తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా టికెట్ల ధరల పెంపుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 ఘటన తర్వాత తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదని చెప్పిన ఆయన.. తాజాగా ధరల పెంపుకు అనుమతి ఇస్తామని చెబుతూనే ఓ షరతు విధించారు. అదేంటో చూడండి.
జీవో తెస్తాం.. కానీ వాళ్లకూ వాటా ఇవ్వాల్సిందే

తెలంగాణలోనూ సినిమా టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేస్తామని, అయితే అది జరగాలంటే టికెట్ల పెంపు వల్ల వచ్చిన ఆదాయంలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం (అక్టోబర్ 28) హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సినీ కార్మికులు కలిసి సీఎంకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందే రేవంత్ ఈ కామెంట్స్ చేశారు.
“పెద్ద పెద్ద సినిమాల హీరోలు, ప్రొడ్యూసర్లు వాళ్ల సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన.. పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమాల టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది. నిర్మాతలకు వస్తుంది. మరి సినీ కార్మికులకు మాత్రం అదనంగా ఒక్క రూపాయి రావడం లేదు. అందుకే ఈ వేదికపై నుంచి మీకు మాట ఇస్తున్నా.. ఆ ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమయంలో ఆయన వెనుకాలే ఉన్న నిర్మాత దిల్ రాజు నవ్వుతూ, చప్పట్లు కొడుతూ కనిపించాడు.
ప్రతి రూపాయిలో వాటా
రేవంత్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. “మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి. భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీది నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా.. భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత పేరున్న వ్యక్తి అయినా.. రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20 శాతం కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కింద నగదు బదిలే జరిగితేనే ప్రభుత్వం జీవో ఇస్తుందని, ఆమేరకు నిబంధనలను సవరిస్తానని మాట ఇస్తున్నాను” అని రేవంత్ రెడ్డి అన్నారు.
{{/usCountry}}రేవంత్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. “మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి. భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీది నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా.. భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత పేరున్న వ్యక్తి అయినా.. రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20 శాతం కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కింద నగదు బదిలే జరిగితేనే ప్రభుత్వం జీవో ఇస్తుందని, ఆమేరకు నిబంధనలను సవరిస్తానని మాట ఇస్తున్నాను” అని రేవంత్ రెడ్డి అన్నారు.
{{/usCountry}}