జూలై 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి రీ ఎంట్రీలో జగపతి బాబు, లయ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.