టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ కాలు కదిపారు. నటి కృతిక కామ్రా, టెలివిజన్ ప్రెజెంటర్ గౌరవ్ కపూర్ పెళ్లిలో సెహ్వాగ్, యువీ డ్యాన్స్ చేశారు. వీళ్లు స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
యువీ, సెహ్వాగ్

మార్చి 11న ముంబైలోని తమ నివాసంలో కృతిక కామ్రా, గౌరవ్ కపూర్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వివాహం జరిగిన తర్వాత జంటకు వెల్ కమ్ చెప్తూ వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ తదితరులు డ్యాన్స్ చేశారు.
వైరల్ వీడియో
కృతిక కామ్రా, గౌరవ్ కపూర్ పెళ్లిలో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో క్లిప్ లో నటులు ఫర్హాన్ అక్తర్, అంగద్ బేడీ తదితరులతో కలిసి యువీ, సెహ్వాగ్ డ్యాన్స్ చేయడం కనిపించింది. 2007 నాటి క్రిస్ బ్రౌన్ సాంగ్ ‘ఫరెవర్’ కు వీళ్లందరూ కలిసి స్టెప్పులేశారు.
కృతిక, గౌరవ్ వివాహం గురించి
కృతిక, గౌరవ్ జంట తమ బాంద్రా నివాసంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో నిరాడంబరమైన వేడుకలో వివాహ బంధంతో ఒక్కటైంది. ఈ సందర్భంగా కృతిక ఎరుపు రంగు చీర ధరించగా, గౌరవ్ ప్రత్యేకంగా రూపొందించిన బంధ్గాలాను వేసుకున్నాడు. వివాహ లాంఛనాలు పూర్తి చేసుకున్న తర్వాత నూతన వధూవరులు బయట వేచి ఉన్న ఫోటోగ్రాఫర్లను పలకరించారు. వాళ్లకు స్వీట్లు పంచారు.
సెలబ్రిటీలు
{{/usCountry}}కృతిక, గౌరవ్ జంట తమ బాంద్రా నివాసంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో నిరాడంబరమైన వేడుకలో వివాహ బంధంతో ఒక్కటైంది. ఈ సందర్భంగా కృతిక ఎరుపు రంగు చీర ధరించగా, గౌరవ్ ప్రత్యేకంగా రూపొందించిన బంధ్గాలాను వేసుకున్నాడు. వివాహ లాంఛనాలు పూర్తి చేసుకున్న తర్వాత నూతన వధూవరులు బయట వేచి ఉన్న ఫోటోగ్రాఫర్లను పలకరించారు. వాళ్లకు స్వీట్లు పంచారు.
సెలబ్రిటీలు
{{/usCountry}}కృతిక, గౌరవ్ పెళ్లికి సోహ అలీ ఖాన్, ఆన్య సింగ్, ఫర్హాన్ అక్తర్, మలైకా అరోరా, నేహా ధూపియా, అంగద్ బేడీ, అమృతా అరోరా, షకీల్ లడక్, యువరాజ్ సింగ్, హేజెల్ కీచ్, ఆశిష్ నెహ్రా, వీరేందర్ సెహ్వాగ్ తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు. మసాబా గుప్తా, సత్యదీప్ మిశ్రా, అజిత్ అగార్కర్, ఫాతిమా, జహీర్ ఖాన్, సాగరిక ఘట్గే, పూజా గోర్ కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు.
కొత్త అధ్యాయం
ఇది తమ జీవితంలో కొత్త అధ్యాయం అని కృతిక, గౌరవ్ అన్నారు. ఏఎన్ఐతో వీళ్లు మాట్లాడుతూ.. ‘‘మీరు ప్రేమించే వ్యక్తులతో పంచుకునేవే జీవితంలో అత్యంత అర్ధవంతమైన క్షణాలని మేం ఎప్పుడూ నమ్ముతాము. మేము ఈ కొత్త అధ్యాయాన్ని కలిసి ప్రారంభించాం. మా కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో ముంబైలోని మా ఇంట్లో పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉంది’’ అని కృతిక, గౌరవ్ పేర్కొన్నారు. ఈ కొత్త జంటకు సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు విషెస్ చెప్తున్నారు.