OTT Web Series: క్రికెటర్ కావాలనే అమ్మాయి కల- ఆ ఒక్క రాత్రి చేసిన తప్పుతో అంతా నాశనం- కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?

OTT Web Series: ఓటీటీలోకి మరో సరికొత్త వెబ్ సిరీస్ రాబోతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజైంది. క్రికెటర్ కావాలని చిన్నప్పటి నుంచి కల కన్న ఆ అమ్మాయి.. ఒక రాత్రి చేసిన తప్పుతో అంతా తలకిందులవుతుంది. అసలే ఈ వెబ్ సిరీస్ ఏంటో చూసేయండి. 

Published on: Nov 15, 2026, 11:36:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Web Series: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) ప్రేక్షకులను అలరించడానికి మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో ముందుకు వస్తోంది. అదే 'తీన్ తిగాడ' (Teen Tigada). కుర్రకారును ఆకట్టుకునే రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.

క్రికెటర్ కావాలనే అమ్మాయి కల- ఆ ఒక్క రాత్రి చేసిన తప్పుతో అంతా నాశనం- కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?
క్రికెటర్ కావాలనే అమ్మాయి కల- ఆ ఒక్క రాత్రి చేసిన తప్పుతో అంతా నాశనం- కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?

కథ ఏంటంటే..

'తీన్ తిగాడ' అనేది యువత కలలు, వారి జీవితాల్లో అనుకోకుండా జరిగే పరిణామాల చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ ప్రధానంగా అస్మాని, మానస్ అనే లవర్స్ ప్రయాణాన్ని చూపిస్తుంది. ఒకరు మ్యూజిక్ రంగంలో, మరొకరు క్రికెట్‌లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటుంటారు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

ఆ ఒక్క తప్పుతో

అస్మాని ఏమో చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలని కల కంటుంది. కానీ ఒక్క రాత్రి అస్మాని, మానస్ ఫిజికల్ గా దగ్గరవుతారు. దీంతో అస్మానికి ప్రగ్నెన్సీ వస్తుంది. మరోవైపు తండ్రి కావడానికి మానస్ కూడా రెడీగా ఉండడు. కెరీర్ కోసం కలలు కంటున్న సమయంలోనే పేరెంట్‌హుడ్ బాధ్యతలు ఎదురైతే వారు ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు? ప్రేమ, కుటుంబం, కెరీర్.. ఈ మూడింటి మధ్య వారి ప్రయాణం ఎలా సాగిందనేదే ఈ వెబ్ సిరీస్ మొయిన్ స్టోరీ.

ట్రైలర్ ఎలా ఉందంటే?

తాజాగా విడుదలైన 'తీన్ తిగాడ' ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ సీన్స్‌తో పాటు, ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను ట్రైలర్‌లో అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. కలలు కనే వయసులో ఊహించని బాధ్యతలు మీద పడితే వచ్చే సంఘర్షణను ట్రైలర్‌లో చాలా సహజంగా చూపించారు.

ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ యూత్‌ను కట్టిపడేసేలా ఉన్నాయి. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా, అందులో ఉన్న పెయిన్, స్ట్రగుల్ స్పష్టంగా కనిపిస్తోంది.

నటీనటులు వీళ్లే

ఈ వెబ్ సిరీస్‌లో ప్రసన్న బిష్ట్, దనేష్ రజ్వీ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. వీరితో పాటు తాన్యా భరద్వాజ్, ఈషా నారాయణ్ సింగ్, దివ్యాంశు బిష్ట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాను దర్శకుడు రాజీవ్ రాజ్ చాలా సెన్సిబుల్‌గా తెరకెక్కించారు.

ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ 'తీన్ తిగాడ' వెబ్ సిరీస్ నవంబర్ 20 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది. హిందీ భాషలో ఈ సిరీస్ అందుబాటులో ఉంటుంది. యూత్‌ఫుల్ కంటెంట్, బోల్డ్ రొమాంటిక్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సిరీస్ కచ్చితంగా నచ్చుతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More