Chahal Venu Madhav: వేణు మాధవ్ లా మారిన టీమిండియా స్పిన్నర్ చాహల్- బ్రహ్మానందం లాంటి శిఖర్ ధావన్ కు కౌంటర్- ఇది నిజమేనా?

Chahal As Venu Madhav: గ్రౌండ్ లో స్పిన్ తో వికెట్లు తీయడమే కాదు.. సోషల్ మీడియాాలో వీడియోలతో కామెడీ చేయడంలోనూ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ స్టైలే వేరు. తాజాగా టాలీవుడ్ దివంగత కమెడియన్ వేణు మాధవ్ లా చాహల్ మారిపోయాడు. బ్రహ్మానందం లాంటి ధావన్ కు కౌంటర్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Published on: Nov 4, 2026, 11:36:47 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Chahal As Venu Madhav: క్రికెట్, సినిమా.. జనాలకు బిగ్గెస్ట్ ఎంటర్ టైన్మెంట్ అందించే రెండు డిఫరెంట్ మార్గాలు ఇవి. అలాంటిది ఇవి రెండు కలిస్తే వచ్చే కిక్కే వేరు. సినిమా సెలబ్రిటీలు క్రికెట్ ఆడుతుండటం, క్రికెటర్లు మూవీ డైలాగ్స్, సాంగ్స్ కు రీల్స్ చేయడం ఇలాంటిదే. తాజాగా యుజ్వేంద్ర చాహల్, శిఖర్ ధావన్ ఇలాగే చేశారు.

వేణు మాధవ్ లా మారిన టీమిండియా స్పిన్నర్ చాహల్- బ్రహ్మానందం లాంటి శిఖర్ ధావన్ కు కౌంటర్- ఇది నిజమేనా?
వేణు మాధవ్ లా మారిన టీమిండియా స్పిన్నర్ చాహల్- బ్రహ్మానందం లాంటి శిఖర్ ధావన్ కు కౌంటర్- ఇది నిజమేనా?

వేణు మాధవ్ లా చాహల్

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ మ్యాచ్ లో సీరియస్ గా ఉన్నా బయట మాత్రం చాలా ఫన్నీగా ఉంటారు. ముఖ్యంగా చాహల్ బోలెడు కామెడీ చేస్తాడు. ఇక గబ్బర్ శిఖర్ కూడా డ్యాన్స్ తో అదరగొడతాడు. తాజాగా వీళ్లిద్దరూ ఒక్క చోట కలిశారు. వెంటనే వేణు మాధవ్ లా చాహల్, బ్రహ్మానందంలా శిఖర్ ధావన్ మారిపోయారు.

అప్పలరాజు మూవీ

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సెటైరికల్ మూవీ ‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు’. 2011లో వచ్చిన ఈ సినిమాలో సునీల్ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, వేణు మాధవ్ కామెడీ రోల్స్ లో నటించారు. ఇందులో రౌడీ షీటర్ అయిన బ్రహ్మానందం మూవీకి ఫైనాన్స్ చేయడానికి ముందుకు వస్తాడు.

కానీ సినిమాలో తాను రాసిన పాటలనే పెట్టాలంటాడు. ఇక బ్రహ్మానందానికి సెక్యూరిటీ గార్డుగా వేణు మాధవ్ నటించారు.

మీమ్ డైలాగ్

ఈ సినిమాలో బ్రహ్మానందం ఏం చెప్పినా వెనుకాలే ఉంటే వేణు మాధవ్ ‘వా అన్నా వా’ అంటూ పొగిడేస్తుంటాడు. ఈ డైలాగ్ పాపులర్ మీమ్ మెటీరియల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ డైలాగ్ నే శిఖర్ ధావన్, వేణు మాధవ్ ఇమిటేట్ చేశారు. ఇందులో శిఖర్ ధావన్ బ్రహ్మానందంలా కనిపించగా.. వెనుకాలే ఉండే వేణు మాధవ్ లా చాహల్ ‘వా అన్నా వా’ అంటూ మిమిక్ చేశాడు.

ఇది నిజమేనా?

సోషల్ మీడియాలో శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్ వీడియో వైరల్ గా మారింది. తెలుగులో టాప్ కమెడియన్లయినా బ్రహ్మానందం, వేణు మాధవ్ లా వీళ్లు నటించడంతో తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.

దివంగత నటుడు వేణు మాధవ్ లా చాహల్ చేయడంతో ఇది నిజమేనా అంటూ సోషల్ మీడియాలో వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. వేణు మాధవ్ టైమింగ్ ను కొట్టే కమెడియనే లేడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తం మీద ఈ వీడియో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.