Teja Sajja: టాలీవుడ్‌లో కొత్త తరహా ఇతిహాసాలు, వినూత్న జానర్లకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా. 2021లో వచ్చిన 'జాంబి రెడ్డి' మూవీతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి 'జాంబి కాన్సెప్ట్'ను పరిచయం చేసిన ఆయన.. ఆ తర్వాత 'హనుమాన్' (HanuMan) చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లతో ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్నారు.

ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సీక్వెల్ ‘జాంబి రెడ్డి 2 - NXT LVL’ గురించి ఇంటర్నేషనల్ మీడియా సంస్థ 'వెరైటీ ఇండియా'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ స్టార్ షనాయా కపూర్ (Shanaya Kapoor) ఈ చిత్రంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండగా, ప్రముఖ దర్శకుడు సుపర్ణ్ ఎస్. వర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
బిగ్గెస్ట్ విజువల్ వండర్.. యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్
ఈ సినిమా మేకింగ్, స్కేల్ గురించి తేజ సజ్జా మాట్లాడుతూ.. "జాంబి రెడ్డి 2 ఒక పక్కా ఫన్ అండ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. మొదటి భాగాన్ని ఎంతగానో ఆస్వాదించిన ప్రేక్షకులకు ఈ సీక్వెల్ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. మేము ఈ చిత్రాన్ని అత్యంత భారీ కాన్వాస్‌పై, గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నాం. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి" అని తెలిపారు.
ఈ చిత్రం ఇటీవలే పట్టాలెక్కింది. గ్రాండ్ ఆర్ట్ సెట్లు, మైండ్ బ్లాకింగ్ యాక్షన్ స్టంట్స్‌తో చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.
షనాయా కపూర్ సౌత్ ఎంట్రీ, 7 భాషల్లో గ్రాండ్ రిలీజ్
ఈ జాంబి రెడ్డి 2 సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ బాలీవుడ్ బ్యూటీ షనాయా కపూర్ (Shanaya Kapoor). ఈ ప్రాజెక్ట్ ద్వారానే ఆమె దక్షిణాది చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌ను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
{{/usCountry}}ఈ జాంబి రెడ్డి 2 సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ బాలీవుడ్ బ్యూటీ షనాయా కపూర్ (Shanaya Kapoor). ఈ ప్రాజెక్ట్ ద్వారానే ఆమె దక్షిణాది చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌ను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
{{/usCountry}}భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను ఏకంగా 7 భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, నేపాలీ, జపనీస్) ఏకకాలంలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు తెరపై సరికొత్త ప్రయోగాలు
తన కెరీర్ ఎంపికల గురించి తేజ స్పందిస్తూ.. "తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త తరహా కంటెంట్‌ను అందించడానికే ప్రాధాన్యత ఇస్తాను. అది నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. 'జాంబి రెడ్డి'తో తెలుగులో తొలిసారి జాంబి జానర్‌ను, 'హనుమాన్'తో తొలి ఇండియన్ సూపర్‌హీరో కాన్సెప్ట్‌ను పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది" అని వెల్లడించారు.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న పవర్ ఫుల్ రియాలిటీ షో 'ది ట్రైటర్స్ తెలుగు' (The Traitors Telugu)కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర వీక్షకులను కూడా తేజ సజ్జా విశేషంగా అలరిస్తున్నారు. ఒకవైపు బిగ్ స్క్రీన్ ప్రయోగాలు, మరోవైపు ఓటీటీ రియాలిటీ షోలతో తేజ సజ్జా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యంగ్ స్టార్‌గా దూసుకెళ్తున్నారు.