...
...
Next Story

Teja Sajja The Traitors: తేజ సజ్జా ది ట్రైటర్స్ తెలుగు.. ఆ 20 మంది కంటెస్టెంట్లు వీళ్లే.. లిస్టులో చిన్మయి, హర్షవర్దన్

Teja Sajja The Traitors: తేజ సజ్జా ది ట్రైటర్స్ షో ట్రైలర్ తోపాటు ఇందులో పాల్గొనబోయే 20 మంది సెలబ్రిటీల లిస్ట్ కూడా వచ్చేసింది. ఇందులో చిన్మయి శ్రీపాద, హర్షవర్దన్, ప్రగతిలాంటి వాళ్లు ఉండటం ఆసక్తి రేపుతోంది.

Published on: Oct 6, 2026, 18:23:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Teja Sajja The Traitors: టాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ తేజ సజ్జా (Teja Sajja) హోస్ట్‌గా డిజిటల్ స్పేస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. గ్లోబల్ హిట్ రియాలిటీ ఫార్మాట్ 'ది ట్రైటర్స్ తెలుగు' (The Traitors Telugu) ట్రైలర్‌ను ప్రైమ్ వీడియో అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. 20 మంది ప్రముఖ సెలబ్రిటీలతో సాగే ఈ మైండ్ గేమ్ షో అక్టోబర్ 15 నుంచి డిజిటల్ ప్రియులను అలరించేందుకు రెడీ అయిపోయింది.

మైండ్ గేమ్స్, వెన్నుపోట్లు.. 'ది ట్రైటర్స్' కాన్సెప్ట్ ఏంటి?

Teja Sajja The Traitors: తేజ సజ్జా ది ట్రైటర్స్ తెలుగు.. ఆ 20 మంది కంటెస్టెంట్లు వీళ్లే.. లిస్టులో చిన్మయి, హర్షవర్దన్
Teja Sajja The Traitors: తేజ సజ్జా ది ట్రైటర్స్ తెలుగు.. ఆ 20 మంది కంటెస్టెంట్లు వీళ్లే.. లిస్టులో చిన్మయి, హర్షవర్దన్

గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించిన ఇంటర్నేషనల్ రియాలిటీ ఫార్మాట్ ఆధారంగా ఈ ది ట్రైటర్స్ షో తెరకెక్కింది. హిందీ వర్షన్ సక్సెస్ సాధించిన తర్వాత, ఇప్పుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప్రైమ్ వీడియో దీనిని సరికొత్తగా డిజైన్ చేసింది.

ఈ షోలో పాల్గొనే 20 మంది సెలబ్రిటీలను 'ఇన్నోసెంట్స్' (Innocents), 'ట్రైటర్స్' (Traitors) అని రెండు గ్రూపులుగా విడదీస్తారు. సీక్రెట్‌గా ఉండే 'ట్రైటర్స్' ఎవరనేది కనిపెట్టడం ఇన్నోసెంట్స్ ముందున్న అసలు ఛాలెంజ్.

ఒకరినొకరు నమ్మడం, వెన్నుపోటు పొడవడం, సైకలాజికల్ మైండ్ గేమ్‌లతో నామినేట్ చేసుకోవడం లాంటి ఊహించని ట్విస్టులు ఈ 10 ఎపిసోడ్లలో రచ్చ చేయబోతున్నాయి. ప్రతీ సంభాషణ ఒక క్లూ ఇవ్వచ్చు, లేదా తప్పుడు వ్యక్తిని ప్రమాదంలో పడేయవచ్చు.

చిన్మయి నుంచి హర్షవర్ధన్ వరకు.. 20 మంది సెలబ్రిటీల లిస్ట్

ఈ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, పాపులర్ యాక్టర్ హర్షవర్ధన్, తెలుగు సీనియర్ నటి ప్రగతి మహావది, నటుడు విష్ణు ఓయ్, కమెడియన్ విద్యుల్లేఖా రామన్ ఇందులో మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు.

'హనుమాన్' (HanuMan) సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సంచలన విజయాన్ని అందుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు మొదటిసారిగా యాంకరింగ్ అవతారంలోకి మారడం విశేషం. హోస్ట్‌గా తనదైన స్పాంటేనిటీతో షోను నడిపించనున్నారు.

ఈ షో గురించి తేజ మాట్లాడుతూ.. "హోస్ట్‌గా చేయడం నాకొక ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్. అంతర్జాతీయంగా సూపర్ హిట్ అయిన ఫార్మాట్‌ను తెలుగు ఆడియన్స్ ముందుకు తేవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి నిమిషం మలుపులు తిరిగే ఈ గేమ్ ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది" అని వెల్లడించారు.

ఈ షోను SOL ప్రొడక్షన్స్ నిర్మించగా, అక్టోబర్ 15 నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రైమ్ వీడియోలో ఒక కొత్త ఎపిసోడ్ ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks